Categories: Uncategorized

మహిళా రక్షణ చట్టాలు, హక్కులు, బాల్య వివాహం, వరకట్న నిషేధం

Advertisements

మహిళా రక్షణ చట్టాలు, హక్కులు, బాల్య వివాహం, వరకట్న నిషేధం

ప్రపంచ వ్యాప్తంగా ఆడ పిల్లలు, మహిళలు ఇంటా బయట హింస వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఇది వారి మానసిక శారీరక ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది. చాలా మంది యువతులు స్వేచ్ఛగా బయటి తిరగడానికి సాహసించడం లేదు.

అలాగే ఆడపిల్లలు బడికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు మాటలతో వేధించడం బాధించడం తక్కువ చేసి మాట్లాడటం మీరు ఏమీ చేయలేరు అని ఎగతాళి చేయడం శారీరకంగా మానసికంగా లైంగికంగా హింసించడం వంటివి మన చుట్టుపక్కల గమనించడం కాకుండా టీవీలో వార్తలు, పత్రికల్లో కూడా చూస్తున్నాం.

Working Women

ఈ సంఘటన వారి మానవ హక్కుల ఉల్లంఘనే చేయబడుతున్నాయి అనడానికి నిదర్శనం వీటిని అరికట్టడానికి ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేసినప్పటికీ వాటిపై చాలా మందికి అవగాహన లేదు బాధితులకు ప్రభుత్వం నుండి ఏ విధమైన రక్షణ సాయం ఎక్కడ ఎలా పొందవచ్చు నాకు కూడా తెలియదు.

తమ రక్షణకు సంబంధించిన చట్టాలపై బాలికలు మహిళలు అందరూ అవగాహన పొందాలి అప్పుడే తమని తాము అన్ని హింస నుండి వేధింపులు నుండి రక్షించుకోవడానికి వీలవుతుంది.

ఆడపిల్లలు స్త్రీలు గోప్యంగా తమ బాధలను చెప్పుకోవడానికి అవసరమైన యంత్రాంగం ఉన్నదా ఉంటే అక్కడ ఏ రూపంలో మొదలగు అంశాలను చూద్దాం.

మన సమాజంలో బాలల మహిళల హక్కుల ఉల్లంఘన అనేక రూపాల్లో జరుగుచున్నది. అది కుటుంబంలో కావచ్చు పనిచేసే కార్యాలయంలో కావచ్చు ఈ విధమైన మానవ హక్కుల ఉల్లంఘన ఇంకా ఎంత కాలం కొనసాగాలి బాలల సమగ్ర అభివృద్ధిని కాలరాస్తున్న పరిస్థితులను సమాజ వైఖరులను చక్కదిద్దాల్సిన అవసరం ఎంతో ఉన్నది.

ఇందుకోసం ప్రభుత్వం చేసిన చట్టాల సక్రమ అమలు ద్వారా బావ బాలికల స్వేచ్ఛగా తమ జీవితాన్ని ఆనందముగా గడపడానికి వీలవుతుంది.

ఐక్యరాజ్యసమితి 1989లో రూపొందించిన బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడికను పై 191 దేశాలు సంతకాలు చేసే వీటిలో మన దేశం కూడా ఒకటి ప్రజలందరికీ ఏ విధమైన వివక్షత లేకుండా గుర్తించబడతాయి.

బాలల హక్కులు

 • లింగ భేదం లేకుండా 18 సంవత్సరాల లోపు వ్యక్తులందరూ బాలలే.
 • ప్రభుత్వపరంగా బాలల హక్కులను భద్రత కలిగించటం.
 • జీవించే హక్కు.
 • సాధ్యమైనంతవరకూ బాలల తల్లిదండ్రులతో కలిసి జీవించడం.
 • విషయ పరిజ్ఞానం పెంచుకోవటం సమాచార సాధన లైన్ రేడియో వార్తా పత్రికలు పుస్తకాలు టీవీ ద్వారా ప్రపంచంలో వషియాలపై అవగాహన పెంచుకునే హక్కు బాధాకరమైన దౌర్జన్య కరమైన హానికరమైన సంఘటనలు జరక్కుండా రక్షణ పొందే హక్కు
 • బాలలకు ఏదైనా శారీరక కారణాలు ఉంటే వారు సంపూర్ణమైన జీవితం గడపడానికి అభివృద్ధిలో రావటానికి ప్రత్యేక విద్య ప్రత్యేకమైన సంరక్షణ పొందే హక్కు.
 • బాలలు సంపూర్ణ ఆరోగ్యం వైద్య సౌకర్యం పొందే హక్కు.
 • కొంత సమయం ఆటలాడుకునే హక్కు.
 • బాలల విద్య కు ఆరోగ్యానికి హాని కలిగించే పని చేయకుండా ఉండటం.
 • బాలలు బంధింపబడిన నిర్లక్ష్యం చేయబడిన సరిగ్గా చూడకపోయినా సహాయం పొందే హక్క.
 • పిల్లలు పెద్దలు ప్రజలంతా ఈ ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల ఒడంబడిక గురించి అవగాహన కలిగి ఉండాలి ప్రభుత్వం ప్రజలందరికీ దీని గురించి తెలియజేయాలి.

బాల్య వివాహాలు నిషేధ చట్టం 2006


బాలుడు అంటే 21 సంవత్సరాలు నిండిన వారు, బాలిక అంటే 18 సంవత్సరాలు నిండిన వారు. వివాహ సమయంలో వీరి ఇరువురిలో ఏ ఒక్కరు వయసు అయినా తక్కువ ఉంటే అది  బాల్యవివాహం పరిగణిస్తూ ఉంటాం.

ఒకవేళ పురుషుడు 20 సంవత్సరాలు పైబడిన వారు బాల్య వివాహం చేసుకుంటే అతడికి ఎలాంటి వివాహం చేసుకున్నవారికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష లేక లక్ష రూపాయల వరకు జరిమానా విధించవచ్చు ఇలాంటి వివాహం చేసుకున్నవారు లేదా వాటిని ప్రార్థిస్తున్న వారు బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 ప్రకారం నేరస్తులు అవుతారు శిక్షించు పడతారు.

బాల్య వివాహం అయిన తర్వాత ఆ బాలిక తిరిగి వివాహం అయ్యే వరకు పురుషుడు మనోవర్తి చెల్లించాలి. బాల్య వివాహం నుండి బయట పడిన పిల్లలు సంరక్షణకై ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది. వివాహ సమయంలో ఇచ్చిన కానుకలు ను వివాహం అయిన తర్వాత తిరిగఇివాల్సి ఉంటుంది.

బాల్య వివాహాల దుష్ఫలితాలు

 • చిన్న వయసులో గర్భవతి కావడం.
 • ఆడపిల్లల అక్రమ రవాణా అమ్మకానికి అవకాశం ఏర్పడడం.
 • ఎదుగుదల లేని పిల్లలను బలవంతంగా కుటుంబ వ్యవస్థలోకి నెట్టివేయడం.
 • అధిక సంఖ్యలో గర్భవిచ్ఛిత్తి నెలలు నిండకముందే ప్రసవం జరుగుతుంది. ఫలితంగా మాతృ మరణాల శిశుమరణాల సంఖ్య పెరగటం వైకల్యంతో కూడిన సుజనా లేదా మృత్యు శిశువు జన్మించడం.
 • మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తడం.
 • చదువుకు ఆటంకం.
 • శారీరక ఎదుగుదలకు ఆటంకం

అక్రమ రవాణా నిరోధక చట్టం సవరణ 2006


బాలికలను యువతులను ఉద్యోగం లేక పని ఇస్తామని సినిమాలో చేరుస్తామని మంచి భవిష్యత్ చూపిస్తానని చెప్పి వేరే పట్టణ ప్రాంతాలకు తీసుకువెళ్లి వారి వేరే వారికి అమ్మేసి వారిచే బలవంతంగా వ్యభిచారం చేయించిన వారు చెప్పినట్లు చేయకుంటే కొట్టి హింసించి బలవంతంగా చేయిస్తారు. ఒక్కొక్కసారి శరీర అవయవాలను కూడా తొలగిస్తారు.

ఆశ చూపి ఒక స్థలము నుండి వేసి గృహానికి. తీసుకువెళ్లడం ఇష్టపడి వచ్చిన నేరం అవుతుంది.

అలాగే వృత్తిలోకి బలవంతంగా దించడానికి ఏ బంధం చేయడం లేక ప్రోత్సహించడం నేరం.

వరకట్న నిషేధ చట్టం 1961


కట్నం ఇవ్వడం కట్నం తీసుకోవడం కదా ఈ రెండింటికీ తోడ్పడటం కట్నం అడగడం అనేది నేరాలు.

ఈ చట్టం ఉల్లంఘించిన వారికి ఐదు సంవత్సరాలు తప్పకుండా జైలు శిక్ష 15 వేల వరకూ జరిమానా లేదా కట్నం విలువ మొత్తం లో ఏది ఎక్కువైతే ఆ మొత్తం లో ఏది ఎక్కువైతే అది జరిమానాగా విధించబడును.

చాలా సందర్భాల్లో వివాహమైన తర్వాత అమ్మాయిని విధించడం తిట్టడం కొట్టడం ఒక్కొక్కసారి చనిపోవడం కొన్నిసార్లు బాధలు భరించలేక స్త్రీలు ఆత్మహత్య చేసుకోవడం మొదలైనవన్నీ చట్టం పరిధిలోకి వస్తాయి.

అయితే తల్లిదండ్రులు ఎవరు నుండి ఒత్తిడి లేకుండా తమ ఇష్టానుసారంగా ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఈ కానుకలు కూడా చట్ట ప్రకారమే ఇవ్వాలి.

 • కానుకలు అన్నింటిని జాబితా విడిగా ఉండాలి.
 • కానుకలను అడిగి తీసుకోరాదు.
 • వధువునకు ఇచ్చే కానుకలు ఆచారం సంప్రదాయం ప్రకారం ఇవ్వవలసిన వై ఉండాలి. వాటి విలువ ఆమె తల్లిదండ్రులు స్తోమత కి తగ్గట్లుగా ఉండాలి తప్ప వారి తలకు మించిన భారం కాకూడదు.
 • మహిళలపై హింస జరుగుతున్న విషయాన్ని బాధితులు స్వయంగా లేదా ఆమె తండ్రి లేదా తల్లి లేదా సోదరుడు లేదా సోదరి లేదా బంధువులు ఎవరైనా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయవచ్చు.

గృహహింస నుండి మహిళలకు రక్షణ

మన రాజ్యాంగం పౌరులందరికీ గౌరవంగా బతికే హక్కును ఇచ్చింది. స్త్రీలు కూడా పౌరులే. వారు గౌరవంగా బతకడం అంటే వారిని ఎవరూ దూషించే కుండా ఆహ్వానించకుండా ఉండటం.

స్త్రీలు చేసే పనిని గౌరవించడమే కాక వారికున్న హక్కులను అనుభవించేటట్లు పరిస్థితులు కల్పించడం. స్త్రీలు మనుషులుగా అన్ని హక్కులను వినియోగించుకోకుండా వారి విలువ గౌరవం దెబ్బతినే చర్యలు పరిస్థితులు కుటుంబం నుండి మొదలవుతాయి.

కుటుంబంలో జరిగే ఈ హింస పూరిత చర్యలు స్త్రీలను వేస్తూ వారి అభివృద్ధికి ఆటంకం అవుతున్నాయి.

ఈ గృహహింస తీవ్రతతో స్వభావంలో రూపంలో తేడా ఉండొచ్చు. దాని ఇది ప్రపంచ వ్యాప్తంగా స్త్రీల అభివృద్ధికి ఆటంకం అయిన ఒక పెద్ద సమస్య కాబట్టి కుటుంబం హింస అంటే ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగతమైన సమస్య కాదు.

స్త్రీలపై జరిగే ఏం సరైన అది వ్యక్తిగతం కాదు దాని వెనుక రాజకీయం ఉంటుందని స్త్రీల ఉద్యమం గత 20 సంవత్సరాలుగా నొక్కి చెబుతుంది.

ఆ పోరాటాల ఫలితంగా స్త్రీల కు కొంత వరకు రక్షణ కలుగ చేయడానికి కొన్ని ప్రత్యేక చట్టాలు వచ్చాయి. అయినప్పటికీ ఆ చట్టాల నిర్వచనంలో ఆచరణలో యంత్రాంగంలో కీలకమైన పోలీసు న్యాయ వ్యవస్థ ఇతర సహాయక సంస్థలకు స్త్రీల సమస్యల పట్ల అణిచివేత పట్ల వారి పై జరిగే హింస పట్ల అవగాహన సున్నితత్వం లేకపోవడం వల్ల చట్టాల నుండి కూడా నిరుపయోగంగా తయారయ్యాయి.

ఒక వైపు కుటుంబం సమాజం ఈ హింసను సమర్థిస్తూనే ఉన్నా జాతీయంగా అంతర్జాతీయంగా ప్రభుత్వాలు స్త్రీలపై జరిగే హింస ను గుర్తించి దాన్ని ఆపడాని.కి కొన్ని ఒప్పందాలు తీర్మానాలు తయారు చేశాయి.

ఈ తీర్మానాల్లో స్త్రీల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు చేపట్టవలసిన చర్యలు కూడా సూచించారు. ఈ తీర్మానాల్లో అనేక దేశాలతో పాటు మన దేశం కూడా సంతకం చేసి ఆ నిబంధనలకు కట్టుబడి ఉంది.

లైంగిక అత్యాచారం వేధింపులు


ఇటీవల మనదేశంలో ఈ రకమైన వేధింపుల నిరోధానికి లైంగిక అత్యాచార నియంత్రణకు జస్టిస్ జెఎస్ వర్మ అధ్యక్షతన ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది.

ఈ కమిటీ సూచించిన అంశాలు ప్రతిపాదించిన భారత రాష్ట్రపతి 2 ఫిబ్రవరి 2013 ఆర్డినెన్స్ను జారీ చేశారు దీని ముఖ్యాంశాలు.

 • కనీసం 20 సంవత్సరాలు జైలు శిక్ష.
 • బాధితుల నుండి ఫిర్యాదులు తీసుకోవడానికి మహిళా పోలీసులు నియమకం.
 • బాధితులు వ్యక్తిగతంగా పోలీసు అధికారుల ముందు ఉపస్థితి కావాల్సిన అవసరం లేదు.
 • మహిళలపై యాసిడ్ దాడి సందర్భంలో జరిగిన పెనుగులాటలో దాడి చేసిన వారు మరణించిన మహిళలు ఎలాంటి శిక్ష లేదు.
 • ఫిర్యాదు విచారణ సందర్భంగా బాధితులు కోరికమేరకు వీడియో చిత్రీకరణ అవకాశం కల్పించబడుతుంది.
లోక్ అదాలత్

లోక్ అదాలత్ అనగా ప్రజా న్యాయస్థానం న్యాయం దృష్టిలో అందరూ సమానులే అన్యాయానికి గొప్ప బీద అనే తేడా లేదు. అందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి ముఖ్యంగా ఏ పౌరుడు ఆర్థిక కారణాల మూలంగా గానీ మరే ఇతర కారణాల మూలంగా గానీ మరి ఇతర బలహీనత మూలంగా కానీ న్యాయం పొందే అవకాశాలను కోల్పోకుండా ఉండడం కోసం ఉచిత న్యాయ సహాయం అందించాలని ప్రభుత్వం భావించింది.

బీద బలహీన వర్గాల వారికి న్యాయ సహాయం అందుబాటులోకి తేవడం కోసం వారికి సామాజిక ఆర్థిక న్యాయాలు కల్పించడం కోసం ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని నిశ్చయించినారు.

ఫలితంగా 1976వ సంవత్సరంలో భారత రాజ్యాంగానికి అధికరణ 39 ఏ జతచేసి బీద బలహీన వర్గాల వారికి ఉచిత .న్యాయ సహాయాన్ని అందించాలని నిశ్చయించారు

Hari Shankar Sharma

Recent Posts

బాలల హక్కుల పరిరక్షణ మరియు అభివృద్ధి Protection, and development of children’s rights

బాలల హక్కులు Children's rights నేటి బాలలు, రేపటి భావి భారత పౌరులు. నేటి పిల్లలే రేపటి పెద్దలు. రేపటి…

2 months ago

ప్రపంచంలో అనేక ఖండాలు -భారతదేశం మరియు మహా సముద్రాలూ

ఖండాలు -మహా సముద్రాలూ మరియు భారతదేశం దేశాలు ఉన్న విశాల భూభాగాన్ని మనం మన సౌలభ్యం కోసం సాధ్యమైనంత వరకు…

4 months ago

అంతరిక్ష రంగం మరియు ప్రయోగాలు

అంతరిక్ష రంగం భూమి చుట్టూ ఉన్న ప్రదేశమును అంతరిక్షం లేదా ఖగోళం లేదా రోదశి అని అంటారు. దీని గురించి…

6 months ago

వాతావరణం మరియు గాలి

వాతావరణం అంటే ఏంటి? మన చుట్టూ ఉండే గాలే వాతావరణం. ఈ గాలిలో అనేక వాయువులు, దుమ్ము, దూళి, నీటి ఆవిరి…

7 months ago

అనేక రకాల శక్తి రూపాలు మరియు వాటి ఉపయోగాలు (Many form of Energy and uses)

శక్తి (Energy)     పని చేయగల సామర్థ్యాన్ని శక్తీ అనీ పిలుస్తారు. పని, శక్తి రెండూ ఒకే ప్రమాణం కలిగి…

7 months ago

రక్త ప్రసరణ వ్యవస్థ మరియు రకాలు

రక్తం, గుండె మరియు ప్రసరణ వ్యవస్థ రక్తనాళాలను, హృదయాన్ని కలిపి రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. రక్త ప్రసరణను మొదటిసారిగా…

8 months ago