Categories: Uncategorized

బాలల హక్కుల పరిరక్షణ మరియు అభివృద్ధి Protection, and development of children’s rights

బాలల హక్కులు Children’s rights

నేటి బాలలు, రేపటి భావి భారత పౌరులు. నేటి పిల్లలే రేపటి పెద్దలు. రేపటి సమాజం బాలల పైన ఆధారపడి ఉంటుంది. బాలలవి ఎళ్ళలులేని ఆలోచనలు. భారతరాజ్యాంగం ప్రతి పౌరునికి కొన్ని హక్కులను ఇచ్చింది. వాటిని పరిరక్షణ మన అందరి బాధ్యత.

అలాగే బాలలకు అనేక హక్కులు ఉన్నాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తోటి వారు, సమాజం, బాలల పట్ల ప్రేమతో, దయతో ఉండాలి, అప్పుడే వాటి పరిరక్షణ అవుతుంది. వారి అభివృద్ధి కొరకు ఆలోచించాలి. జీవితంలో బాలలు బాగా ఎదగాలని, అందరిలో గుర్తింపు పొందాలని పెద్దలు అనుకుంటారు.

Children going to school

అందుకు ఎనలేని శ్రద్ధతో వారి అభివృద్ధి కొరకు కృషి చేస్తారు. బాలలందరికీ విద్య, మెరుగైన జీవనస్థితి, వినోదం, ఆటపాటలలో స్వేచ్ఛగా పాల్గొనడం, దోపిడీ నుండి రక్షణ, అభిప్రాయాలను స్వేచ్ఛగా వెలిబుచ్చడం అనే హక్కులు కల్పించబడ్డాయి.

హెలెన్ కిల్లర్ Helen Killer

హెలెన్ కెల్లర్ అమెరికాలో జన్మించింది. ఆమెకు 19 నెలల వయస్సులో విష జ్వరం వచ్చి తన కంటిచూపు, నోటిమాట పోయాయి, వినికిడి శక్తి కూడా కోల్పోయింది. అయితే ఆమె తల్లిదండ్రులు నిరాశకు లోనుకాలేదు. ఇలాంటి అమ్మాయి పుట్టిందని తిట్టలేదు. ఆమె జీవితం బాగుండాలని అనేక విధాలుగా ప్రయత్నించారు. 

8 సంవత్సరముల వయస్సులో బ్రెయిలీ లిపి నేర్చుకుంది. సారా పుట్టర్ అనే ఉపాధ్యాయుని వద్ద నెమ్మదిగా మాట్లాడటం నేర్చుకుంది. మాట్లాడే వారి పెదవులపై, కంఠం పై వేలు ఉంచి భాషను నేర్చుకుంది.

33 సంవత్సరముల వయస్సు నుండి ” ప్రత్యేక అవసరాలు గల వారి” గురించి ఉపన్యాసాలు ఇవ్వడం ప్రారంబించింది. భారతదేశంలోని తల్లిదండ్రులు ఆమెను చూసి సరనాలయాలు నుండి వారి పిల్లలను ఇంటికి తెచ్చుకున్నారు. 88 సంవత్సరముల వయస్సులో చనిపోయిన కెల్లర్ ఎంతో మందిలో అనేక రకాలుగా స్ఫూర్తి నింపింది.

బాలలందరూ ఆనందంగా, ఆరోగ్యంగా పెరిగి మంచి పౌరులుగా భారతదేశ అభివృద్ధికి, కీర్తికి పాటు పడతారు. దీనికి ప్రపంచ దేశాలతో సహా మన దేశం కూడా బాలలకు హక్కులను కల్పించింది.

బాలల హక్కులు Children’s Rights

బాలలకు ప్రధానంగా 4 హక్కులున్నాయి. అవి

     1. జీవించే హక్కు.

     2. రక్షణ పొందే హక్కు.

     3. అభివృద్ధి చెందే హక్కు.

     4.భాగస్వామ్య హక్కు.

1. జీవించే హక్కు The right to life

ఆరోగ్యం పోషకాహారం తగిన జీవన ప్రమాణాలు పొందే హక్కు

2. రక్షణ హక్కు The right to protection

దోపిడీ నుండి క్రూరత్వం నుండి దుర్వినియోగం నుండి ఉపేక్ష నుండి స్వేచ్ఛ రక్షణ పొందే హక్కు

3. అభివృద్ధి హక్కు The right to development

విద్య శిశు పోషణ సామాజిక భద్రత విరామం సంస్కృతి కాలక్షేపం మొదలగునవి కలిగి ఉండే హక్కు

4. భాగస్వామ్య హక్కు The right to share

బాలల అభిప్రాయాలను మన్నించుట, వ్యక్తీకరణ, స్వేచ్ఛ సమాచారం పొందుటకు, ఆలోచించుట మొదలైన మత, ఆత్మ పరమైన హక్కులు

భారత ప్రభుత్వం బాలల కోసం చెప్పుకోదగిన చట్టాలు చేసింది

  • క్రీస్తుశకం 1933వ సంవత్సరం నాటి బాలల చట్టం – చిన్నపిల్లలు శ్రమ దోపిడి నుండి రక్షించడానికి అవసరమైన ఆర్థిక సహాయం చేయడం.
  • క్రీస్తుశకం 1938 వ సంవత్సరం నాటి బాలల ఉద్యోగ కల్పన చట్టం – కఠిన శ్రమలకు లోనైన పనుల్లో పిల్లలను వినియోగించరాదని చట్టం.
  • క్రీస్తుశకం 1948 వ సంవత్సరం నాటి కర్మాగారాలు చట్టం – కర్మాగారాల్లో పిల్లలతో పని చేయించరాదు అనే చట్టం

పిల్లలను పనిచేసే వారీగా, డబ్బు సంపాదించే వనరుగా, వాళ్లు చెప్పిన పనులు చేయవలసిన వనరుగా, పెట్టిన ఆహారం తినేవారుగా, పెద్దలు అభిప్రాయాలకు అనుగుణంగా పెరిగే వారీగా కాకుండా బాలల హక్కులకు గుర్తించి వ్యవహరించాలి. 

బాలల దినోత్సవం Children’s Day

భారతదేశం మొదటి ప్రధాన మంత్రి ఐనా శ్రీ జవహర్లాల్ నెహ్రు గారి జయంతి రోజున బాలల దినోత్సవంగ నవంబర్ 14 చేసుకుంటారు.

Children At Their Happiness

ఇంట్లో, బాలల హక్కుల కోసం ఏం చేయాలి- At home, what to do for children’s rights

స్వేచ్ఛా వాతావరణం ఉండాలి. పిల్లల అభిప్రాయాలను గౌరవించాలని. వారి గురించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారితో చర్చించాలి. వారి ఇష్టాయిష్టాలను తెలుసుకోవాలి. కచ్చితంగా బడికి పంపాలి. లక్ష్యాలు నిర్దేశించ రాదు. క్రమశిక్షణ పేరుతో వీక్షించరాదు.

ఇంటి పని చేయలేదని, చదవడం, రాయడం రాదని, మొదటి స్థానం పొందలేదని, శారీరకంగా, మానసికంగా, హింసించడం బాలల హక్కుల ప్రకారం నేరం.

శారీరకంగా, మానసికంగా హింసించ రాదు. పేర్లతోనే పిలవాలి. అభివృద్ధికరమైన వాతావరణం ఉండాలి.

పాఠశాలలో, బాలల హక్కుల కోసం ఏం చేయాలి – In school, what needs to be done for children’s rights

ఇంటి పని చేయలేదని చదవటం, వ్రాయటం రాదని, మొదటి స్థానం పొందలేదని, శారీరకంగా, మానసికంగా, హింసించడం బాలల హక్కు ప్రకారం నేరం. శారీరకంగా, మానసికంగా హింసించ రాదు. పేర్లతో పిలవాలి. తిట్ట రాదూ, కలుపుగోలుగా వుండాలి.

నేటి బాలలే రేపటి పౌరులని సమాజం గుర్తించాలి. పౌరులకు ఈ హక్కులు ఉన్నట్లుగా తెలియచేయాలి. బాలల హక్కులు ఉన్నాయని గుర్తించి వాటిని పాటించాలి. అమలు చేయాలి. అన్ని అంశాలలో వారికి ప్రాధాన్యత నివ్వాలి. సమాన అవకాశాలు ఇవ్వాలి. పిల్లలను గౌరవంగా చూడాలి. వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి.

సమాజంలో, బాలల హక్కుల కోసం ఏం జరగాలి In society, what should happen for children’s rights

బాలల హక్కులు అన్ని చోట్ల పరిరక్షించబడాలి. ఇంట్లో, బడిలో, తాను పాల్గొనే అన్ని చోట్ల సమాజంలో ఎక్కడైనా బాలల హక్కులు  పరిరక్షింపబడాలి. బాలలు తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండి తమ హక్కుల రక్షణకు కృషి చేయాలి. పెద్దలు హక్కులను గుర్తించి నడుచుకోవాలి.

రేపటి పౌరులు ఈ సమాజం గుర్తించాలి. బాలల హక్కులు ఉన్నట్లు గుర్తించాలి అన్ని అంశాలలో వారికి ప్రాధాన్యత ఇవ్వాలి పిల్లలను గౌరవంగా చూడబడాలి ఇంట్లో బడిలో తాను పాల్గొనే అన్ని చోట్ల సమాజంలో ఎక్కడైనా బాలల హక్కుల పరిరక్షింపబడాలి. బాలల హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండి తమ హక్కులు రక్షణకు కృషి చేయాలి.

బాలల పార్లమెంట్ Children’s Parliament

సుమారు ఆరు నుండి 18 సంవత్సరాల వయస్సు ఉన్న 30 మంది బాలబాలికలతో ఏర్పాటు చేసినదే బాలల పార్లమెంట్. ఇందులో ఆవాస ప్రాంతంలోనే బాలలు సభ్యులుగా ఉంటారు.

పార్లమెంట్ విద్య, ఆరోగ్యం, బాలల సమస్యలు, బాలల హక్కుల ఉల్లంఘన వంటి అంశాలతో ప్రతివారం సమావేశం ఏర్పాటు చేసుకుని చర్చించాలి. బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేసి, అందుకు కృషి చేస్తున్న సంస్థలతో కలిసి పని చేయాలి. కేరళలో 2722 బాలల పార్లమెంటులో ఆరు లక్షల మంది బాలలు సభ్యులుగా ఉన్నారు.

బాలల హక్కుల పరిరక్షణ కేంద్రం Center for the Protection of the Rights of the Child

బాలలను శారీరకంగా, మానసికంగా హింసించినా, బాలల హక్కులకు భంగం కలిగించినా, బాలల హక్కుల పరిరక్షణ కేంద్రం వారు తగిన చర్యలు తీసుకుంటారు. బాలలకు ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం బాలల హక్కులకు భంగం కలిగించిన వారిపై తగు చర్యలు తీసుకుంటారు.

చదవలేదని, ఇంటి పని చేయలేదని శిక్షించడం చట్ట ప్రకారం నేరం. బాలల హక్కులకు బంగం కలిగినట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి వివరాలు చెబితే తగిన చర్యలు తీసుకుంటారు. ఇది ఉచిత సర్వీస్. రాజీవ్ విద్యా మిషన్, హైదరాబాద్లో దీని కార్యాలయం ఉంది.

పరిరక్షణ క్లబ్ Conservation Club

ప్రతి పాఠశాలలో బాలల హక్కుల పరిరక్షణ క్లబ్ ఏర్పాటు చేయాలి. ఇందులో బాలలు సభ్యులుగా ఉంటారు. బాలల హక్కుల పరిరక్షణకు ఈ క్లబ్ కృషి చేయాలి. ప్రతి నెల సమావేశం ఏర్పాటు చేసుకుని  సమీక్ష చేయాలి. బాలల హక్కులకు భంగం కలగకుండా చూడడం, బాలల అవసరాలను తీర్చడం ఈ క్లబ్ చేయవలసిన పనులలో ముఖ్యమైనవి.

చైల్డ్ లైన్ Child Line

సహాయం అవసరం అయిన బాలలు లేదా బాలల కోసం ఎవరైనా 1098 అనే ఉచిత నెంబరరు కి ఫోన్ చేస్తే వారు జిల్లా కేంద్రంలో ఉన్న చైల్డ్ లైన్ సిబ్బందికి సమాచారం అందిస్తారు. వారు వెంటనే స్పందించి సమస్య ఉన్న ప్రదేశానికి చేరుకుని బాలల కోసం తక్షణ చర్యలు చేపడతారు.

బాల కార్మికులు, వీధి బాలలు, వివక్షతకు గురైన వారు, మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డవారు, బాల్య వివాహ బాధితులు, హెచ్ఐవి తదితర బాధితుల బాలల కోసం ఇది పనిచేస్తుంది.

బాలలు ఎవరైనా తక్షణ సహాయం కోసం 1098 అనే ఉచిత నెంబరు కి ఫోన్ చేస్తే జిల్లా కేంద్రంలోని చైల్డ్ లైన్ సిబ్బంది వెంటనే సంబంధిత ప్రదేశానికి వెళ్లి బాలులను కాపాడుతారు. వారిని తల్లిదండ్రుల వద్దకు చేరుస్తారు. లేకపోతే బాలల పునరావాస కేంద్రాలకు పంపించి ఉచితంగా వసతి కల్పించి చదువు చెప్పిస్తారు.

ప్రపంచం మొత్తంలో వెట్టిచాకిరి చేస్తున్న బాలల గురించి మరియు హక్కులు కోల్పోయిన బాలల గురించి ఆలోచించండి. అలాంటి బాలలకు న్యాయం జరిగేలా చూడాలి.

అందరం కలిసి బాలల హక్కుల పరిరక్షణకు పాటు పడదాం. బాలల హక్కుల పరిరక్షణలో విజయం సాధిస్తాం అనే విశ్వాసం తో పని చేద్దాం.

aravellisharma32

Recent Posts

ప్రపంచంలో అనేక ఖండాలు -భారతదేశం మరియు మహా సముద్రాలూ

ఖండాలు -మహా సముద్రాలూ మరియు భారతదేశం దేశాలు ఉన్న విశాల భూభాగాన్ని మనం మన సౌలభ్యం కోసం సాధ్యమైనంత వరకు…

4 months ago

అంతరిక్ష రంగం మరియు ప్రయోగాలు

అంతరిక్ష రంగం భూమి చుట్టూ ఉన్న ప్రదేశమును అంతరిక్షం లేదా ఖగోళం లేదా రోదశి అని అంటారు. దీని గురించి…

6 months ago

వాతావరణం మరియు గాలి

వాతావరణం అంటే ఏంటి? మన చుట్టూ ఉండే గాలే వాతావరణం. ఈ గాలిలో అనేక వాయువులు, దుమ్ము, దూళి, నీటి ఆవిరి…

7 months ago

అనేక రకాల శక్తి రూపాలు మరియు వాటి ఉపయోగాలు (Many form of Energy and uses)

శక్తి (Energy)     పని చేయగల సామర్థ్యాన్ని శక్తీ అనీ పిలుస్తారు. పని, శక్తి రెండూ ఒకే ప్రమాణం కలిగి…

7 months ago

రక్త ప్రసరణ వ్యవస్థ మరియు రకాలు

రక్తం, గుండె మరియు ప్రసరణ వ్యవస్థ రక్తనాళాలను, హృదయాన్ని కలిపి రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. రక్త ప్రసరణను మొదటిసారిగా…

8 months ago

వర్షం లేదా వాన వల్ల లాభాలు మరియు రకాలు Benefits and types of rain or rain

వాన నీరు భూమిని చేరడం Rainwater accumulation on land వాన లేదా వర్షం ఆకాశంలో మేఘాలు నుండి భూతలం…

8 months ago