Categories: Uncategorized

సునామీలు విపత్తు కారణాలు

సునామి

సునామీలు విపత్తు కారణాలు

సునామి అర్థం

సునామీ అనే మాట జపనీస్ భాష నుండి వచ్చింది. ఇది సో, నామి అనే రెండు పదాల కలయికతో ఏర్పడింది. సో అనగా వాడరేవు, నామీ అనగా అలలు అని అర్థ. సునామి అంటే మహాసముద్రంలో భారీ పరిమాణంలో నీరు స్థానభ్రంశం చెందడం వలన సంభవించే నీటి తరంగాలు వరుస అని. తమిళంలో సునామీ నీ అజి పెరలి అంటారు. క్రీస్తుపూర్వం 326 భారతదేశంలో మొట్టమొదటి సునామీ సంభవించింది.

సునామీ విపత్తులు

మహాసముద్రం వంటి అధిక మొత్తం లో నీరు శీఘ్ర స్థానభ్రంశం జరగటం వల్ల ఒక సునామి సముద్ర కెరటం ఏర్పడుతుంది. దీనిని సునామీ అని అంటారు. నీటిపై గాని, క్రింద గాని, భూకంపాలు సముద్రపు కదలిక, కొన్ని అగ్నిపర్వతముల విస్పోటనం, కొన్ని జల అంతర్భాగ విస్పోటనం అతి పెద్ద గ్రహశకలం ఢీకొట్టడం. అణ్వాయుధ విస్పోటములు, సునామీని పుట్టించగలవు. అతి ఎక్కువ నీరు , అధిక

శక్తి నీ కలిగి వుండడం వలన సునామీలు మహాధ్వంసానికి దారి తీయగలవు. ప్రాచీన గ్రీసు చరిత్ర కారుడైన తుసై దిడెస్ మొట్టమొదటిసారిగా సునామీను జలాంతర్గామి ప్రకంపనలు గా ముడి పెట్టాడు. కానీ సునామీలనూ 20వ శతాబ్దం వరకూ పెద్దగా అర్థం చేసుకో లేదనే చెప్పాలి.అప్పటికి సునామీల మీద పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

సునామీలు గురించి ముఖ్య విషయాలు

కొన్ని సునామీలో చాలా పెద్దవిగా ఉంటాయి తీరప్రాంతాల్లో వాటి ఎత్తు 10 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. అసాధారణ సందర్భాల్లో 30 మీటర్ల ఎత్తు వరకు కూడా ఉండవచ్చు. సునామీలు లోతట్టు ప్రాంతాలలో వంద మీటర్ల దూరం ప్రయాణిస్తాయి. లోతట్టు ప్రాంతాలన్నీ సునామి దాటికి  గురవుతాయి.

సునామీ తరంగాల శ్రేణిని కలిగి ఉంటుంది. చాలా సందర్భాల్లో మొదటి తరంగం పద్ధతిగా ఉండదు. వరుసగా వచ్చే ప్రమాదం మొదట వచ్చిన చాలా గంటలపాటు ఉంటుంది. తీరప్రాంత మైదానాలు లో సునామీలు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి కొన్నిసార్లు సునామీ కారణంగా తీరం వద్ద నీరు వెనక్కి తగ్గి సముద్రపు భూతలం బయటికి కనపడుతుంది.

దీనిని సహజసిద్ధమైన సునామీ హెచ్చరిక గా అనుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సునామి పగలు రాత్రి అనే తేడా లేకుండా ఏ సమయంలోనైనా సంభవించవచ్చు. భూతాపం కారణంగా అతిపెద్ద సునామీ 1958వ సంవత్సరంలో అలస్కా లోని లీటుయబె లోని సంభవించింది .దీని వల్ల ఏర్పడిన తరంగం 50 నుండి 150 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడింది.

సునామి లక్షణాలు

మామూలుగా వచ్చే సునామీల కు ముందుగా మనం ఎలాంటి హెచ్చరికలు ఇవ్వలేము. అన్ని భూకంపాలు సునామీలనూ సృష్టిన్చగలవు. సముద్రంలో భూకంపం, లోతు లేని చోట వస్తే అది ఒక సునామి నీ సృష్టిస్తుంది. దీని తీవ్రత లోతు చాలా ఎక్కువగా ఉంటుంది.

సునామీ నీటిపై గాలి వేచి చూడడం వల్ల వచ్చే సాధారణ మహాసముద్ర తరంగాలకు భిన్నంగా ఉంటుంది. సునామీలు సాధారణం కంటే ఎన్నో రెట్లు అధిక వేగంతో ప్రయాణిస్తాయి. మహాసముద్ర జలంలో సునామీ జెట్ విమానం తో సమానంగా గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 

భూకంపం
ఏర్పడడానికి గల కారణాలు

సముద్రం లో భూకంపం ఏర్పడటం, సముద్రం నీటిలోకి చేరే భూ పాతం, సముద్రం లోపల, వెలుపల అగ్నిపర్వతాల విస్ఫోటనం, సునామీ ఏర్పడనికి కారణాలు. నీటి అంతర్భాగంలో ఒకే చోటకు చేరి లేదా నాశనం చేయు ఫలకాలు ఆకస్మికంగా కదలడం వల్ల, నిలువుగా జరగటం వల్ల సునామీ వచ్చును. ఒక మనిషి సముద్రం లోపలికి వెళ్లి తిరిగి తీర ప్రాంతానికి వస్తె ఒక పెద్ద శబ్దం వస్తుంది. 

ఆగాద జలంలో అవి ఎంత వేగంతో ప్రయాణించి నప్పటికీ సునామీలు నీటి ఎత్తును 30 నుండి 45 సెంటీ మీటర్ల ఎత్తుకు మాత్రమే పెంచ గలుగుతాయి. అందువల్ల సముద్రంలో నౌకలపై ఎటువంటి ప్రభావం ఉండదు. అందరూ సాధారణంగా భావిస్తున్నట్లు సునామీ ఒకే ఒక అతిపెద్ద తరంగం కాదు. 

ఒక సునామీ 10 లేదా అంతకంటే ఎక్కువ తరంగాలను కలిగి ఉంటుంది. అందువల్ల ఆ తరంగాల శ్రేణి సునామి తరంగా రైలు అని అంటారు. ఒక్క తరంగం 5 నుండి 90 నిమిషాల వ్యవధిలో మరొక దానిని అనుసరిస్తాయి జల కాలుష్యం, ప్రధాన భూభాగంలోకి ప్రవేశించడం ద్వారా సునామీ సాధారణంగా వరదలకు కారణం అవుతుంది.మహా సముద్రపు అగాధం లో సంభవించిన సునామి వందల కిలోమీటర్ల పొడవైన తరంగాలతో గంటకు సుమారు ఎనిమిది వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 

అయితే తరంగం కేవలం ఒక కిలోమీటర్ల డోలనపరిమితిని మాత్రమే కలిగి ఉంటాయి. కంప్యూటర్లు 40 మీటర్లు ముందు సంభవించే సమయాన్ని కొద్ది నిమిషాల ముందు తెలియజేయ గలవు. 

సునామీలో విధ్వంసక స్వభావం కలిగి ఉంటాయి. తీరాలను ఖండ ఖండాలుగా చేస్తాయి. సునామీలన్నీ మహా సముద్రాలు మరియు మధ్యధరా సముద్రంలో సంభవిస్తాయి. అయితే అత్యధిక శాతం సునామీలు పసిఫిక్ మహాసముద్రం లోనే సంభవిస్తూ వుంటాయి. శాస్త్రవేత్తలు భూకంపాలు ను కొంత సమయం ముందు వరుకు కచ్చితంగా అంచనా వేయ లేరు. అదేవిధంగా సునామి కూడా ఎప్పుడూ ఏర్పడటయో నిర్దిష్టంగా అంచనా వేయలేరు.

భారత్ లో సునామీ హెచ్చరిక వ్యవస్థ

15 అక్టోబర్, 2007న జాతీయ సునామీ ముందస్తు హెచ్చరికల వ్యవస్థ హైదరాబాద్ లో గల భారత జాతీయ సముద్ర సమాచార కేంద్రం వద్ద ఏర్పాటు చేశారు. దీనికి కేంద్రం ప్రభుత్వం 125 కోట్ల రూపాయలను కేటాయించింది. 

భారత మెట్రో లాజికల్ డిపార్ట్మెంట్ యొక్క జాతీయ భూకంపం శాఖ ఎప్పటికప్పుడు భూకంపాల గురించి ముందస్తు హెచ్చరిక కేంద్రానికి తెలియజేస్తాయి. అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం హోనాలులు అమెరికాలో ఉంది. దీనిని 1965లో ఏర్పాటు చేశారు. 

అంతర్జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం ఇవా బీచ్ హవాయిలో ఉంది. అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అటామ స్పీక్ అడ్మినిస్ట్రేషన్ 1995లో డీప్ ఓషన్ అసెస్మెంట్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ సునామీ వ్యవస్థను అభివృద్ధిచేయడం ప్రారంభించింది. 

2001 నాటికి పసిఫిక్ మహాసముద్రంలో 6 స్టేషన్ లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి స్టేషన్ సుమారు 6 వేల మీటర్ల కింద సముద్ర భూభాగం కలిగి వుంది. సంస్థ భూతల పీడన రికార్డ్ను కలిగి ఉంటుంది. ఇది సునామీ కదలికలు పసిగట్టి ఉపరితలంపై ఉన్న హెచ్చరికల కేంద్రాన్ని సమాచారాన్ని ప్రసరింపచేస్తోంది.

ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రజలు ఎత్తైన భవంతుల మీద కి వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే అది రావడానికి ముందు హెచ్చరిక గా మనం అనుకోవాలి. సునామీ వచ్చే ముందు మనిషి భూభాగం మీదకైనా లేదా ఎత్తయిన భవనాలు మీదకైనా వెళ్ళవలసి ఉంటుంది. 

కాని సముద్రం భాగంలో వుండరాదు. సునామీలు అన్నింటిలో ఎక్కువగా 80% పసిఫిక్ మహాసముద్రంలోని వచ్చును. కానీ నీటి మట్టం ఎక్కువగా ఉన్న చోట సునామీలు అనేవి సంభవిస్తాయి. 

సునామీని మనం ఆపలేం, గుర్తించలేము. భూకంప శాస్త్రవేత్తలు, సముద్ర శాస్త్రవేత్తలు, భూకంప తీవ్రతను బట్టి సునామీ హెచ్చరికలను జారీ చేయవచ్చు లేదా చేయలేకపోవచ్చు. కానీ సునామీ వచ్చే ముందు కొన్ని లక్షణాలను గుర్తించవచ్చు.

సునామీ హెచ్చరిక వ్యవస్థను బట్టి మనం సునామీ వచ్చిందని కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు.అలలు భూమి పైకి వచ్చే లోపల ప్రజలను అప్రమత్తం చేయవచ్చు.

సునామీ వచ్చే ముందు చాలా పెద్ద పెద్ద శబ్దాలు మనం వినవచ్చు. వాటి ద్వారా మనం జాగ్రత్త పడాలి, పెద్ద పెద్ద గాలులతో చాలా పెద్ద శబ్దాలను మనం గమనించవచ్చు.

జపాన్ చేపట్టిన చర్యలు

1896లో సంభవించిన పెను విపత్తు అనంతరం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా జపాన్లో సునామి శాస్త్రం ప్రతిస్పందన చర్యలను అనుసరించడం ప్రారంభించారు. తీర ప్రాంతాల ప్రజలను కాపాడటానికి జపాన్ 4.5 మీటర్ల ఎత్తు ఉండే అనేక సునామి గోడలు నిర్మించారు.

1993 జూలై 12న సంభవించిన భూకంపం అనంతరం రెండు నుండి ఐదు నిమిషాల వ్యవధిలో హోకైడో లోని ఒకుసిరి దీనిని తాకిన ఒకుసిరి హోకై డో సునామి దాదాపు పది అంతస్తుల భవనాల తాకి, 30 మీటర్ల సునామీ తరంగాలను సృష్టించింది. ఓనాయి అనే  వాడరేవు పట్టణంలో సునామి నుండి కాపాడడానికి నిర్మించిన కూడా పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది.

ఈ ఘటన సునామీ వేగాన్ని, నెమ్మది గా ఎత్తును తగ్గించడానికి దోహదపడ ఉండవచ్చుగానీ విధ్వంసాన్ని గాని, ప్రాణనష్టాన్ని గాని నిలువరించ లేకపోయింది.

ప్రపంచంలో ఇటీవల సంభవించిన ముఖ్య సునామీలు

  • 2004 డిసెంబర్ 26 ఆగ్నేయ ఆసియా 9.3
  • 2006 జూలై 17 ఇండోనేషియా 7.3
  • 2007 ఏప్రిల్ 2 సోలమన్ దీవులు 8.0,
  • 2009 సెప్టెంబర్ 29 సమోవా 8.0
  • 2010 ఫిబ్రవరి 27 చీలి 8.8,
  • 2010 అక్టోబర్ 25 ,26 ఇండోనేషియా 7.7
  • 2011 మార్చి 11 జపాన్ 8.9

భారీ భూకంపం ముంచెత్తిన సునామీలు

నేటి సునామీలో నీటమునిగిన అను శక్తి కేంద్రం 2011లో తీవ్రంగా దెబ్బతిన్న సంగతి కేంద్రానికి తెలిసిందే. నాటి భూకంప విలయంలో 20 వేల మందికి పైగా మరణించారు.ఈ మేరకు నష్టం అనేది తీవ్రంగా ప్రజలకు జరుగుతుంది సునామీ వల్ల చాలా ఎక్కువమంది ప్రజలు చనిపోతున్నారు. తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అక్కడ ప్రభుత్వం ఈశాన్య తీరంలో త్వరితగతిన గ్రామాలను ఖాళీ చేయించే ప్రయత్నం చేసింది. 

దేశ రాజధాని టోక్యో నగరంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నట్లు సమాచారం అందింది. ఈ భూ ప్రకంపనలు సునామీగా చెలరేగడంలో అల్లకల్లోల పరిస్థితులు ఆ నగరంలో చెలరేగాయి. సునామి వచ్చిన రెండు వారాలలోపు వేల సంఖ్యలో కుటుంబాలకి ఉండటానికి అభయ కేంద్రాలను తమిళనాడు మరియు కేరళలో ప్రభుత్వము నిర్మించారు. వారికి అవసరమైన చికిత్స, దుస్తులు, ఆహారం, వంటివి ఆనాటి నుండి ఇస్తూనే ఉన్నారు. సునామీ ఏర్పరిచిన మానసిక అగాధం నుండి శాంతి లభించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చింది.

2004 లో ఏర్పడిన సునామీ

2004వ సంవత్సరంలో డిసెంబరు 26 హిందూ మహాసముద్రంలో సుమిత్ర ఇండోనేషియా దేశాల కు దక్షిణ తీరం కేంద్రంగా ఏర్పడినది సునామీ. టెక్టోనిక్ ప్లేట్స్ బర్మా భూభాగానికి చెందిన టెక్టోనిక్ ప్లేట్ల లో రాపిడి చెందడం వలన సముద్రగర్భంలో భారీ భూకంపాలు ఏర్పడ్డాయి. దీని ఫలితంగా సముద్రపు అలలు సుమారు 30 మీటర్ల ఎత్తు వరకు పెరిగి పడి తీరప్రాంతాన్ని ముంచి వేశాయి. 

ఈ విపత్తు వల్ల ఇండోనేషియా తీవ్రంగా నష్టపోయింది. శ్రీలంక, భారతదేశం, థాయిలాండ్ దేశాలు కూడా ఈ భూకంపం ధాటికి నష్టపోయాయి. ఇది అత్యంత ఘోర విపత్తులో ఒకటిగా నిలిచిపోయింది. 

సునామీ బీభత్సం

భారీ భూకంపం తరువాత సంభవించిన సునామీ తీవ్ర విషాదాన్ని నింపుతుంది. సునామీ కారణంగా చాలా మంది గాయాలపాలు అవుతారు, చాలా ప్రాంతాలు నీటి తాకిడికి కొట్టుకుపోయే అవకాశం ఉంది. చాలా మంది చనిపోతారు, చాలా ప్రాంతాలు కనుమరుగై పోతాయి ముఖ్యంగా అట్టడుగు ప్రాంతాలు జలమయం అయిపోతాయి చాలా ప్రాంతాలు శవాల దిబ్బలుగా మారతాయి. 

సునామీ నివారణ కు మనం తీసుకోవలసిన జాగ్రత్తలు

సునామీని మనం తీరం వెంబడి చెట్లు ను పెంచి కొంతవరకు తగ్గించవచ్చు. ఈ విధంగా 2004వ సంవత్సరంలో హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామి ఈ చెట్ల వల్ల కొంతవరకూ నాశనం కాకుండా రక్షించింది. తీర ప్రాంతాలలో కొబ్బరి మడ అడవులను పెంచడం ద్వారా సునామీ శక్తిని మనం తగ్గించవచ్చు. 

ఒక మంచి ఉదాహరణగా ఇండియాలో తమిళనాడులోని నలువేద పహి అనే గ్రామంలో చాలా తక్కువ నష్టానికి గురైంది. దీనికి కారణం ఆ సముద్ర తీరం వెంబడి 80,240 చెట్లను సునామి తెంచి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకుంది. 

పర్యావరణ శాస్త్ర వేత్తలు సునామీని తగ్గించడానికి తీరం వెంబడి చెట్లను పెంచాలి అని చెప్తున్నారు. ఈ చెట్లను పెంచటానికి మనకి చాలా సమయం పట్టవచ్చు కానీ ఒపిక తో మనం ఈ సునామీలనూ కొంత వరకు అరికట్టవచ్చు . ముఖ్యంగా సునామీలు వచ్చిన సమయంలో మనం ధైర్యంగా ఉండాలి.

మానసిక ధైర్యాన్ని కలిగి ఉండాలి. ఆ సమయంలో మనం జాగ్రత్తగా ఎలా ఉండాలి అనేది ఆలోచించాలి. మనం సురక్షితమైన ప్రాంతానికి వెళ్లాలి ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకొని సునామీలనూ మనం కొంతవరకూ అరికట్టవచ్చు. సునామీ ద్వారా మనల్ని మనం, మన ప్రాంతాలను, ప్రజలను కాపాడవచ్చు.

Hari Shankar Sharma

View Comments

  • With havin so much content do you ever run into any problems of plagorism or copyright violation? My site has a lot of exclusive content I've either created myself or outsourced but it seems a lot of it is popping it up all over the web without my agreement. Do you know any ways to help stop content from being ripped off? I'd genuinely appreciate it.

    • Hi and Thanks for your comment. In the Telugu language, I think competition is so less so you can easily upload a post and as you said you are genuine so don't fear about it and finally check at smallseotools.com for your topic plagiarism

Recent Posts

బాలల హక్కుల పరిరక్షణ మరియు అభివృద్ధి Protection, and development of children’s rights

బాలల హక్కులు Children's rights నేటి బాలలు, రేపటి భావి భారత పౌరులు. నేటి పిల్లలే రేపటి పెద్దలు. రేపటి…

2 months ago

ప్రపంచంలో అనేక ఖండాలు -భారతదేశం మరియు మహా సముద్రాలూ

ఖండాలు -మహా సముద్రాలూ మరియు భారతదేశం దేశాలు ఉన్న విశాల భూభాగాన్ని మనం మన సౌలభ్యం కోసం సాధ్యమైనంత వరకు…

4 months ago

అంతరిక్ష రంగం మరియు ప్రయోగాలు

అంతరిక్ష రంగం భూమి చుట్టూ ఉన్న ప్రదేశమును అంతరిక్షం లేదా ఖగోళం లేదా రోదశి అని అంటారు. దీని గురించి…

6 months ago

వాతావరణం మరియు గాలి

వాతావరణం అంటే ఏంటి? మన చుట్టూ ఉండే గాలే వాతావరణం. ఈ గాలిలో అనేక వాయువులు, దుమ్ము, దూళి, నీటి ఆవిరి…

7 months ago

అనేక రకాల శక్తి రూపాలు మరియు వాటి ఉపయోగాలు (Many form of Energy and uses)

శక్తి (Energy)     పని చేయగల సామర్థ్యాన్ని శక్తీ అనీ పిలుస్తారు. పని, శక్తి రెండూ ఒకే ప్రమాణం కలిగి…

7 months ago

రక్త ప్రసరణ వ్యవస్థ మరియు రకాలు

రక్తం, గుండె మరియు ప్రసరణ వ్యవస్థ రక్తనాళాలను, హృదయాన్ని కలిపి రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. రక్త ప్రసరణను మొదటిసారిగా…

8 months ago