X

రకరకాల చెట్లు మరియు వాటి ప్రయోజనాలు

Advertisements

ఎన్నో రకాల చెట్లు మరియు వాటి వల్ల మనకు కలిగే ఉపయోగాలు

వేప చెట్టు

అత్యుత్తమ ఔశధ గుణాలున్న చెట్ల లో ఒకటి. ఈ విషయం అనాది కాలం నుండి భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా పూజించడం మొదలు పెట్టారు. గరుత్మంతుడు అమృతభాండం తీసుకుని వెళ్తుండగా కొన్ని చుక్కలు చింది భూలోకం లో వేప మీద పడగా అది శక్తివంతంగా మానవులకి మేలు చేసే వృక్షముగా మారింది అనేది పురాణ గాధ.

ఇది చాలా ఔషధ గుణాలు కలది. వేప ఆకులను అయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు. అంటు వ్యాధులను తొలగిస్తుంది. ఉగాది పచ్చడి లో వేస్తారు.

మర్రి చెట్టు

పురాతనంగా పూజలు అందుకంటున్న చెట్టు మర్రి. దీనిని భారతదేశంలో త్రిమూర్తుల వృక్షముగా కొలుస్తారు. సంతానాన్ని, సంపదను మర్రి చెట్టు అందిస్తుందనేది హైందవ విశ్వాసం. మన పురాణాల్లో ప్రస్తావించిన కల్ప వృక్షం మర్రి చెట్టు.

చిరకాలం జీవించే మర్రి చెట్టు మానవ జీవితానికి మేలు చేస్తుంది. ఈ చెట్టు వేర్లు బయటకి కనిపిస్తూ వుంటాయి. ఈ చెట్టు దృఢంగా పెద్ద పెద్ద ఉడల తో వుంటుంది.ఈ ఊడల సహాయం తో చెట్టు విస్తరిస్తుంది.

ఇది పెద్ద పెద్ద కొమ్మలు ఆకులతో విస్తరించి వుండడం వల్ల చాలా మేర అవరించి చల్లని నిడని ఇస్తుంది. మర్రి అకుని పూజల్లో పెట్టి కొలుస్తారు. కార్తీక మాసంలో ఈ చెట్టు విశిష్ట పూజలు అందుకుంటుంది. సృష్టికర్త బ్రహ్మ రూపం లో కొలుస్తారు.

రావి చెట్టు

భారతీయులందరికీ పవిత్రమైన చెట్టు రావి చెట్టు. ఈ చెట్టు లేని గ్రామం వుండదు. ఈ హిందువులకి బుద్దులకి పుజనియమినది. మన దేశ గాధలలో మర్రి చెట్టుని పురుషుడి గా, రావి చెట్టు నీ స్త్రీ గా భావించి పూజలు చేస్తారు .

ఈ చెట్టు ను అశ్వత్ధము అని పిలుస్తారు. శనివారం నాడు రావి చెట్టు లో లక్మి దేవీ ఉంటుందనేది నమ్మకం. గౌతమ బుద్ధుడు నిజానికి జ్ఞానోదయం కలిగింది బోధి చెట్టు నీడలో ఆ చెట్టు ఈ రావి చెట్టు. రావి ఆకులు చివర తోక వలే కొన తెలి వుందు ఆ ఆకులు గాలికి వీచినపుడు గలగలమoటు కదులుతాయి. ఈ చెట్టు ను చలదళం అంటారు. ఈ చెట్ల ఆకులు నీడని ఇస్తాయి. రావి దీర్ఘకాలం నివసించే చెట్టు.

మామిడి చెట్టు

సంపద కు, అభివృద్ధి కి ప్రేమ కు మామిడి ప్రతీక. ఈ మూడింటిని ఆరాధించే మొక్కలు గా మామిడిని పూజిస్తారు. మామిడి చెట్టుకు పురాణాలలో ప్రస్తావన వుంది. ఈ చెట్టు వేసవి కాలంలో పెద్ద పెద్ద ఆకులతో నీడని ఇస్తుంది. చాలా దృఢంగా, ఏపికగా పెరుగుతుంది.

మామిడి ఆకులను శుభ కార్యాల్లో తోరణాలు కడతారు. దీనిని కల్ప వృక్షం అంటారు. మామిడి చెట్టు పళ్ళు అద్భుతంగా వుంటాయి. వేసవి కాలం లో ఈ పళ్లకి గిరాకీ ఎక్కువ. మామిడి పళ్లు అన్నిటికంటే రుచికరంగా వుంటాయి.

Mango Tree

చింత చెట్టు

చింత చెట్టు చిన్న చిన్న ఆకులను కలిగి రెమ్మలతో పెద్ద మహా వృక్షముగా పెరుగుతుంది. ఆయుర్వేదం, సిద్ధవైద్య విధానO లో చింత అకులను బెరడును ఉపయోగిస్తారు.

చింత చెట్లు నుండి చింత పండును చింత చిగురు నీ వంటలలో.. ఉపయోగిస్తారు. చింత పండును చల్లదనాన్ని ఇస్తుంది. జ్వరం,జలుబు, మలేరియా, చర్మ రోగాలను , దురదలు ను నివారిస్తుంది. జీర్ణక్రియ ను క్రిమి సంహారిణి, జలుబు, ముక్కు దిబ్బడ నీ నివారిస్తుంది. దీనిలో సి విటమిన్ వుంటుంది.

కొబ్బరి చెట్లు

ఇది పొడవుగా, ఏపికగా పెరుగుతాయి.  పల్లెల్లో కొబ్బరి చెట్లు అధికంగా వుంటాయి. ఇంటిల్లపాదికీ కొబ్బరి ఆరోగ్యం.కొబ్బరి నూనె, కొబ్బరి నీళ్లు, ఇలా ప్రతి భాగం ఉపయోగము. ఎండు కొబ్బరి, కొబ్బరి నూనె , పాలపొడి, వెనిగర్,చిప్స్ మార్కెట్ లోకి వచ్చాయి.కొబ్బరి పీచు, గృహోపకరణాలు లభిస్తాయి. గృహ నిర్మాణానికి కొబ్బరి కాండం, ఆకులు, కొబ్బరి మట్టలు శుభకార్యాలు లో పందిరిలా వేస్తారు. ఇలా చూసుకుంటే కొబ్బరి లో ప్రతి భాగం ఉపయోగము.

చెట్లు ఉపయోగాలు

ఇలా చూసుకుంటూ పోతే చెట్లు వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి. మానవ పరిస్తితి మెరుగుపరచడానికి ఎల్లప్పుడు అవసరం. చెట్లు అక్షిజన్ ను ఉత్పత్తి చేస్తాయి. ఒక పరిపక్వం, అకు చెట్టు మొత్తం సoవత్సరాలకి 10 మంది పీల్చే ఆక్సిజన్ నీ ఉత్పత్తి చేస్తుంది. గాలిని శుభ్రం చేస్తుంది. నేలను శుభ్రం చేస్తుంది.

చెట్లు హానికరమైన కాలుష్యం నీ తగ్గిస్తాయి. మురికి నీరు, రసాయనాలు, జంతువులు వ్యర్థాలు. ప్రభావాలు తగ్గిస్తుంది. చెట్లు అనేక మంది గృహాలు నిర్మూలించడానికి ఉపయోగపడుతుంది. చెట్లు మనుషులు మంచి స్నేహితులు.

ప్రకృతి లో ఒక భాగం. చెట్లు విధులు నగరాన్ని చల్లపరుస్తారు. సమస్త ప్రాణికోటికి నీడని ఇస్తుంది. చెట్లుని కలపగ వాడతారు. వంట చెరుకు, కాగితం తయారీలో వాడతారు. ఫర్నిచర్ తయారీలో, అనేక పరిశ్రమ లో, మూలికల తయారీలో వాడతారు. చెట్లు వర్షపాతాన్ని కలిగిస్తాయి. చెట్లు వల్ల అతినీల లోహిత కిరణాలు బారి నుండి రక్షిస్తాయి.

చెట్ల నరికివేత నివారణ మార్గాలు

చెట్లు మరియు వాటి ఉపయోగం గురించి ప్రజలు తెలుసుకోవాలి. చెట్లు నరికివేత వల్ల ఎంత నష్టం కలుగుతుందో తెలుసుకోవాలి. మొక్కలను నాటలి. వాటిని పెంచాలి. భావితరాలకు వాటి ఉపయోగము తెలియచేయండి. ఈ సృష్టి లో లేనిదే జీవకోటి లేదు. అందుకే భావి తరాలకు ఈ సంపదని అందిద్దాం.

మొక్కలను నాటండి. ఆయువు పెంచండి.

చెట్లు మాట్లాడవు కాని పలకరిస్తాయి. చల్లని గాలితో చక్కని నిడతో అలరిస్తాయి. నిరంతరం నిలబడి ఉండి సహనాన్ని ప్రదర్శిస్తాయి. చెట్టు మొక్క కన్న పెద్దది కొన్ని చెట్లు 200 అడుగులు వరుకు పెరుగుతాయి. కొన్ని చెట్లు వెయ్యి సంవత్సరాల పైన జీవిస్తాయి. ప్రతి సంవత్సరం పుస్పిస్తు కాయలు పండ్లు ఇచ్చే వాటిని చెట్లు అంటారు.

ఒక్కసారి కాచి చనిపోయే వాటిని మొక్కలు అంటాము. చెట్లు నేల పటుత్వాన్ని, భూసారాన్ని చక్కగా కాపాడతాయి. వ్యవసాయం లో చెట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. పండ్ల రకాలు చాలా వరుకు చెట్లు నుండి లభిస్తాయి. ఇల్లు, వ్యాపార కూడలి మొదలైన కట్టడాలు కి ప్రధాన ముడి సరుకు కొయ్యి చెట్ల నుండి లభిస్తుంది. ఇంటి ఫర్నీచర్ కి కావలసిన కొయ్య ఈ చెట్ల నుండి లభిస్తుంది. అలంకరణ వస్తువులు ఈ చెట్లు నుండి లభిస్తాయి. చెట్టు నే వృక్షం అని కూడా అంటారు.

మతము లో చెట్లు

మతపరమైన నమ్మకాలు చెట్లు ఆధారంగా చాలా వున్నాయి. ఈ విశ్వం అంతా పంచ భూతత్మకం ఐనది ఈ చెట్టు, చెట్ల లో కూడా మనిషి లో వున్నట్టు పంచ భూతాలు వున్నాయి. చెట్ల కి కూడా మనిషి ల వినడం, వాసన చూడడం, రసం, స్పర్శ. దృష్టి పంచ ఇంద్రియాలు వున్నాయి. అవి ఇతర చెట్లల బయటకి కనిపించక పోవచ్చు. వృక్షాల్లో ఆకాశం అనేది వుంటుంది. చెట్లకి స్పర్శ పొందే లక్షణం వుంది .

మనిషి లాంటిదే చెట్టు

గాలి విచినప్పుడు, పిడుగులు పడినప్పుడు కలిగే ద్వనులకి చెట్టు పళ్ళు, పువ్వులు రాలి పడుతుంటాయి. మనిషి లో ఎలా పరిణామ క్రమం వుంటుందో. చెట్ల లో కూడా అలాంటి పరిణామ క్రమం కనిపిస్తూ….. వుంటుంది. వాయువును గ్రహించడం, ఆహారం జీర్ణం చేసుకోవడం, తరగటం, పెరగటం, ఇవన్నీ చెట్ల లో కనిపిస్తాయి. వ్యాధి సోకితే మనిషి బాధపడినట్టే చిడ పీడలు సోకిన చెట్టు కూడా బాధపడుతుంది.

వైద్యం లో చెట్లు

చెట్లు, వేళ్ళు, బెరడు, ఆకులు, పూలు, కాయలు, పళ్ళు, విత్తనాలు, పుల్లలు మొత్తం లో అన్ని భాగాలను ఆయుర్వేదం, సిద్ధ, యునాని, వైద్య విధానాలలో ఉపయోగిస్తారు. వీటి నుండి అనేక రకాల మందులను తయారు చేస్తారు. పొలాలకు, క్రిమి సంహారక మందులు ను ఈ చెట్ల ద్వారా తయారు చేస్తారు.

వృక్షో రక్షతి రక్షితః

దీని అర్థం చెట్లని మనం కాపాడితే చెట్లు మనల్ని కాపాడతాయి అని. దేవాలయాలలో చెట్లని పెంచి వాటిని కూడా దేవతలను పుజించినట్టే పూజిస్తారు. వాతావరణ కాలుష్యం నివారణకు, పర్యావరణం పరిరక్షణకు, జీవ వైవిధ్యంకి ఈ వాక్యం ప్రచారం లోకి వచ్చింది.

చెట్ల ప్రయోజనాలు

చెట్లు మనకి చాలా అవసరం. చెట్లు మానవ పరిస్తితి నీ మెరుగు పరచడానికి ఎల్లప్పుడు అవసరం. చెట్లు యొక్క జీవితం లో పంట లు మనకి అందిస్తుంది.

భారతదేశం యొక్క వృక్ష జాతులు

భారతదేశం యొక్క వృక్ష సంపద ప్రపంచ వాతావరణం యొక్క ప్రపంచ సంపద లో ఒక్కటిగా వున్నవి దేశ సంస్థితి, పర్యావరణ పరిరక్షణ కు ఇవి తోడ్పతాయి. భారత దేశం లో 15 వేల జాతులు కి పైగా పుష్పించే మొక్కలు వున్నవి భావిస్తున్నారు.ఈ మొత్తం ప్రపంచం లో మొత్తం మొక్క జాతుల్లో 6 శాతం , మరియు మరిన్ని జాతులు గా ఉన్నాయి. వీటిలో స్వదేశీ మొక్క లతో పాటు ఇతరులు పరిచయం చేసినవి కూడా వున్నాయి.

భారతీయ ఇతిహాస కాలం నాటి వృక్ష జాతులు

భారతీయ ఇతిహాస కాలం నాటి వృక్ష సంపద ను పురాతన కాలం నుండి వృక్షాలు ను దేవత వృక్షాలు గా కొలుస్తారు.

ప్రకృతి స్నేహం మెరుగైన ఆరోగ్యానికి మార్గం

చెల్లటి వాతావరణం , అందమైన ప్రకృతి…సేద తీర్చే వెచ్చని గాలి..ఇలాంటి వాతావరణం ఇప్పుడు జనాలకి కరువైంది. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బిల్డింగులు భూతద్దం పెట్టీ వెతికినా ఎక్కడ చెట్లు కనిపించని పరిస్థితి

మారుతున్న కాలంతో తో పాటు ప్రకృతి కి మానవుడికి దూరాన్ని పెంచేస్తుంది.చుట్టూ చెట్లు వుంటే ఉత్సాహం తో పాటు ఆరోగ్యం మెరుగుపడుతుంది.నిజమే చెట్ల మధ్యలో నివసిస్తూ వుంటే ఆరోగ్యం చాలా మేలు.శారీరక మానసిక ఆరోగ్యం బావుంటుందని సూచిస్తున్నారు. చెట్ల మధ్యలో కానీ..అడవి మధ్యలో కాని నివసిస్తూ వుంటే చక్కని మెడిసిన్ లా పని చేస్తుంది అంటున్నారు. ఇంతకీ చెట్లు చేమల మద్య నివసిస్తే కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం ..

స్వచ్ఛమైన గాలి

పచ్చని చెట్ల మధ్యలో నివసిస్తూ వుంటే ఆహ్లాకరమైన వాతావరణం లో గాలి పిల్చుకోవచ్చు.స్వచ్ఛమైన శ్వాస శరీరానికి అందుతుంది.చెట్ల ఆకులు గాలి కాలుష్యాన్ని గ్రహించడం వల్ల మానవులకి శ్వాస కోశ వ్యాధులకి అవకాశం వుంటుంది. మీ ఇంటి దగ్గర చెట్లని పెంచండి.

జీవితకాలం పెరుగుతుంది.

చెట్ల మధ్యలో నివసించడం వల్ల మనుషుల జీవితకాలం పెరుగుతుంది.చక్కని వాతావరణం లో పెరిగితే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు .శరీరానికి కావలసిన శక్తి సహజ సిద్దంగా అందుతుంది. అప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

త్వరగా కోలుకునే శక్తి

చెట్టుకు దగ్గరలో నివసిస్తూ వుంటే ఎన్నో ప్రయోజనాలు వున్నాయి. జబ్బు పడిన వెంటనే కోలుకుంటారు. శస్త్ర చికిత్స జరిగేవాల్లు అనారోగ్యం గా వుండే వాళ్ళు చెట్లకి ఎంత దగ్గరగా వుంటే అంత మంచిది.

ఆందోళన , డిప్రెషన్, ఒత్తిడిని తగ్గిస్తుంది.

పచ్చటి ప్రకృతి లో నివసించే వాళ్ళు మానసిక ఆరోగ్యం కూడా మెరుగ్గా వుంటుంది.చెట్లకి దగ్గరగా వుండేవాళ్ళు ఆందోళన డిప్రెషన్, ఒత్తిడిని తగ్గిస్తుంది.

మొక్కల నర్సరీ

మొక్కల నర్సరీ నీ ఇంగ్లీష్ లో ప్లాంట్ నర్సరీ అని అంటారు.మొక్కల నర్సరీ లో మొక్కల ను ఉత్పత్తి చేసి వాటిని ఉపయోగించ దాగిన పరిమాణం వచ్చేంత వరకు మొక్కలను ఇక్కడ పెంచుతారు.

ప్రభుత్వ పరమైన నర్సరీలలు

ప్రభుత్వ పరమైన నర్సరీలో పెంచే మొక్కలను నియమ నిబంధనలు అనుసరించి ఉచితంగా లేదా సబ్సిడీపై కావలసిన వారికి అందచేస్తారు.

వాణిజ్య పరమైన నర్సరీలు.

ఈ నర్సరీల్లో పెంచిన మొక్కలను చిల్లరగా మరియు టోకు గా అవసరమైన ప్రజలందరికీ ఇక్కడ మొక్కలను విక్రయిస్తారు.

కడియం నర్సరీలు

ఆంధ్రప్రదేశ్ కడియం, కడియపు లంక గ్రామాలు. నర్సరీలకి, పుల తోటలకు ప్రసిద్ది. ఇక్కడ సుమారు 600 నర్సరీలు వున్నాయి. వీటి వలన 25000 మందికి ఉపాధి లభిస్తుంది.

కలప

కలప వృక్షాలు నుండి లభించే అతి ముఖ్యమైన పదార్థం భారత దేశము లో 150 రకాల కలప జాతులు వున్నాయి.

జమ్మి చెట్టు

శమీ వృక్షం లేదా జమ్మి చెట్టు ఫాబైజ్ కుటుంబానికి చెందినది. హిందువులు ఈ చెట్టును విశేషం గా పూజిస్తారు. ఇది పాండవులు అజ్ఞాతవాసం లో ఆయుధాలు వుంచిన స్థలం.

వై దుక భాష లో శమీ వృక్షం నీ అరనీ అని పిలుస్తారు.పూర్వకాలం నుండి శమీ వృక్షం పుజనియమైంది.

పురాణాల్లో జమ్మి

వినాయక చవితి రోజు జమ్మి చెట్టు ఆకులను వినాయక వ్రత కల్ప విధానము లో గణేశ పాత్ర పూజలో ఉపయోగిస్తారు. తమకు విజయాలు లభించాలని విజయ దశమి రోజున ప్రజలు జమ్మి చెట్టు వద్దకు వెళ్లి పూజలు చేసి ఆ చెట్టు ఆకులను ఇంటికి తీసుకు వచ్చి పెద్ద వాళ్ళకి ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకుంటారు. మరియు అన్ని రకాల వృత్తుల వాళ్ళు వాళ్ళ పనిముట్లను శుభ్రపరిచి వాటికి పూజలు చేయడం ఆనవాయితీ.విజయదశమి రోజు సాయంత్రం నక్షత్రదర్శన విజయ సమయాన శమీ వృక్షం వద్ద గల అపరాజిత దేవిని పూజించి కొలుస్తారు. తెలంగాణ ప్రాంతమందు శమీపూజ అనంతరం పాలపిట్టను చూచే ఆచారం కూడా ఉన్నది. శమీ వృక్షం అగ్ని కాంతికి ప్రతీక. ఏ పేరుతో పిలిచినా అన్ని శుభకరమైనవే.

ఆయుర్వేధం లో

దుర్వాసన తో కూడి ఉన్న జమ్మి ఆకులను ఉల్లేఖన అయుర్వధం లో ఉపయోగిస్తారు. కుష్టు రోగ నివారణకు..అవాంఛిత రోమాలను నివారణకు జమ్మి ఆకులను ఉపయోగిస్తారు.జమ్మి ఆకుల నుండి పసరు తీసి వాటిని పుల్లు వున్న చోట రాస్తే కుష్టు వ్యాధి నశిస్తుంది. ఆయుర్వేద విధానం లో శమీ వృక్షం ఆకులు..పువ్వులు..బెరడు, విత్తనాలు అన్ని ఉపయోగిస్తారు.ఇలా అన్ని రోగాల నివారణకు ఈ జమ్మి చెట్టు ఉపయోగిస్తారు.కాబట్టి ఈ జమ్మి చెట్టును సురభి బంగారం అనే పేరు వచ్చింది.

తాటి చెట్లు

తాటి చెట్టు పామే కుటుంబానికి చెందిన ఒక చెట్టు.వీటిలో 6 జాతులు వుంటాయి.ఇవి పొడవుగా 30 మీటర్ల ఎత్తు వరుకు వుంటాయి.తాటి చెట్టు వివిధ భాగాలు ప్రజలకి చాలా రకాలుగా ఉపయోగపడతాయి.కావున దీనిని ఆంధ్రుల కల్ప వృక్షం.

లక్షణాలు.

నలుపు బూడిద రంగులో శాఖ రహితం గా పెరిగే పొడుగాటి వృక్షం. వింజమరాకార సరళ పత్రాలు. ఇంచుమించు గుండ్రంగా ఉన్న పెద్ద టెంకుల గల ఫలాలు. ఒక తాటి పండులో మూడు తెంకులు వుంటాయి.

తాటి రకాలు.
ఆసియా తాటి

ఆఫ్రికా తాటి.
న్యుగినియా తాటి
మడగాస్కర తాటి

ఉపయోగాలు

తాటి చెట్టు బాగా ఆర్థిక ప్రాముఖ్యత కలిగినది . చాలా కాలం నుండి తాటి చెట్టు నీ చాలా రకాలుగా ఉపయోగిస్తారు.. చాలా విధాలుగా ఉపయోగం లో వున్నాయి .తాటాకులు పాకలు వాడుకోవడానికి, చాపలు బుట్టలు, సంచులు, విసినికర్రలు, టోపీలు, గొడుగులు తయారు చేయడానికి ఉయోగపడుతుంది. తాటి చెట్టు కలప గట్టిగా వుండే ఇల్లు కట్టుకోవడం లో దూలాలు, స్తంబాలు గా ఉయోగపడుతుంది. తాటి మానును కాలువల మీద అడ్డంగా వేసి వంతనగ ఉపయోగిస్తారు. నీళ్లు పారే పైపు లాగ తాటి మాణును ఉపయోగిస్తారు. తాటి బెల్లం కూడా ఉపయోగిస్తారు. ఇది ఆయుర్వేద వైద్య విధానాలలో ఉపయోగిస్తారు. తాటి ముంజలు, పండ్లు మంచి ఆహార పదార్థాలు. తాటి కల్లు ఒక రకమైన మద్య పదార్థం .తాటి పండ్ల నుండి తాండ్ర తయారు చేస్తారు.తాటి కొమ్మలు 800 కు పైగా ఉపయోగపడతాయి.ఇవి భారత దేశం లో అతి ముఖ్యమైన చెట్లు.

Categories: Uncategorized
Hari Shankar Sharma:

View Comments (0)

X

Headline

Privacy Settings