X

వర్షం లేదా వాన వల్ల లాభాలు మరియు రకాలు

Advertisements

వాన నీరు భూమిని చేరడం

వాన లేదా వర్షం ఆకాశంలో మేఘాలు నుండి భూతలం పైకి బిందువుల రూపంలో కురుస్తుంది. ఆకాశంలో కురిసిన వర్షం అంతా భూమి పైకి చేరదు.

కొంత శాతం వర్షం ఆకాశం గుండా పడుతూనే గాలిలో ఆవిరైపోతుంది.

Rain

అసలు వర్షం అంటే ఏమిటి ?

వర్షం ఎలా సంభవిస్తుంది అనేది అందరికీ తెలియాల్సిన అవసరం చాలా ఉంది. వర్షం ఎలా కురుస్తుంది. 

వర్షం ఆవిర్భావం, నీరు ప్రకృతిలో మూడు రూపాల్లో ఉంటుంది. మంచు, నీరు, నీటి ఆవిరి.

నీటి యొక్క రూపాలు

  1. ద్రవీభవనం : మంచు, నీరుగా మరే ప్రక్రియని ద్రవీభవనం అంటారు.
  2. భాష్పీభవనం : నీటిని, నీటి ఆవిరిగా మార్చే ఈ ప్రక్రియను భాష్పీభవనం అంటారు.
  3. సాంద్రీకరణం : నీరు,  నీటి ఆవిరిగా మారే ప్రక్రియను సాంద్రీకరణం అంటారు.
  4. ఘనీభవనం : నీరు, మంచు గా మారే ప్రక్రియను ఘనీభవనం అంటారు.
  5. ఉత్పతనం : మంచు, నీటి ఆవిరిగా మారే ప్రక్రియను ఉత్పతనం అంటారు. నీటి ఆవిరి, మంచు గా మారే ప్రక్రియను కూడా ఉత్పతనం అంటారు.

భూమి పై భాష్పీభవనం సహజంగా జరిగే ఒక ప్రక్రియ, గాలిలోకి భాష్పీభవనం ద్వారా చేరిన నీటి ఆవిరి మేఘాలుగా మారుతుంది.

శీతాకాలం ఉదయం పూట గడ్డి మీద మొక్కల ఆకుల చివరన చిన్న చిన్న తేమ  బిందువు ఏర్పడటాన్ని సాంద్రీకరణం అంటారు.

మంచు ముక్కలు ఉన్న గ్లాసులో వెలుపలి తలంపై చిన్న చిన్న నీటి బిందువులు ఏర్పడటం సాంద్రీకరణ ప్రక్రియ.

వాన చినుకు గంటకు 7 నుంచి 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది శీతాకాలంలో మన నోటి నుంచి వదిలే గాలి కంటే బయటి వాతావరణంలో గాలి చల్లగా ఉంటుంది. 

గాలిలో ఉండే నీటి ఆవిరి నీటి వెలుపలికి రాగానే హఠాత్తుగా చల్లబడి సూక్ష్మమైన ఈ బిందువు గా మారును. ఇది సాంద్రీకరణ ప్రక్రియను కలిగిస్తుంది.

ఈజిప్టు దేశస్తులు ఎండ నుండి కాపాడుకోవడం కోసం గొడుగుని రూపొందించారు. పెద్ద పెద్ద నీటి బిందువులు ఘనీభవించి మంచు ముక్కలా ఏర్పడతాయి.

రుతుపవనాలు వాటి సమయం

మన రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల వలన జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాలు కురుస్తాయి. ఈశాన్య రుతుపవనాల వలన నవంబర్ డిసెంబర్లలో వర్షాలు కురుస్తాయి.

భాష్పీభవనం, సాంద్రీకరణం ప్రకృతిలో నిరంతరంగా జరగడం వలన జలచక్రం ఏర్పడుతుంది. అడవులలో చెట్లు నరికి వేయడం వలన కర్మాగారాలు వెదజల్లే కాలుష్యం వల్ల భూ వాతావరణం వేడెక్కుతోంది. మేఘాలు ఏర్పడి ఉంటాయి.

మేఘాలు వర్షించుటంలో సాంద్రీకరణ ప్రక్రియ ఉంటుంది. వడగండ్ల వాన పడటం  లో ఉత్పతనం ప్రక్రియ ఉంటుంది.

అవపాతము మరియు రూపాలు

వాతావరణం లోని నీటి ఆవిరి ద్రవీ భావించడం వలన నీరు భూమిని ద్రవ రూపంలో గాని, ఘన రూపంలో కానీ చేరడాన్ని అవపాతము అంటారు. ఇది భూమి పై గల వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో చేరును.

హిమం : నీటి ఆవిరి 0 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ద్రవీభవన చెందినపుడు హిమము ఏర్పడుతుంది. ఈ హిమం 6 ముఖాలు గల స్పటికాలు ఏర్పడుతుంది.

హిమ శిఖరం వర్ష బిందువులు భూమి మీద చేరేటప్పుడు అల్ప ఉష్ణోగ్రత వల్ల మంచు కణాలు గా మారి భూ ఉపరితలానికి చేరినట్లు అయితే దాన్ని హిమ శిఖరం అంటారు.

గ్లేజ్ : వాతావరణంలోని తేమ భూ ఉపరితలానికి చేరిన తరువాత అల్ప ఉష్ణోగ్రత కారణంగా మంచు కణాలుగా మారినట్లయితే దాన్ని గ్లేజ్ అని పిలుస్తారు. తుంపర తుఫాను సమయంలో వర్షం ఆగిపోయిన తరువాత గాలిలో వేలాడుతూ ఉన్నటువంటి చిన్న చిన్న నీటి బిందువులు.

వడగండ్లు : వేసవి కాలంలో క్యుములోనింబస్ మేఘ నిర్మాణం నుండి భూమి ఉపరితలాన్ని చేరి ఘన స్థితిలోనే వుండే అవపాత రూపమే వడగండ్లు.

మేఘాలు అంటే ఏంటి మరియు ఎలా ఏర్పడుతాయి

మేఘాలు వర్షం బాగా ఎండగా వున్న రోజుల్లో సూర్యరశ్మి వల్ల భూమితో పాటు సముద్రాలు, మహాసముద్రాలు, నదులు, చెరువులు మొదలైన వాటిలోని నీరు కూడా వేడెక్కుతోంది.

Black Clouds

అప్పుడు ఆ నీరు భాష్పీభవనం వల్ల నీటి ఆవిరిగా మారుతుంది. నీటి ఆవిరి తేలికగా ఉంటుంది, అందువల్ల అది వాతావరణంలో పైకి చేరుతుంది. భూతలం నుండి పైకి పోయే కొద్దీ గాలి చల్లబడుతుంది అలా వాతావరణంలో పైకి చేరిన నీటి ఆవిరి అక్కడ ఉన్న చల్లని గాలులను తాకి సూక్ష్మమైన చిన్న-చిన్న బిందువులుగా మారుతుంది.

స్వచ్ఛమైన నీటి బిందువులను గాలిలో తేలుతూ వాతావరణంలో మనకు మేఘాల రూపంలో కనిపిస్తాయి.

వర్షం కురవడం


ఆకాశంలో ఏర్పడిన మేఘాలను ఒక చోట స్థిరంగా ఉండలేవు. అవి గాలి వీచే దిశకు అనుకూలంగా తరుచూ కదులుతూ ఉంటాయి. అలా కదులుతూ కొన్ని మేఘాలు కలిసిపోయి అధిక నీటి ఆవిరితో నిండిపోతాయి. 

ఇలా నీటి బిందువులతో నిండిన మేఘాలు, సముద్రాలు నుండి భూతలం వైపుకు ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ మేఘాలు వాతావరణం లోనికి పై పొరలో ఉండే చల్లని గాలుల వల్ల చల్లబడతాయి.

మేఘాలు లేకుండా వర్షాలు కురవడం సాధ్యం కాదు అని మనకి తెలుసు. కానీ అన్ని మేఘాలు వర్షాలను కురిపించలేవు. కనుక వర్షం కురవాలి అంటే మేఘాలలో కొన్ని మార్పులు జరగాలి. 

మేఘాలు మరింతగా చల్లబడినపుడు అందులో తేమ బిందువులు పెద్దవై మేఘాలు బరువుగా మారుతాయి. అప్పుడు అవి భూమిపైకి దిగుతాయి. ఆ మేఘాలు రంగు తెలుపు నుండి నలుపుకు మారుతూ మనకు దట్టమైన మేఘాలు కమ్ముకుని ఉన్నట్లుగా కనిపిస్తుంది.

ఆ సమయంలో ఆ  మేఘాలలో  తేమ బిందువులు మరింత పెద్దవి అవుతాయి. వాటిని నిలుపుకోలేక బిందువుల రూపంలో   కిందకు రావడం ప్రారంభమవుతుంది. దీనినే మనం వర్షం కురవటం అని అంటాము.

వర్షం కురిసే  ముందు  మేఘాలు భూమిపైకి దిగడం చల్లని గాలులు వీచదాన్ని మనం గమనించే ఉంటాం. వడగండ్లు బాగా చల్లగా ఉన్న సమయంలోనూ నీటి బిందువులు చిన్న చిన్న మంచు స్పటికాలుగా ఘనీభవించి మనకు మంచు కురిసినట్లు కనిపిస్తుంది.

కొన్ని సందర్భాలలో పెద్ద -పెద్ద నీటి బిందువులు ఘనీభవించి మంచు ముక్కలుగా కిందకు పడతాయి. వీటినే మనం వడగండ్లు అంటాము.

ఋతుపవనాలు, ప్రతి సంవత్సరం కొన్ని నెలల్లో వర్షాలు కురవడంమనం సాధారణంగా చూస్తుంటాం. మన రాష్ట్రంలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షాలు కురుస్తున్నాయి.

ఈ రోజుల్లో వర్షం ఆకాశం మేఘాలతో నిండి ఉంటుంది. గాలులు కూడా వస్తుంటాయి. కాబట్టి వీటిని నైరుతి రుతుపవనాలు అంటారు. అలాగే నవంబరు నుండి డిసెంబరు నెలలో కూడా వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో ఈశాన్యం మూల నుంచి గా వర్షాలు ఉంటాయి. వీటిని ఈశాన్య రుతుపవనాలు అంటారు.

ఈ మధ్య కాలంలో తగినట్లు వర్షాలు కురవడం లేదని అందరూ అనుకుంటూ ఉండటం మనం వినే ఉంటాం. నైరుతి రుతుపవనాలు భారతదేశ శీతోష్ణస్థితి గణనీయంగా ప్రభావితం చేసేవి నైరుతి రుతుపవనాలు కాలానుగుణంగా గాలుల దిశ మారడాన్ని మాన్సూన్ గా, అరబిక్ వ్యక్తులు పేర్కొన్నారు.

Mansun అనగా రుతుపవనాలు 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 20 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య రుతుపవనాలు ఏర్పడతాయి. వేసవిలో భూమి వేడెక్కడం వల్ల మధ్య భారతం మైదాన ప్రాంతం మీద అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది.

దీంతో పాటు టిబెట్ పీఠభూమి వేడికి బలమైన ఉర్దూ వాయు ప్రవాహాలు ఏర్పడి తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడనం ఈ ప్రాంతం ఏర్పడుతుంది.

హిందూ మహా సముద్రంలో దక్షిణ అర్ధగళంలో ఆగ్నేయ రుతుపవనాలు భూమధ్య రేఖను దాటి భారత ఉపఖండం మీద ఏర్పడ్డ అల్పపీడన ప్రాంతం వైపు పయనిస్తూ నైరుతి రుతుపవనాలు గా మారుతాయి.

భారత ద్వీపకల్పం ఈ పవనాలను రెండు శాఖలుగా ఏర్పరిచింది. ఒకటి అరేబియా సేఖ ఇది భారత పశ్చిమ తీరాన్ని తాకి ఉత్తర దిశగా కదులుతోంది. బంగాళాఖాతం శాఖ బెంగాల్ తీరాన్ని షిల్లాంగ్ పీఠభూమి దక్షిణ ముఖానికి పశ్చిమం గంగా లోయ వైపు మల్లుతుంది.

ఈ రెండు శాఖలు జూన్ మొదట్లో భారతదేశానికి చేరుకుంటాయి. దీనిని రుతు పవనాల ఆరంభం గా పేర్కొంటారు. వర్షపాతం, నైరుతి ఋతుపవనాల కాలంలో పొందుతుంది. పశ్చిమ తీరం ఈశాన్య తీరం లో అధిక వర్షం కురుస్తూ వర్షా ఛాయా ప్రాంతం గా ఏర్పడుతుంది.   ఈ ప్రాంతంలో ఉన్న కోరమాండల్ తీరం లో అంతగా వర్షం కురవదు.

తిరోగమన ఋతు పవనాలు వేడిని పెరుగుతున్న నెలల నుండి పొడిగా ఉన్న చలి పరిస్థితుల మధ్య అక్టోబర్ నవంబర్ నెలలో సంధికాలం ఉంటాయి. తిరోగమన ఋతు సమయంలో ఆకాశం నిర్మలంగా ఉండి ఉష్ణోగ్రత పెరుగుతుంది అధిక ఉష్ణోగ్రత అధిక తేమ కారణంగా వాతావరణం ఒక్క పూట గా ఉంటుంది.

అంటే దీనిని సాధారణంగా అక్టోబర్ వేడిమి అంటాము. ఈ కాలంలో బంగాళాఖాతంలో అల్పపీడన పరిస్థితులు ఏర్పడి ఇది దక్షిణానికి మారుతుంది. అండమాన్ ప్రాంతంలో తుఫానులు వాయుగుండాలు ఏర్పడతాయి. కోరమాండల్ ప్రాంతంలో అధిక శాతం వర్షం తుఫానులు వాయుగుండం సంభవిస్తుంది.

కృష్ణ గోదావరి కావేరి డెల్టా లు వీటి ప్రకోపానికి గురవుతాయి. అప్పుడప్పుడు బంగ్లాదేశ్ సుందర వనాలను కూడా ఇవి తాకుతాయి.

జల చక్రంసముద్రాల నుండి నీరు ఆవిరై ఆకాశంలో మేఘాలు గా మారి తిరిగి వర్షం రూపంలో భూమి పైకి  చేరుకుంటుంది. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. దీన్నే జలచక్రం అంటారు.

సాపేక్ష ఆర్ద్రత (Relative humidity)

ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత పీడనం దగ్గర గాలిలో ఉండగల అత్యధిక నీటి ఆవిరికి ఆ సమయంలో గాలిలో ఉన్న నీటి ఆవిరి మోతాదుకు మధ్య నిష్పత్తిని సాపేక్ష ఆర్ద్రత అందురు.

ఉష్ణోగ్రత తగ్గిన అదనంగా నీటి ఆవిరి చేరిన సాపేక్షికంగా తేమశాతం మారుతుంది. 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఘనపు మీటరు గాలిలో అత్యధికంగా 80 గ్రాములు నీటి ఆవిరి ఉండే అవకాశం ఉందని అనుకుంటే వాస్తవంగా ఉన్న నీటి ఆవిరి 40 గ్రాములు అయితే సాపేక్ష తేమ లేదా ఆ తర్వాత 50 శాతం అవుతుంది.

ఏ గాలి వద్ద అయితే సాపేక్ష ఆర్ద్రత 100% ఉంటుందో ఆ గాలిని సంతృప్త స్థాయికి చేరింది అంటారు అప్పటి ఉష్ణోగ్రత అంటారు. వివిధ రూపాలలో గాలిలోని తేమ భూమి మీద పడటాన్ని అవపాతం అంటారు.

ఇది మంచి వర్షం పొగమంచు తుషారం వడగండ్లు మొదలైన రూపాలలో జరుగుతుంది. వాతావరణంలో అదృశ్యంగా ఉన్నా నీటి ఆవిరి ఆర్ద్రత అంటారు. ఉష్ణోగ్రత తో పాటు ఆ తర్వాత కూడా పెరిగినప్పుడు మనకు అసౌకర్యంగా ఉంటుంది.

చెమట త్వరగా ఇంకి పోక ఉక్క గాను జిగట గాను ఉప్పగా న ఉంటుంది. మహాసముద్రాల ఉపరితలంలో నీరు అత్యధికంగా ఆవిరై మేఘాలు ఏర్పడతాయి. మహాసముద్రాలు అధిక విస్తీర్ణంలో వ్యాపించి ఉండడం వలన వర్షాలు అధికంగా మహాసముద్రాలలో కురుస్తాయి. 

అడువులు నరికివేయడం వల్ల కార్మగారాలు నుండి విడుదల అయ్యే కాలుష్యాల వల్ల భూ వాతావరణం వేడెక్కుతుంది. అందువల్ల మేఘాలు చల్లబడదానికి కావలసిన పరిస్ధతులు తగ్గిపోతున్నాయి. ఇది వర్షాలు తగ్గిపోవడానికి కారణం అవుతుంది.

జలచక్రం లో అంతరాయం వరదలు, కరువులు కు కారణం అవుతుంది.
వరద సమయం లో ఏం చేయాలి. వరదల సమయంలో మరిగించిన నీటిని తాగాలి. ఆహార పదార్థాల పైన మూతలు ఉంచాలి భోజనం మితంగా  చేయాలి.

డయేరియా ప్రబలినప్పుడు డికాషన్ గంజి లేత కొబ్బరి నీరు మొదలైనవి తీసుకోవడం మంచిది. పిల్లలను ఖాళీకడుపుతో ఉండనివ్వకుడదు.  వ్యాధులు వ్యాప్తి చెందకుండా చుట్టుపక్కల బ్లీచింగ్ పౌడర్ మరియు సున్నం జల్లాలి.

వరద నీటిలో వెళ్ళకూడదు, ఒకవేళ వెళ్లవలసి వస్తే లోతు ఎంత ఉందో ఒక అంచనా వేసి మోకాళ్ళ లోతు వరకు మాత్రమే వెళ్లాలి. వరద నీటిలో తడచిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు. గ్రామీణ ప్రాంతాలలో నీటిని మరిగించి తాగాలి.

నీటిని శుద్ధి హలోజన్ చేయటానికి ఉపయోగించాలి. వరదల సమయంలో పాముకాటుతో సాధారణం కాబట్టి ఈ పాముల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వ్యవసయరంగానికి వర్షం ప్రభావం

అవపాతం కి  వర్షం వ్యవసాయన్ని చాలా ప్రభావితం చేస్తుంది. అన్ని మొక్కలకూ జీవించటానికి కొంతైనా నీరు అవసరం. వర్షం అత్యంత సులువైన నీరు అందజేయు పద్ధతి కాబట్టి, ఇది వ్యవసాయానికి చాలా ఉపయోగకరమైనది.

సాధారణంగా ఒక క్రమ పద్ధతిలో తరచూ పడే వర్షాలు మొక్కలు ఆరోగ్యముగా పెరగటానికి అవసరం కానీ అతివృష్టి, అనావృష్టి రెెండు  పంటలకు ముప్పును కలుగజేస్తాయి. కరువు పరిస్థితులు పంటలను పెద్ద ఎత్తులో నాశనం చేస్తాయి. విపరీతమైన తడి వలన హానికరమైన శిలీంధ్రాలు ఎక్కువవుతాయి.

వివిధ మొక్కలు బతకటానికి వివిధ మొత్తాలలో వర్షపాతం అవసరం. ఉదాహరణకు, కొన్ని మొక్కలకు అతి తక్కువ నీరు అవసరం కానీ వరి లాంటి ఉష్ణమండల మొక్కలు జీవించటానికి వందలాది అంగుళాల వర్షం అవసరం.

అన్ని దేశాలలో వ్యవసాయం ఎంతో కొంత వరకైనా వర్షంపై ఆధారపడుతుంది. ఉదాహరణకు, భారతీయ వ్యవసాయరంగము ,వర్షంపై భారీగా ఆధారపడి ఉంది. ముఖ్యంగా పత్తి, వరి, నూనెదినుసులు, ముతక ధాన్యం పంటలు అతి ఎక్కువగా వర్షంపై ఆధారపడుతున్నవి.

ఋతుపవనాలు కొన్ని రోజులు ఆలస్యమైనా, అది 1990వ దశకములో సంభవించిన కరువులలో లాగా దేశ ఆర్థికరంగాన్ని విపరీతంగా దెబ్బతీస్తుంది. 

వర్షాలు పడడం వలన మనకు చాలా లాభాలు ఉన్నాయి. వర్షం వల్ల పంటలు వ్యవసాయం చేసే రైతులకి చాలా ఉపయోగకరమైనది. పంటలు పండుతాయి. ఈ సృష్టి లో  వర్షం పై చాలా జీవ జాతి ఆధారపడి ఉంది. కాబట్టి వర్షాలు పడడానికి మన వంతు గా కలుష్యాన్ని  తగ్గించడానికి   ప్రయత్నించాలి.

Categories: Uncategorized
aravellisharma32:
X

Headline

Privacy Settings