Categories: Uncategorized

అనేక రకాల శక్తి రూపాలు మరియు వాటి ఉపయోగాలు (Many form of Energy and uses)

శక్తి (Energy)

పని చేయగల సామర్థ్యాన్ని శక్తీ అనీ పిలుస్తారు. పని, శక్తి రెండూ ఒకే ప్రమాణం కలిగి ఉంటాయి. కాబట్టి శక్తి ప్రమాణం కూడా joul.

భౌతిక శాస్త్రంలోపనికి, శక్తి కి సమాన ప్రాధాన్యత ఉంటుంది. పని వల్ల శక్తిని శక్తి వల్ల పని పొందవచ్చు.

సామర్థ్యం అంటే ఏంటి? (What is Capacity?)

పని జరిగే రేటు నీ సామర్ధ్యం అంటారు. S.I  పద్ధతిలో సామర్ధ్యానికి ప్రమాణం వాట్. సామర్ధ్యం అదిశా రాశి. వాడుకలో ఉన్న అతిపెద్ద ప్రమాణం అశ్వ సామర్ధ్యం.

సామర్ధ్యం Capacity = పని (Work)/కాలం (Time)

విద్యుత్ మోటార్ సామర్థన్నిగురించి మాట్లాడే తప్పుడు, అశ్వ సామర్ధ్యం అనే ప్రమాణాన్ని ఉపయోగిస్తారు.

ఒక అశ్వ సామర్ధ్యం =  746 వాట్స్ watts
           

శక్తి లో అనేక రకాలు (Many types of Energy)

శక్తి అనేక రూపాలలో తన ఉనికిని ప్రదర్శిస్తూ ఉంటుంది. రసాయన శక్తి, యాంత్రిక శక్తి, ఉష్ట్ శక్తి, అణు శక్తి, విద్యుత్ శక్తి, మొదలగునవి. వివిధ పరికరాలు ఒక రకమైన శక్తి నీ మరొక శక్తి గా మారుస్తాయి.

 1. హీటర్ -విద్యుత్ శక్తి- ఉష్ట శక్తి
 2. డైనమో -యాంత్రిక శక్తి -విద్యుత్ శక్తి
 3. కాలింగ్ బెల్ -విద్యుత్ శక్తి -ధ్వని శక్తి
 4. సోలార్ హీటర్- కాంతి శక్తి -ఉష్ఠ శక్తి
 5. బల్బ్- విద్యుత్ శక్తి కాంతి -శక్తి, ఉస్ట శక్తి

యాంత్రిక శక్తి రెండూ రకాలు


స్థితీజ శక్తి

ఒక వస్తువు దాని స్థానం నుంచి లేదా స్థితి వల్ల లభ్యమైన శక్తిని స్తితిజ శక్తి అంటారు.

స్థితి శక్తి = mgh

వస్తువు పొందే స్థితి శక్తి దాని ద్రవ్యరాశి, దాని ఎత్తులపై ఆధారపడి ఉంటుంది.

 1. m – ద్రవ్యరాశి.
 2. h – ఎత్తు.
 3. g – గురుత్వ త్వరణం.

ఉదాహరణలు
 

 1. ఎత్తుగా ఉన్న రిజర్వాయర్ లో నిల్వ ఉన్న చేసిన నీరు.
 2. లోహా సిలిండర్ లో పీడనం తో నింపిన వాయువులు.
 3. పండగల కర్రలో సాగడియపడిన పట్టి.
 4. ధనుస్సు లో సంధించిన భాణం.
 5. నొక్కిన స్పింగ్.

గతి శక్తి

ఒక వస్తువు కు దాని చలనం వలన లభ్యమైన శక్తిని, గతి శక్తి అంటారు.

గతి శక్తి = 1/2mv 2

ఉదాహరణలు

 1. రంపపు మిల్లు లో అతి వేగంగా తిరిగే రంపం పెద్ద-పెద్ద దుంగలను కూడా సులువుగా త్వరగా ముక్కలు చేస్తుంది.
 2. తుఫాను గాలి కి విద్యుత్, టెలిఫోన్ స్తంభాలను మెలి తిప్పుతూ ఉంటాయి.
 3. వేగంగా తగిలిన రాయి కిటికీ అద్దాన్ని పగులకొడుతుంది.
 4. తుపాకీ నుంచి పేల్చిన తుపాకీ గుండు ప్రాణాన్ని తేయగలుగుతుంది.
 5. ఆకాశంలో ఎగిరే చిలకమ్మా కు స్తితి శక్తి, గతి శక్తి రెండూ ఉంటాయి.
 6. కదులుతున్న వాహనం లోపల ఉన్న ప్రయాణికులు యాంత్రిక శక్తిని కలిగి ఉంటారు.
 7. ఆకాశంలో ఎగిరే విమానం స్థితి శక్తి మరియు గతి శక్తిని కలిగి ఉంటుంది.
 8. గగన తలంలో విమానాలు, రాకెట్స్ ,మేఘాలు, బెలూన్ ,పక్షులు, గాలిపటం మొదలగునవి  యాంత్రిక శక్తిని కలిగి ఉంటాయి.
 9. ఎత్తు నుంచి భూమి మీదకు పడే వస్తువు భూమిని తాకే ముందు అత్యధిక గతిజ శక్తిని కలిగి ఉంటుంది. ఒక వస్తువు  గతిజ శక్తుల, స్థితీ  శక్తుల మొత్తాన్ని యాంత్రిక శక్తి అంటారు.

యాంత్రిక శక్తి = స్థితి శక్తి+గతిజ్ శక్తి
   

శక్తి నిత్యత్వ నియమం

శక్తిని సృష్టించ లేము లేదా నాశనం చేయలేము . ఒక రూపంలో నుండి మరొక రూపంలోకి మార్చవచ్చు. మొత్తం శక్తి పరిమాణం స్థిరంగా ఉంటుంది.

స్వేచ్ఛగా  కిందకు పడుతున్న వస్తువు స్థితిశక్తి క్రమంగా తగ్గి ,గతి శక్తి క్రమంగా పెరుగుతుంది. కానీ అన్ని బిందువుల వద్ద వాటి మొత్తం స్థిరం.

శక్తిని ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మార్చే పరికరాన్ని “ట్రాన్స్ ద్యుసర్ “అంటారు.
  

ధ్రవ్యవేగం

ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి మరియు దాని వేగాల లబ్దాన్ని ద్రవ్య వేగం అంటారు. ద్రవ్యవేగ నిత్యత్వ సూత్రం ఆధారంగా తుపాకీ ,రాకెట్ ,జెట్ విమానాలు మొదలగునవి పనిచేస్తాయి.

వాహనాలు నడవడానికి పెట్రోల్ డీజిల్ వంటి ఇంధనాలు అవసరం. ఎడ్ల బండి, రిక్షా వంటి వాహనాలకు ఇంధనాలు అవసరం లేదు. మనమే మనకున్న శక్తి వల్ల వాటిని లాగడం లేదా నడపడం చేయగలుగుతున్నాం.

వాహనాలు, కొన్ని వస్తువులు కూడా డీజిల్, పెట్రోల్ వంటి ఇంధనం తో పాటు విద్యుత్ శక్తి , గ్యాస్ తో కూడా పనిచేస్తాయి. మనం తీసుకునే ఆహారం వల్ల మనకు శక్తి లభించిన విధంగానే వాహనాలకు లేదా వస్తువులకు  వాటిని ఉపయోగించే ఎందనాలవల్ల శక్తి లభిస్తుంది.

పనులు జరగడానికి వాహనాలు నడవడానికి మరియు వస్తువులు పనిచేయడానికి శక్తి అవసరం. కొన్ని వస్తువులకు విద్యుత్ శక్తి అవసరమైతే, మరికొన్నింటికి సౌరశక్తి ,కొన్నింటికి ఇంధన శక్తి అవసరం అవుతాయి.

వీటి వల్ల ఆయా వస్తువుల సామాగ్రి పనిచేయడానికి శక్తి లభిస్తుంది. ఇవన్నీ పని చేయడానికి మూలం శక్తి. శక్తి వివిధ రకాల వనరుల నుండి లభ్యం అవుతుంది.

శక్తి వనరులు

శక్తి వనరులు  వివిధ రకాలుగా లభ్యమవుతున్నాయి. అవి సూర్యుడు, గాలి, నీరు, పెట్రోలు, డీజిల్, కిరోసిన్, గ్యాస్ బొగ్గు మొదలగునవి. వీటిలో పెట్రోల్, డీజిల్, కిరోసిన్, గ్యాస్, బొగ్గు, నీరు మొదలగునవి శక్తి వనరులు వినియోగిస్తే అయిపోతాయి.

కానీ గాలి, సూర్యుడు శక్తి వనరులో ఎంత వినియోగించుకున్న తరిగిపోవు. ఈ ప్రపంచానికి శక్తి అవసరం చాలా ఉంది. ఏ పని జరగాలని వీటి అవసరం రోజురోజుకూ పెరుగుతూ ఉంది.

ప్రస్తుత పరిస్థితులలో ఉత్పత్తి సరిపోవడం లేదు. అందువలన ఈ ఉత్పత్తులు అవసరం బాగా పెరిగింది.
 

శక్తి వనరులు రెండు రకాలు

 1. తరిగిపోయే శక్తులు
 2. తరిగిపోని శక్తులు

తరిగిపోయే శక్తులు

పదార్థాలను మండించడం ద్వారా వచ్చే శక్తి ఇంధన శక్తి. వంటచెరుకు, బొగ్గు, కిరోసిన్, గ్యాస్, పెట్రోల్, డీజిల్ మొదలైనవి ఇంధనాలు. వీటిని మండించి వచ్చే  శక్తి తో విద్యుత్ తయారీ, వాహనాలు నడపడం, పరిశ్రమ యంత్రాలను పని చేయించడం మొదలైన పనులు చేస్తారు.

ఈ ఏందన్నా లను భూమి నుండి వెలికి తీస్తారు. లక్షల సంవత్సరాల క్రితం ఉన్న చెట్లు, జంతువులు భూమి లోపలకు చేరి  ఇంధనాలుగా మారతాయి. ఈ విధంగా భూమిలో  లభించే ఎం దానాలు అనగా పెట్రోల్, బొగ్గు, సహజ వాయువును మనం బయటకు తీసి వాడుతున్నాం.

ఇవి ఇలా వాడుతుంటే కొన్ని సంవత్సరాలకి తరిగిపోతాయి. ఇవి మళ్ళీ తయారు కావడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. అందుకే ఇలాంటి శక్తి వనరులను పొదుపుగా వాడటం అలవాటు చేసుకోవాలి.

ప్రధానంగా వంట చెరుకును వాడడం తగ్గించుకొని సహజవాయువును ఉపయోగించడం మంచిది. సహజవాయువును ఈమధ్య కూడా ఉత్పత్తి చేస్తున్నారు. దీనిని “గోబర్ గ్యాస్ ” అంటారు. వీటిని కూడా పొదుపుగా వాడాలి.

పెట్రోల్, డీజిల్ వంటివి ఎంత పొదుపుగా వాడితే అంత మంచిది. ఇంట్లో విద్యుత్ శక్తిని అనవసరంగా వినియోగించరాదు. ఫ్యాన్లు, టీవీని మొదలగు వాటిని వీలైనంత మేరకు పొదుపుగా వాడాలి. విద్యుత్తును పొదుపు చేస్తే అన్ని పొదుపు చేసినట్లు. తరిగిపోయే శక్తి వనరులను కాపాడుకోవడం మనందరి బాధ్యత.

తరిగిపోని శక్తి వనరులు

కోట్ల సంవత్సరాల నుండి ప్రసరిస్తున్న సూర్యకిరణాలు, గాలి వంటి వనరులను మనం ఎంత వాడుకున్న తరిగిపోవు .ఇటువంటి శక్తి వనరులను “తరిగిపోని శక్తి వనరులు “అంటారు. భూమి నుండి వెలికితీసే పెట్రోల్ ,డీజిల్, కిరోసిన్, గ్యాస్ తరిగిపోతుంటాయి.
          

సౌర శక్తి

ఆధునిక కాలంలో ఎక్కువగా వినియోగించుకున్న తరిగిపోని శక్తి వనరులు సౌరశక్తి ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వర్షాదారం లేని ప్రాంతాలలో రైతులకు అండగా ఈ సౌరశక్తి నిలుస్తుంది.

సూర్యుని నుండి వచ్చే కాంతి కిరణాలు ఒకే బిందువు వద్ద కేంద్రీకరించి వాటిని బ్యాటరీల రూపంలో నిల్వ చేసి కొని విద్యుత్ శక్తి లేని సమయంలో ఈ సౌర శక్తి ని వినియోగించుకొని పల్లె ప్రాంతాలలో నివసిస్తున్న రైతన్నలకు, వ్యవసాయం మంచి లాభం చేకూరుతుంది.

అంతే కాకుండా పెద్ద పెద్ద హోటల్స్ లో, దేవాలయాల దగ్గర మొదలగు ప్రదేశాలలో ఈ సౌరశక్తి వాడకం అనేది జరుగుతుంది. 

ఈ సౌరశక్తి ఖర్చు తక్కువగా ఉంటుంది  లాభం ఎక్కువ మొత్తంలో జరుగుతుంది. అందువల్ల ఈ సౌరశక్తిని పల్లె ప్రాంతాలలో నివసిస్తున్న సామాన్యుడి రైతు  కూడా దీనిని వాడేందుకు మక్కువ చూపిస్తున్నారు.

మనదేశంలో సౌరశక్తిని ఎక్కువగా ఉపయోగించే రాష్ట్రం గుజరాత్. ఈ రాష్ట్రంలో పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో సౌరశక్తితో పనిచేసే విద్యుత్ పరికరాలను వినియోగిస్తున్నారు. రేడియో, టెలివిజన్, కంప్యూటర్ వంటి వాటిని సౌరశక్తితో నే వినియోగిస్తున్నారు.

పవన శక్తి

పవనం అనగా గాలి. పవన శక్తిని ఎక్కువగా కొండ ప్రాంతాలలోనూ, సముద్ర తీరాల వెంబడి 15 అడుగుల ఎత్తు కలిగిన స్తంభాలకు గాలిమర లను ఏర్పాటు చేస్తారు.

గాలికి ఎదురుగా వీటిని ఏర్పాటు చేయటం వలన విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ పదిహేను అడుగుల ఎత్తు గల కొండల పైన, సముద్ర తీరాలలో ఏర్పాటు చేస్తారు. 

ఈ గాలి మరల ద్వారా తయారయ్యే విద్యుత్తును “పవన విద్యుత్తు” అని అంటారు. దీనిని  లైట్లు, ఫ్యాన్లు మొదలైన విద్యుత్ పరికరాలు పని చేయడానికి ఉపయోగించుకోవచ్చు  కొన్ని ప్రాంతాల్లో అయితే బావుల నుండి నీరు తీయడానికి కూడా దీనినే ఉపయోగిస్తున్నారు.

నీటి శక్తి

సూర్యకాంతికి, గాలికి శక్తి ఉన్నట్లే నీటికి కూడా చాలా శక్తి ఉంది .నీటి ద్వారా విద్యుత్ తయారు చేస్తే ఆ విద్యుత్ “జల విద్యుత్ “అని అంటారు. పెద్ద-పెద్ద ప్రాజెక్టులు నిర్మించి పెద్ద-పెద్ద  రిజర్వాయర్ లను ఉపయోగించి నీటి వేగాన్ని ఉపయోగించి టర్బైన్ లను తిప్పడం ద్వారా విద్యుత్ తయారు అవుతుంది.

మన రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు, నీటిని ఉపయోగించి జల విద్యుత్తును తయారు చేస్తున్నాము. పెద్ద-పెద్ద రిజర్వాయర్లో నీటి ని పంపి టర్బైన్లు తిప్పుతారు. ఇలా టర్బైన్లు తిరిగినప్పుడు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా పవర్ హౌస్ నుండి సరఫరా చేస్తారు. ఇలా నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను” జలవిద్యుత్ కేంద్రాలు” అంటారు.

బొగ్గుతో నీటిని వేడి చేసినప్పుడు వచ్చే నీటి ఆవిరితో టర్బైన్ లను తిప్పి కూడా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు .దీనినే “థర్మల్ విద్యుత్ ”   అంటారు. థర్మల్ విద్యుత్తు, జల విద్యుత్ లమధ్య తేడా ఏమీ ఉండదు  ఎక్కువగా జలవిద్యుత్ వినియోగించుకోవడం మంచిది.

శక్తి అన్ని పనులకు అవసరం. ప్రకృతిలో లభించే శక్తి వనరులను ఏ విధంగా వినియోగించుకోవాలో నేర్చుకుని ఆచితూచి వినియోగించాలి లేదంటే భవిష్యత్తులో శక్తి వనరులు దొరకడం కష్టతరంగా మారుతుంది.

శక్తి నిల్వ

 1. తక్కువ దూరాలకు నడిచి వెళ్లాలి. దాని ద్వారా ఇంధన పొదుపు తో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది.
 2. కార్లు, మోటార్ సైకిల్, బదులుగా సైకిల్ వాడాలి.
 3. సాధ్యమైనంతవరకు” ప్రజా రవాణా వ్యవస్థ”కు సంబంధించిన ఆర్టీసీ బస్సులు ,రైళ్లలో ప్రయాణించాలి. ఒకరిద్దరి కోసం కారును వాడి ఇంధనాన్ని ఖర్చు చేయరాదు. దీనివల్ల రోడ్డుపై రద్దీ మరియు పర్యావరణ కాలుష్యం ఏర్పడతాయి.
 4. పగటి వేళల్లో సూర్యరశ్మి వెలుతురులోనే పనులు చేసుకోవాలి. విద్యుత్ లైట్లను వాడకూడదు.
 5. చల్లదనం కోసం సాధ్యమైనంత వరకు మనం ప్రకృతిలోని గాలిని ఉపయోగించుకోవాలి. అవసరమైనప్పుడు మాత్రమే ఫ్యాన్ వాడాలి. ఇంటి చుట్టూ మొక్కలు , చెట్లను పెంచితే ఏ.సి. అవసరం ఉండదు .
 6. నీటిని వృధా చేయకూడదు. పొదుపుగా వాడాలి.
 7. మనకు ఆహారం ద్వారా శక్తి లభిస్తుంది. ఆహార పదార్థాలు వృధా చేయకూడదు. ఆహార పదార్థాలను ఎక్కువగా ఉడికించకూడదు. ఎందుకనగా ఎక్కువగా ఉడికించడానికి ఎక్కువ ఇంధనం అవసరం అవుతుంది. అట్లే పోషక పదార్థాలు కూడా నశిస్తాయి .
 8. అనవసరంగా కట్టెలు, బొగ్గు మండించకూడదు. ఆకులు, చెత్త మొదలైన వాటిని కంపోస్ట్ గా తయారు చేయాలి. అంతేకాని కాలుష్యం కలిగేటట్లు తగలబెట్టాదు.
 9. పైన తెలిపిన వాటిలో ప్రతి ఒక్కరూ వినియోగించాల్సిన బాధ్యత. పాటించాల్సిన కర్తవ్యం. ఇవన్నీ చేసినట్లయితే భవిష్యత్తు లో శక్తి వనరుల కొరత ఏర్పడదు.
aravellisharma32

Recent Posts

బాలల హక్కుల పరిరక్షణ మరియు అభివృద్ధి Protection, and development of children’s rights

బాలల హక్కులు Children's rights నేటి బాలలు, రేపటి భావి భారత పౌరులు. నేటి పిల్లలే రేపటి పెద్దలు. రేపటి…

2 months ago

ప్రపంచంలో అనేక ఖండాలు -భారతదేశం మరియు మహా సముద్రాలూ

ఖండాలు -మహా సముద్రాలూ మరియు భారతదేశం దేశాలు ఉన్న విశాల భూభాగాన్ని మనం మన సౌలభ్యం కోసం సాధ్యమైనంత వరకు…

4 months ago

అంతరిక్ష రంగం మరియు ప్రయోగాలు

అంతరిక్ష రంగం భూమి చుట్టూ ఉన్న ప్రదేశమును అంతరిక్షం లేదా ఖగోళం లేదా రోదశి అని అంటారు. దీని గురించి…

6 months ago

వాతావరణం మరియు గాలి

వాతావరణం అంటే ఏంటి? మన చుట్టూ ఉండే గాలే వాతావరణం. ఈ గాలిలో అనేక వాయువులు, దుమ్ము, దూళి, నీటి ఆవిరి…

7 months ago

రక్త ప్రసరణ వ్యవస్థ మరియు రకాలు

రక్తం, గుండె మరియు ప్రసరణ వ్యవస్థ రక్తనాళాలను, హృదయాన్ని కలిపి రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. రక్త ప్రసరణను మొదటిసారిగా…

8 months ago

వర్షం లేదా వాన వల్ల లాభాలు మరియు రకాలు Benefits and types of rain or rain

వాన నీరు భూమిని చేరడం Rainwater accumulation on land వాన లేదా వర్షం ఆకాశంలో మేఘాలు నుండి భూతలం…

8 months ago