Categories: Uncategorized

మన విశ్వం సౌర కుటుంబం (Our Universe Solar System)

సౌర కుటుంబం అంటే ఏంటి(What is Solar System ?)

ఆకాశంలో మేఘాలు సూర్యచంద్రులు, నక్షత్రాలు తో పాటు కొన్ని గ్రహాలు, తోకచుక్కలు వంటివి ఉంటాయి. కొన్ని మన కంటికి కనబడతాయ, మరికొన్ని కనబడవు.

రాత్రిపూట కనబడే మినుకు మినుకు మనే ప్రకాశించే నక్షత్రాలన్నీ మన నుండి అనేక కిలోమీటర్ల దూరంలో ఉండడం వలన చిన్నవిగా కనబడతాయి.

దాదాపు 250 నుండి 500 మంది ప్రయాణికులు కూర్చుండి  విమానం ఆకాశంలో ప్రయాణిస్తున్నప్పుడు మనకు ఎంతో చిన్నగా కనిపిస్తుంది.

బుధుడు (Mercury), శుక్రుడు (Venus), భూమి (Earth), అంగారకుడు (Mars), గురుడు (Jupiter), శని (Saturn), యురేనస్ (Uranus), నెఫ్ట్యూన్ (Neptune), అనే గ్రహాలు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి.

Solar System

సూర్యుడు దాని చుట్టూ ఉన్న గ్రహాలను కలిపి సౌర కుటుంబం అని అంటారు. పూర్వం ఫ్లూటో (Pluto) ను కూడా ఒక గ్రహం లాగా పరిగణించి నవగ్రహాలు అనేవారు.

కానీ ప్రస్తుతం శాస్త్రజ్ఞులు ప్లూటో  అను గ్రహం పరిగణించడం లేదు. కాబట్టి సౌర కుటుంబంలో సూర్యుని తో పాటు ఎనిమిది గ్రహాలు ఉన్నాయి .

కక్ష్య (Orbit)

ప్రతి గ్రహం ఒక నిర్ణీత మార్గంలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది దీనినే కక్ష అంటారు.

సౌర కుటుంబం (Solar System)

సూర్యుడు, సౌర కుటుంబం లోని గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్స్  అనే గ్రహశకలాలు, తోకచుక్కలు ను కలిపి సౌర కుటుంబం అంటారు.

గెలాక్సీ (Galaxy)

అనేక నక్షత్రాల సముదాయాన్ని గ్యాలక్సీ అని అంటారు. పాలపుంత గెలాక్సీ కి చెందిన అనేక నక్షత్రాలలో సూర్యుడు ఒకటి.

అలాంటిదే  విశ్వంలో కొన్ని వేల కోట్లు ఉన్నాయి. కొన్ని నక్షత్రాలు సూర్యుడు వలె వాటి చుట్టూ తిరుగుతూ ఉండే గ్రహాలు సముదాయాన్ని కలిగి ఉంటాయి. వీటన్నింటినీ మన విశ్వ కుటుంబం అని అంటారు.

సూర్యుడు (Sun)

సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. భూమికి మిగతా నక్షత్రాల కన్నా దగ్గరగా ఉండడం వలన సూర్యుడు పెద్దగా కనబడుతూ మనకు వెలుతురును వేడిని ఇస్తున్నాడు.

సూర్యుడు ఒక మండుచున్న అగ్ని గోళం సౌర వ్యవస్థలో అన్నింటికన్నా పెద్దది సూర్యుడు.

సూర్యుడు అన్ని దిశలకూ సూర్యకిరణాలను ప్రసరిస్తాడు. సౌర వ్యవస్థలో శక్తి అంతటికీ మూలం సూర్యుడే. ఈ శక్తి లో కొంత భాగం వెలుతురు గా మారి కొంత భాగం భూమిని చేరుతుంది.

భూమి మరియు దానితో పాటు మొత్తం గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడు సూర్యుని వైపు సూటిగా చూడరాదు. అలా చూస్తే కళ్లకు తీవ్రమైన నష్టం జరుగుతుంది

భూమికి సూర్యుడికి దూరం ఎంత?


మనకు అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు 1.5×10″మీటర్ల దూరంలో ఉన్నాడు. ఈ దూరనికీ ఖగోళ ప్రమాణం ఆస్ట్రనామికల్ యూనిట్
పగలు రాత్రి భూమి దాదాపు గుడ్రంగా బంతి ఆకారం లో వుంటుంది.

భూమి తన చుట్టూ తాను బొంగరం లా తిరగడం వలనే పగలు, రాత్రి ఏర్పడతాయి. సూర్యుని వైపు భూభాగంలో పగలు, అవతలి వైపు వున్న భుభాగ రాత్రి ఏర్పడతాయి.

భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటే దానిని  భూభ్రమణం అంటారు. భూమిని ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు సమయం పడుతుంది.

దీనినే మనం ఒక రోజు పరిగణిస్తాం. ప్రతిరోజు సుమారు 12 గంటల పగటి సమయం మరియు దాదాపు 12 గంటల రాత్రి సమయం ఉంటాయి.

భూమి – చంద్రుడు (Earth – Moon)

భూమి యొక్క సహజ ఉపగ్రహం చంద్రుడు. అంతరిక్షం లో ఒక గ్రహం చుట్టూ తిరిగే మరియొక ఖగోళ పదార్థాన్ని ఉపగ్రహం అంటారు.

భూమి చుట్టూ చంద్రుడు ఒక క్రమబద్ధమైన కక్ష్యలో తిరుగుతూ ఉంటాడు. ఒకసారి భూమి చుట్టూ తిరగడానికి చంద్రునికి దాదాపు 28 రోజుల సమయం పడుతుంది.

The Earth

చంద్రునికి స్వయంప్రకాశ శక్తి లేదు. సూర్యుని కాంతి చంద్రుని పై పడి పరావర్తనం చెంది తిరుగుతున్నప్పుడు చంద్రుని సూర్యుని వైపు ఉంటుంది.

కక్ష్యలో తిరుగుతున్న చంద్రునిలో ఒకవైపు లోని వివిధ భాగాలు భూమి నుండి కనబడతాయి.

అందువల్లనే చంద్రుడు వివిధ ఆకారాలు ఒకసారి చిన్నగా మరొకసారి పెద్దగా కనబడతాడు.

చంద్రుని వివిధ కళలు ఏర్పడటానికి దాదాపు 28 రోజులు పడుతుంది. భూమి లాగే చంద్రుడు ఇతర గ్రహాలు వల్లే తమ చుట్టూ తాను తిరుగుతూ ఉంటాయి.

ఏకకాలంలో చంద్రుడు తన చుట్టూ, భూమి చుట్టూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాడు. చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నప్పుడు దాని ఆకారం మారినట్లుగా కనబడుతుంది.

చంద్రుని పైన ఉండే ప్రదేశాలు గ్రహించే సూర్యకాంతిలో మార్పుల వల్లే చంద్రుని పరిమాణంలో తేడాలు వున్నట్లు భూమి నుండి కనబడుతుంది. 

కాంతి సంవత్సరం (Light Year)

కాంతి ఒక సంవత్సర కాలంలో శూన్యంలో ప్రయాణించే దూరాన్ని ఒక కాంతి సంవత్సరం అంటారు. ఒక కాంతి సంవత్సరం 9.3×10(15) మీటర్లు.

గ్రహాలు వాటి పరిమాణాలు ( Planets and their sizes)

గ్రహాలు స్వయం ప్రకాశాలు కావు. ఇవి నక్షత్రాల చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతూ ఉంటై, గ్రహాలు తిరిగే మార్గాన్ని కక్ష అంటారు. గ్రహాల చుట్టూ తిరిగే గోళాలను ఉపగ్రహాలు అంటారు.

విశ్వంలో భూమి పై తప్పా మిగత గ్రహాలపై ప్రాణులు ఉండటానికి కావలసిన వాతావరణ పరిస్థితులు ఎక్కడ లేవు.

బుధ గ్రహం సూర్యుడికి అతి సమీపంలో ఉండటం వల్ల దాని మీద పగలు భాగం అతి వేడిగా రాత్రి అతి చల్లగా ఉంటుంది.

శుక్ర గ్రహం అతి దట్టమైన మేఘాలతో ఉండటం వలన సూర్యకాంతి దాని తలని చేరలేదు.

శనిగ్రహం కిలోమీటర్ల మందం ఉన్న మంచు పొరలతో నిండి ఉండటం వల్ల అతి చల్లగా ఉంటుంది. కాబట్టి వీటిపై ప్రాణులు ఉండటానికి అవకాశం లేదు.

కుజ గ్రహం మాత్రం ఆక్సిజన్ నీటి ఆవిరితో కూడిన వాతావరణాన్ని కలిగి ఉంది, కానీ దాని ఉష్ణోగ్రత 25°c-40°c మధ్య ఉంటుంది.

అయినప్పటికీ ఈ గ్రహం మీద రాళ్ల మధ్య  జీవనం ఉండడానికి అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.

గ్రహాలు చలనాలు (Planets and Motions)

ప్రతి గ్రహానికి రెండు రకాల చలానా లు ఉంటాయి.

1) పరిభ్రమణం (Rotation)

2) ఆత్మభ్రమణం (Rotation of the soul)

పరిభ్రమణం

గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరగడాన్ని పరిభ్రమణం అంటారు. భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమించడానికి 365 1/4 రోజులు పడుతుంది.

ఈ విధంగా సూర్యుడి చుట్టూ పరిభ్రమించుటం వల్ల భూమిపై ఋతువులు ఏర్పడుతున్నాయి.

ఆత్మభ్రమణం

గ్రహాలు దాని గుండా పోయే అక్షం చుట్టూ పరి భ్రమించడం నీ ఆత్మభ్రమణం అంటారు. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది.

నక్షత్రాలు (Stars)

సూర్యుడి మాదిరిగా స్వయం ప్రకాశాలు గా ఉండటం వల్ల ఉష్ణం ,కాంతిని విడుదల చేస్తాయి. నక్షత్రం లోపల ఉష్ణోగ్రత కొన్ని మిలియన్ డిగ్రీలు ఉంటుంది.

కాబట్టే నక్షత్రాలు పదార్థం వాయు స్థితి లో ఉంటుంది.

విశ్వం లోని మరికొన్ని విషయాలు

ఆకాశంలో మనం చూసే అంతరిక్ష వస్తువులు నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు, మొదలగునవి.

సూర్యుని చుట్టూ పరిభ్రమించే వాటిని గ్రహాలు అంటారు. గ్రహాల చుట్టూ పరిభ్రమించే వాటి ఉపగ్రహాల అంటారు.

ప్రతి గ్రహం సూర్యుని చుట్టూ ఒక ప్రత్యేకమైన మార్గంలో పరిభ్రమిస్తుంది. ఈ మార్గాన్ని ఆ గ్రహం యొక్క కక్ష అంటారు.

ఒక గ్రహం సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టే కాలాన్ని ఆ గ్రహం యొక్క పరిభ్రమణ కాలం అంటారు.

ఒక గ్రహం చుట్టూ తిరగడానికి పట్టే కాలాన్ని భ్రమణ కాలం అంటారు. కోట్ల నక్షత్రాలు గల పెద్ద-పెద్ద గుంపులను గ్యాలక్సీ అంటారు. 

భూమిపైన నిట్టనిలువుగా ఉంచబడిన వస్తువు యొక్క అతి తక్కువ పొడవైన నీడ సూచించే దిశలను ఉత్తర దక్షిణ దిక్కులు అంటారు.

భూమిపై నిట్టనిలువుగా ఉంచబడిన కర్ర యొక్క నీడ ఆధారంగా సమయాన్ని తెలియజేయు దానిని సౌర గడియారం లేదా నీడ గడియారం అంటారు.

ఏ సమయంలో వస్తువు అతి తక్కువ పొడవు నీడ ఏర్పడుతుందో ఆ సమయాన్ని ఆ ప్రదేశం యొక్క ప్రాంతీయ మధ్యాహ్న సమయం అంటారు.

సూర్యుడు ఉదయించే స్థానం రోజురోజుకీ ఉత్తర దిక్కుగా కదులుట ను ఉత్తరాయణమంటారు. సూర్యుడు ఉదయించే స్థానం రోజురోజుకీ దక్షిణ దిక్కుగా కదులుట దక్షిణాయనం అంటారు.

కృత్రిమ ఉపగ్రహాలు అంటే ఏంటి? (What is called Artificial satellites?)

చంద్రుని ఆకారంలో కలిగే మార్పులను చంద్ర కళలు అంటారు. మానవనిర్మిత ఉపగ్రహాలను కృత్రిమ ఉపగ్రహాలు (Artificial satellites) అంటారు.

వివిధ జంతువులు మనుషులు ఆకారంలో గల నక్షత్రాల చిన్నచిన్న గుంపులను నక్షత్ర రాశి అంటారు.

సూర్యుని కిరణాలు చంద్రుని మీద పడకుండా భూమి అడ్డు వచ్చును దానిని చంద్రగ్రహణం (Lunar Eclipse) అంటారు.

సూర్యుడు కనబడకుండా భూమికి చంద్రుడు అడ్డువస్తే సూర్యగ్రహణం (Solar Eclipse) అంటారు. బుధుడు, శుక్రుడు, భూమి మిగిలిన గ్రహాల కంటే సూర్యునికి అతి దగ్గరగా ఉన్నాయి.

గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్, గ్రహాలను బాహ్య గ్రహాలు అంటారు.

సూర్యుని చుట్టూ తిరుగుతున్న అంతరిక్ష వస్తువులను ఆస్టరాయిడ్స్ అంటారు. అంతరిక్షం నుండి పడే కొన్ని శకలాలు సూర్యుని చుట్టూ పొడవైన దీర్ఘ వృత్తాకార కక్ష్యలలో తిరుగుతున్నాయి.

అప్పుడప్పుడు భూవాతావరణం లోనికి ప్రకాశిస్తూ చొరబడే వస్తువులను ఆకాశంలో ఉత్తరదిశగా అతి కాంతివంతంగా కనిపించే నక్షత్రమే ధ్రువ నక్షత్రం.

ఒక్కొక్కప్పుడు చాలా పెద్దవిగా ఉండి  అవి మండి ఆవిరయ్యే లోపలే భూమి మీద పడతాయి. భూమిని చేరి ఉల్కను ఉల్కాపాతం అంటారు. 

చంద్రుడు ఆకాశంలో తను కనిపించిన ప్రదేశంలో మళ్లీ కనిపించడానికి ఒక రోజు కంటే దాదాపు 50 నిమిషాలు ఎక్కువ సమయం పడుతుంది.

ప్రాంతీయ మధ్యాహ్న వేళ లో అతి తక్కువ పొడవు గల నీడ ఏర్పడుతుంది.  అమావాస్య రోజున సూర్యుడు చంద్రుడు భూమికి ఒకే వైపున ఉంటాయి.

పౌర్ణమి (Full Moon) రోజున సూర్యుడు చంద్రుడు భూమికి ఒకే వైపు ఉంటాయి.

ధ్రువ నక్షత్రం భూమి యొక్క అక్షం దిశలో ఉన్నందున అది తిరుగుతున్నట్లు కనిపించదు. చంద్రుడిపై వాతావరణం లేదు అందువలన చంద్రునిపై శబ్దాలను వినలేము.

మన సౌరకుటుంబంలో ఎనిమిది గ్రహాలు ఉన్నాయి. వీటన్నింటిలో కి భూమిపై మాత్రమే జీవం ఉంది.

భూమి యొక్క నీడ చంద్రునిపై పడినప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది . పౌర్ణమి రోజులలో చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.

చంద్రుని నీడ  భూమి పై పడటం వలన ఏర్పడుతుంది. సౌర కుటుంబంలో అతి చిన్న గ్రహం బుధుడు, అతి పెద్ద గ్రహం బృహస్పతి.

భారతదేశం ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఆర్యభట్ట. కృత్రిమ ఉపగ్రహాల వలన వాతావరణం ముందస్తు అధ్యయనం రేడియో మరియు టీవీ ప్రసారాలు టెలికమ్యూనికేషన్ రిమోట్ సెన్సింగ్ ఉపయోగాలు కలవు.

సూర్యుని సమీపిస్తున్న కొద్దీ తోకచుక్క (Comet) యొక్క పరిమాణం పెరుగుతుంది.

శుక్రగ్రహం మరియు యురేనస్ గ్రహం తూర్పు నుండి పడమరకు తిరుగుతాయి.

మిగిలిన గ్రహాల అన్నీ పడమర నుండి తూర్పుకు తిరుగుతాయి. చంద్రుని కక్ష తలము భూమి నక్షత్రానికి అయిదు డిగ్రీల 9 నిమిషాల కోణంలో ఉంటుంది.

శుక్ర గ్రహం ఉపరితలంపై వాతావరణం ఏర్పడి ఉంటుంది. శుక్ర గ్రహం పై పడిన సూర్యకాంతి లో 75% కాంతిని పరావర్తనం చేయడం వలన శుక్ర గ్రహం కాంతి వంతమైనదిగా కనబడుతుంది.

పాలపుంత అంటే ఏంటి? (What is Milky Way?)

మనం ఉండే గ్యాలక్సీ ని పాలపుంత (Milky Way) అంటాము .సూర్యునికి అతి దగ్గరగా ఉండే గ్రహం బుధుడు సూర్యునికి అతి ఘోరంగా ఉండే గ్రహం, శని గ్రహానికి అత్యధిక ఉపగ్రహాలు కలవు.

అవి 53. బుధుడు ఒక పరిభ్రమణాన్ని 88 రోజులు పడుతుంది. గ్రహాలలో కెల్లా అతి ప్రకాశవంతమైన శుక్రుడు. దీనిని వేగుచుక్క లేదా సాయంకాల చుక్క అంటారు.

శుక్రుని పరిభ్రమణాన్ని కి225 రోజులు పడతాయి. భూమి యొక్క ఉపగ్రహం చంద్రుడు. భూమి యొక్క పరిభ్రమణాన్ని  365. 25 రోజులు పడుతుంది.

కుజుడు లేదా అంగారకుడు ఎరుపు రంగులో ఉన్న కనబడడం వలన దీనిని అరుణగ్రహం అని అంటారు. దీని పరిభ్రమణాన్ని కి 687 రోజులు పడుతుంది. బృహస్పతి లేద గురు పరిభ్రమణాన్ని కి 4331 రోజులు పడుతుంది.

శనిగ్రహం పసుపు వర్ణంలో కనిపిస్తుంది. దీని పరిభ్రమణ కాలం 29.5 సంవత్సరాలు. యురేనస్ యొక్క భ్రమణ అక్షరం కారణంగా అది తన చుట్టూ తాను తిరగడం అనేది దొర్లుతున్న ట్లుగా కనిపిస్తుంది.

దీని పరిభ్రమణ కాలం 84సంవత్సరాలు. నెప్ట్యూన్ యొక్క పరిభ్రమణ కాలం 165 సంవత్సరాలు. దీనిపై అత్యల్ప ఉష్ణోగ్రత ఉంటుంది.

హేలీ  అనే శాస్త్రవేత్త తోకచుక్క కనుగొన్న తోకచుక్క కు హేలీ తోకచుక్క అని పేరు పెట్టాడు. ఇది 76 సంవత్సరాల కొకసారి మాత్రమే కనిపిస్తుంది.

నక్షత్రాలు హైడ్రోజన్, హీలియం వాయువులను చాలా ఎక్కువగా పరిమాణంలో కలిగి ఉంటాయి. కేంద్రక చర్యలు (Nuclear reaction) జరగడం వల్ల నక్షత్రాలు కాంతిని శక్తిని విడుదల చేస్తాయి.

నక్షత్ర మండలాలు (Galaxies)

కొన్ని నక్షత్రాల సముదాయాన్ని నక్షత్ర మండలాలు అని అంటారు. ఇప్పటివరకు 88 నక్షత్ర మండలాలను గుర్తించారు అంతరిక్షంలో ఉండే  మేఘాలను నిహారికలు అని అంటారు.

నక్షత్రాల మధ్య గురుత్వాకర్షణ (Gravity) వలన అది గుంపులు గుంపులుగా ఏర్పడ్డాయి. నక్షత్రానికి మరియుు మేఘాలకు మధ్య దూరం 1,55,000 కాంతి సంవత్సరాలు.

సూర్యుడు  తరువాత భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం పక్షిమ సెంట్ ఆర్య

ధ్రువ నక్షత్రం (Polar Star)

ధ్రువ నక్షత్ర స్థానాన్ని మండల సహాయంతో తెలుసుకోవచ్చు సప్తర్షి మండలాన్ని ఇంగ్లీష్ గ్రేట్ అంటారు. ఇవి నాగలి లేదా గాలిపటం ఆకారంలో ఉంటుంది.

మాతృక నక్షత్ర వీధులు

విశ్వ వ్యాకోచ పదార్థం మొదట విస్పోటనం (Explosion) చెందినప్పుడు బిలియన్ల వాయు పదార్ధాలు, దీవులు అంతరిక్షంలో ఏర్పడ్డాయి. వీటిని మాత్రిక  నక్షత్ర వీధులు అంటారు.

ఇప్పటివరకు కనుగొన్న పెద్ద నక్షత్రం ఎఫ్ సి లాన్ ఏరీగా శాస్త్రజ్ఞులు ఇప్పటివరకు 88 నక్షత్ర రాశులను అధ్యయనం చేశారు. అతి పెద్ద నక్షత్రం రాశి హైడ్రో దీనిలో 78 నక్షత్రాలు ఉంటాయి.

కాస్మిక్ సంవత్సరం (Cosmic Year)

పాలపుంతలో నక్షత్రాలు పాలపుంత కేంద్రం చుట్టూ ఒక పరిభ్రమణం పూర్తి చేయడానికి పట్టే కాలాన్ని కాస్మిక్ సంవత్సరం అంటారు.

aravellisharma32

Recent Posts

బాలల హక్కుల పరిరక్షణ మరియు అభివృద్ధి Protection, and development of children’s rights

బాలల హక్కులు Children's rights నేటి బాలలు, రేపటి భావి భారత పౌరులు. నేటి పిల్లలే రేపటి పెద్దలు. రేపటి…

2 months ago

ప్రపంచంలో అనేక ఖండాలు -భారతదేశం మరియు మహా సముద్రాలూ

ఖండాలు -మహా సముద్రాలూ మరియు భారతదేశం దేశాలు ఉన్న విశాల భూభాగాన్ని మనం మన సౌలభ్యం కోసం సాధ్యమైనంత వరకు…

4 months ago

అంతరిక్ష రంగం మరియు ప్రయోగాలు

అంతరిక్ష రంగం భూమి చుట్టూ ఉన్న ప్రదేశమును అంతరిక్షం లేదా ఖగోళం లేదా రోదశి అని అంటారు. దీని గురించి…

6 months ago

వాతావరణం మరియు గాలి

వాతావరణం అంటే ఏంటి? మన చుట్టూ ఉండే గాలే వాతావరణం. ఈ గాలిలో అనేక వాయువులు, దుమ్ము, దూళి, నీటి ఆవిరి…

7 months ago

అనేక రకాల శక్తి రూపాలు మరియు వాటి ఉపయోగాలు (Many form of Energy and uses)

శక్తి (Energy)     పని చేయగల సామర్థ్యాన్ని శక్తీ అనీ పిలుస్తారు. పని, శక్తి రెండూ ఒకే ప్రమాణం కలిగి…

7 months ago

రక్త ప్రసరణ వ్యవస్థ మరియు రకాలు

రక్తం, గుండె మరియు ప్రసరణ వ్యవస్థ రక్తనాళాలను, హృదయాన్ని కలిపి రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. రక్త ప్రసరణను మొదటిసారిగా…

8 months ago