X

రోడ్డు రవాణా భద్రత నియమాలు

Advertisements

రోడ్డు భద్రత విద్య

చక్రం ఆవిష్కరణతో రవాణా రంగంలో అనేకమైన మార్పులు వచ్చాయి. పెరుగుతున్న జనాభా పారిశ్రామీకరణ, నగరీకరణ, ప్రపంచీకరణ వల్ల వాహనాలు రద్దీ కూడా పెరిగింది. అందువల్ల రవాణా సులభం అయ్యింది.

ఒక క్రమబద్ధీకరణ అనగా రోడ్డును ఉపయోగించే వారు అందరూ కచ్చితంగా రోడ్డు భద్రత నియమాలు పాటించడమే. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం రోడ్డు ఉపయోగించే ప్రతి ఒక్కరి బాధ్యత.

Road Safety

రవాణా సాధనాలు

ఆర్డినరీ బస్సులను పల్లె వెలుగు అని అంటారు. బస్సులో మెషిన్ ద్వారా టికెట్ ను ఇస్తున్నారు దీనిని టికెట్ ఇష్యూ యింగ్ మెషీన్ అంటారు. టి ఐ ఎన్ ఎస్ లో టికెట్ నుంచి పంచ్ చేసే ఇబ్బంది ఉండదు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు నడిపే బస్సు సర్వీసులు తెలుగు వెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్, గరుడ, లగ్జరీ, ఇంద్ర.

బస్సు టికెట్ ను ముందుగా రిజర్వు చేసుకోవచ్చు ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. వనిత, నవ్య కార్డు గల వారికి ప్రయాణం ధరలో 10 శాతం రాయితీ ఇస్తారు. వికలాంగులకు కూడా రాయితీ ఉంటుంది.

టిక్కెట్టు లేకుండా ప్రయాణించడం నేరం అందుకు 500 రూపాయలు జరిమానా లేదా ఆరు నెలలు జైలు శిక్ష రెండు వేయవచ్చు.

ట్రాఫిక్ అంటే ఏంటి?

ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్ళి వాటిని ట్రాఫిక్ అంటారు. అలాగే వాహనాలు ఒక చోటు నుంచి మరొక చోటుకు రోడ్డుమీద వెళ్ళటానికి ఈ ట్రాఫిక్ ను ఉపయోగిస్తారు.

Traffic

ట్రాఫిక్ విద్య అంటే ఏంటి ?

ట్రాఫిక్ నియమ నిబంధనలు సరళంగా స్పష్టంగా వివరించి తెలియజేయ దాన్ని ట్రాఫిక్ విద్య అంటారు.

మీరు ఎప్పుడైనా రోడ్డు పై జరిగిన ప్రమాదాలు చూశారా? చూసినట్లయితే వారు ఏవిధంగా గాయపడ్డారు? ఆ ప్రమాదం ఎందుకు జరిగిందో ఎప్పుడైనా ఆలోచించారా?

ట్రాఫిక్ విద్యా – అవసరం, ప్రాముఖ్యత:

యుక్త వయసులో పిల్లలు స్వతంత్రతను ఎక్కువగా కోరుకోవడం వారు ప్రమాదాలను కూడా ఎక్కువగా ఎదుర్కోవలసి వస్తుంది.

రోడ్డును ఎక్కువగా ఉపయోగిస్తున్న వారిలో చిన్న పిల్లలు ఎక్కువ. తీవ్రమైన ప్రమాదాలను కొన్నిసార్లు మరణాలకు ముఖ్య కారణం రోడ్డు ప్రమాదాలు అని చాలా మందికి తెలియదు.

అందుకే ప్రమాదాలు నివారణకు రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించడం ఎంతో అవసరం.

ట్రాఫిక్ ఇబ్బందులు (గందరగోళం)

మీరు ఉదయం పాఠశాలకు వెళ్ళవలసి ఉంది. ఆలస్యంగా వెళితే తరగతులు కోల్పోయే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో మీరు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన అట్లా అయితే మీరు ఏం చేస్తారు?

విద్యార్థులు, ఉద్యోగులు, శ్రామికులు టీచర్లు డాక్టర్లు ఇంకా ఎందరో ఇలా ట్రాఫిక్ లో చిక్కుకుంటారు. కాలిబాట పాదచారులకు ప్రత్యేకంగా రోడ్డుకి ఇరువైపులా వేసి ఉంటుంది.

జీబ్రా క్రాసింగ్

ఆటోలు, బస్సులు ఆగినపడు రోడ్డుపై గీసిన తెల్లటి చారల పై నుండి మాత్రమే మనుషులు రోడ్డు కు ఒక దిక్కు నుండి మరొక వైపు వెళ్ళడం పోలీసు అందరికీ సహాయం చేయడం గమనించవచ్చు.

ఈ తెల్లటి చారలని జీబ్రా క్రాసింగ్ అంటారు. వాటి మీద పాదచారులు రోడ్డు దాటుతూ ఉంటారు. కొన్ని కొన్ని చోట్ల స్పీడ్ బ్రేకర్ కారణంగా రోడ్డుపైన వాహనాలు నెమ్మదిగా వెళుతూ ఉంటాయి.

రోడ్డు పై వాహనాలు

వాహనాన్ని బండి అని కూడా అంటారు .వాహనం అనగా ఒక చోటు నుండి మరొక చోటుకు తీసుకుని వెళ్లే బండి.వాహనం వేడుక వలన నడక తగ్గుతుంది.

అంటే వాహనం లో ఎక్కడికైనా ఎంత దూరం ఐన నడవకుండా వెళ్ళవచ్చును. వాహనాన్ని ఆంగ్లము లో వెహికల్ అని అంటారు.ఈ రోజుల్లో వాహనం అనేది ప్రతి ఒక్కరి నిత్యావసర వస్తువు.

వాహనం లేకుండా ఏ ఒక్కరూ బైటకి అడుగు పెట్టడం లేదు. నడక ను మాని వాహనం లోనే ఎంత దూరం ఐన ప్రయాణం చేస్తూ ప్రజలు సుఖపడుతున్నారు.

రోడ్డు ప్రమాదాలురోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రభుత్వం చాలా చర్యలు చేపడుతూ వుంది . రోడ్డు వల్ల సంభవించే ప్రమాదాలను రోడ్డు ప్రమాదాలు అని అంటారు.

ఈ రోడ్డు ప్రమాదాలు అనేవి సాధారణంగా వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో మరియు రోడ్డు మీద నడిచే పాదచారులు లేదా జంతువుల ను వాహనాలుగా ఢీకొట్టడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి.

ఈ రహదారి ప్రమాదాల వలన రోడ్డు మీద నడిచే మనుషులు జంతువులకు కొన్ని కొన్ని సార్లు గాయాలు అవడం కొన్ని సార్లు మరణాలు సంభవిస్తాయి.

వాహనచోదకము

ఒక వాహనం యొక్క చర్య మరియు కదలికలను నియంత్రించడం నీ నడపడం అంటారు. ఉదాహరణకు కారు, బస్, ట్రక్ వంటి వాటిని నడపడం వంటివి.
రోడ్డు నియమాలుపాదచారుల దారి రోడ్డుకు ఇరువైపులా పాదచారులు నడపటానికి వీలుగా ఉండీ ఇది సుమారు రెండు మీటర్ల వెడల్పు ఉంటుంది.

రోడ్డు కి ఇరువైపులా సిమెంట్ దిమ్మలతో పాదచారుల నడుచు స్థలం ఉంటుంది.

జీబ్రా క్రాసింగ్ పాదచారులు రోడ్డు ఒక వైపు నుంచి మరొక వైపుకు దాటడానికి ఉద్దేశించినది.

ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వీటిని సూచిస్తారు

రోడ్డు మీద ట్రాఫిక్ గుర్తులు

వాహనాలను ప్రమాద రహితంగా నడవడానికి వీలుగా రెండు లేదా అంతకన్నా ఎక్కువ రోడ్లు కలిసిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన గుర్తులని సూచించే పరికరం ట్రాఫిక్ గుర్తులు అంటారు.
Traffic lights

రోడ్డు ప్రమాదాలు నియమాలుప్రమాదాలను నివారించడానికి రోడ్డు నియమాలు వుంటాయి. అనగా ఎర్ర లైటు వెలిగినప్పుడు ఆగడం, పచ్చ లైటు వెలిగినపుడు ముందుకు వెళ్లడం, ఆరెంజ్ లైట్ వెలిగిన అప్పుడు సిద్ధంగా ఉండడం. దీన్ని సిగ్నలింగ్ సిస్టం అంటారు.

పట్టణాల్లో నాలుగు రోడ్ల కూడలిలో సిగ్నల్ ఏర్పాటు చేస్తారు. రద్దీ సమయంలో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోతే నియంత్రించడానికి, క్రమబద్ధీకరించడానికి ఈ సిగ్నలింగ్ సిస్టం ఉపయోగపడుతుంది.

దీని వల్ల ప్రమాదాలు నివారించబడతాయి. రోడ్డుపై వెళ్లేవారు తమ ఎడమవైపు నడవడం అనేది రోడ్డుకు సంబంధించిన నియమం. రోడ్డుపైన చారలు గీసి ఉన్నచోట మనుషులు రోడ్డు దాటడం చూసే ఉంటారు.

దీనినే జీబ్రా క్రాసింగ్ అంటారు .ఇవి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఉపయోగపడతాయి. దీని వద్ద వాహనాలు తక్కువ వేగంతో వెళతాయి.

వీధుల్లో సంచరించే జంతువులు పండ్లు ,కూరగాయల, వ్యాపారులు, వాహనాలు, వాహనదారులు ముఖ్యంగా కారులో ఆటోరిక్షా వారు నిలుపుటకు వీలు లేదు.

ఆ ప్రదేశంలో నిలుపుట వల్ల ట్రాఫిక్ జామ్ కారణమవుతున్నాయి. జనాభా పెరగడం వాహనాలు వినియోగం కూడా పెరగడం మూలంగా రోడ్డు ఉపయోగించే వారి సంఖ్య పెరిగింది.

కాబట్టి ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలను విధిగా తెలుసుకోవాలి.

డ్రైవింగ్ లైసెన్స్ అవసరం
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదు. ఇది ఎవరికీ మినహాయింపు కాదు.

డ్రైవింగ్ లైసెన్స్ రకాలు

  • లెర్నర్ లైసెన్స్: ఇది తాత్కాలికమైన డ్రైవింగ్. ఇది నేర్చుకొనుటకు ఆరునెలల కాలపరిమితితో దీనిని జారీ చేస్తారు.
  • శాశ్వత లైసెన్స్: తాత్కాలిక లైసెన్స్ జారీ చేసిన ఒక ఆరు నెలల తర్వాత నుంచి శాశ్వత లైసెన్స్ పొందుటకు అర్హత లభిస్తుంది.
విశ్వాస పరీక్ష పరికరం ఎలా పనిచేస్తుంది?ఎవరైనా ఆల్కహాల్ తీసుకున్నట్లయితే అది రక్తంలో కలిసి పోయినా మన శరీరం మొత్తానికి రక్తం ద్వారా వ్యాపిస్తుంది.

ఈ రక్తం ఊపిరితిత్తుల్లోకి చేరడం ద్వారా మనం విడిచిపెట్టే గాలిలో ఆల్కహాల్ సంబంధించిన ఒక ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా గుర్తించగలం.

మనం విడిచి పెట్టే గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ పాటు ఆల్కహాల్ ఆనవాళ్లు కూడా వుంటుంది.

ఇది తక్కువ మోతాదులో ఉన్నప్పటికీ ఈ పరికరం గుర్తించగలదు.

ఒకవేళ ఈ పరికరం ద్వారా పరీక్షించి అవసరం సంబంధిత అధికారులకు నిందితులకు మేలు చేయాలని ప్రయత్నించిన ఆ పరికరంలో నమోదైన విషయాలను తొలగించే అవకాశం లేదు.

రహదారి భద్రతతాగి డ్రైవింగ్ చేసే వారికి శిక్షలు

  • తాగి వాహనం నడిపితే వారి వాహనాలను అధికారులు సీజ్ చేయవచ్చు.
  • వాహన చోదకులు కోర్టులో హాజరై పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
డ్రైవర్ సలహాలు

వాహన రిజిస్టర్ను డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి అవసరమైన సమాచారం తెలుసుకోవడానికి ఆర్టీవో ఏ కార్యక్రమానికి కార్యాలయానికి వెళ్లాలి.

అక్కడ అధికారులు సూచనల మేరకు అవసరమైన పత్రాలను సమర్పించి ఆ తర్వాత ఏ విధంగా రిజిస్టర్ చేయించుకోవాలి.

శాశ్వత రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలి అనేదిి వివరిస్తారు. ప్రతిి ఒక్కరు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ లేకుండా ఏ వాహనం నడప రాదూ.

రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి


తాత్కాలిక రిజిస్ట్రేషన్
కింది చూచినను ధ్రువీకరణ పత్రాలు రిజిస్ట్రేషన్కు అవసరం.
  • అమ్మకం చేసినట్లుగా డీలర్ నుంచి ధ్రువ పత్రం.
  • రోడ్డుపై నడవడానికి వీలైనది ధ్రువీకరణ పత్రం.
  • వాహన బీమా ధ్రువపత్రం.
  • కాలుష్య నియంత్రణ ధ్రువపత్రం.
  • నివాస  ధ్రువపత్రం.

శాశ్వత రిజిస్ట్రేషన్

తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేయించేటప్పుడు సమర్పించిన ధ్రువీకరణ పత్రాన్ని దరఖాస్తుతోపాటు ఆర్టీఓ అధికారులు ఒక నెల లోపు గా సమర్పించి రిజిస్ట్రేషన్ పొందవచ్చు.

రోడ్డుపై సూచించే గుర్తులు

రోడ్డు ఉపరితలంపై పాదచారులు కోసం వాహన దారులకు మార్గ నిర్దేశనం చేయుటకు ఈ గుర్తులు ఉపయోగిస్తారు. రోడ్డుపై గందరగోళాన్ని ఆగమనాన్ని నివారించడానికి ఒకే విధమైన గుర్తును ఉపయోగిస్తారు.

రోడ్డు భద్రతా వారోత్సవాలు


ప్రతి సంవత్సరం మొదటి వారంలో రోడ్డు భద్రతా వారోత్సవాలను రవాణా శాఖ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియమాలు గురించి ప్రచారం చేస్తుంది.
డ్రైవర్లకు భద్రతతో కూడిన డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
ట్రాఫిక్ నియమాలుసెల్ ఫోన్ లో మాట్లాడుతూ వాహనం నడపరాదు. ద్విచక్రవాహనంపై వెళ్లే వారు తప్పక హెల్మెట్ ధరించాలి. అలాంటి వాహనాలు నడిపేవారు సీట్లలో కూర్చున్న వారు తప్పక సీట్ బెల్ట్ పెట్టుకోవాలి.

ఇయర్ ఫోన్ లో పాటలు వింటూ వాహనం నడప రాదూ. పరిమితికి మించి సభ్యులు వాహనంలో సూచనలు ఇవ్వకుండా ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయరాదు.

వెనుక వాహనాలకు సూచనలు ఇవ్వకుండా కుడి, ఎడమ లకు తిరగరాదు.రోడ్డు నియమాలు పాటించాలి.

సిగ్నల్ ఆధారం గా ప్రయాణించాలి. నియమిత వేగంతో పోతే వాహనం మన అధీనం లో వుంటుంది. ప్రమాదాలు తప్పించవచ్చు.

వాహనాలపై వెళ్ళేవారు ఐన , రోడ్డు పైన నదిచేవరైన రోడ్డు నియమాలు తప్పనిసరిగా పాటించాలి.తద్వారా ప్రమాదాలను నివారించవచ్చు.

బడికి వెళ్లే పిల్లలు చిన్న పిల్లలు రోడ్డు దాటుతూ వుండగా పెద్దవాళ్ళ చేతులు పట్టుకుని దాటాలి. రోడ్డు పైన వాహనాలు వస్తున్నపుడు ఎక్కడ పడితే అక్కడ దాటకుడదు.

జీబ్రా క్రాసింగ్ గీతలు గీసిన చొటునే దాటాలి. అవసరం ఐతే పోలీస్ సహాయం అడగాలి. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు.

Categories: Uncategorized
Hari Shankar Sharma:
X

Headline

Privacy Settings