Categories: Uncategorized

జంతువుల జీవన విధానం

జంతువుల జీవన విధానం

జీవవైవిద్యంలో మనుషులందరూ కుటుంబాలతో కలిసి నివసిస్తారు .అందుకే మనుషులను సంఘజీవులు అంటారు. మనందరికీ ఒకరితో ఒకరం సహకరించుకోవాలి ఒకరిపై ఒకరు ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉండాలి.

జీవించడానికి అవసరమైన ఆహారాన్ని, దుస్తులను, రవాణా సౌకర్యాలు మొదలగు వాటిని సమకూర్చుకుంటారు మరి జంతువులు ఎలా జీవిస్తాయి ఏం చేస్తాయి వాటి జీవన విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

ఏనుగుల జీవన విధానం

అడవుల్లో నివసించే ఏనుగులు గుంపులు లో ఉంటాయి ఒక గుంపులో 10 నుండి 12 వరకు ఏనుగులు ఉంటాయి. వాటి పిల్లలు కూడా ఉంటాయి. వీటిలో ఎక్కువగా చిన్నవిగా ఉంటాయి.

Elephant

15 ఏళ్ల వయసు రాగానే సాధారణంగా పెద్ద ఏనుగులుగా కనిపిస్తాయి. ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది ఇది ఉదయాన్నే పెద్దగా అరుస్తుంది, ఆహారం కోసం బయల్దేరుతుంది. ఏనుగుల గుంపు అంత ఒక ప్రాంతానికి చేరుకుని కావాల్సినంత ఆకులు నీటిని ఆనందంగా తీసుకుంటాయి.

పెద్ద పులుల జీవన విధానం

పెద్ద పులులు బాగా వేటాడే గలవు. పులి పిల్లలకు పుట్టినపుడు వేటడడం ఎలాగో తెలియదు. పులులు గుంపు వేటాడే విధానాన్ని పరిశీలించీ వేటాటడం నేర్చుకుంటాయి. పులుల గుంపుతో వాటి పిల్లలు ఆటడుకుంటు అన్ని విషయాలు నేర్చుకుంటాం వుంటాయి.

భూమిపై అసలు మనిషి అనేవాడు లేని కాలం లో ఏడాదికి ఒక జీవజాతి మాత్రమే నశిస్తుంది ఇది ప్రకృతి సహజం కానీ నేడు మాత్రం ప్రతి 20 నిమిషాలకు జంతువులూ కనుమరుగు అవుతున్నది. పులి మన జాతీయ జంతువు బంగ్లాదేశ్ లో  ఎక్కువగా కనిపించే రాయల్ బెంగాల్ టైగర్ ఒకప్పుడు పులులు వేల సంఖ్యలో ఉండేవి ప్రస్తుతం దేశంలో పులుల సంఖ్య బాగా తగ్గింది.

Royal Bengal Tiger

బట్టమేక పక్షులు కలివికోడి పుంగనూరు ఆవులు పక్షుల సంఖ్య రోజురోజుకు తగ్గుతూ ఉండటం ఆందోళన కలిగించే విషయం వీటి సంరక్షణకు చర్యలు చేపట్టకపోతే అవి అంతరించడం ఖాయం

రాబందు జీవన విధానం

రాబందు రెండు అడుగుల వరకు ఎత్తు కలిగి ఉంటుంది గత కొన్ని సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఈ పక్షిజాతి కనిపించడం లేదు. ఆంగ్లం లో రాబందు ని వల్చర్ అంటారు.

ఒంగోలు గిత్త జీవన విధానం

మన రాష్ట్రానికి చెందిన ఒంగోలు జాతి గిత్తలు ప్రపంచంలోనే మేలుజాతి గా గుర్తింపు పొందాయి. పొట్టి కొమ్ములు అందమైన ముగ్గురం గంగడోలు కలిగి రెండు మీటర్ల వరకు ఎత్తు ఉంటాయి. పొడగరి ఒకసారి అయినా ఈ జాతి గిత్తలు మన వ్యవసాయం  కి వెన్నెముక వంటివి వీటితో రైతన్నలు సేద్యం చేస్తున్నారు మన ప్రాంతానికి వలస వచ్చిన యూరోపియన్ దేశాలకు తరలించారు.

ఈ ప్రపంచంలో అనేక దేశాలలో ఈ జాతి గిత్తలు మేలు సంపదగా వర్ధిల్లుతున్నాయి ముఖ్యంగా బ్రెజిల్ దేశస్తులు వీటిని అభివృద్ధి పరిచి ఉపయోగించుకుంటున్నారు మన ఒంగోలు జాతి ఆవు 40 లీటర్ల వరకు పాలు ఇస్తుంది. మన దేశంలో ఒంగోలు జాతి గిత్తలు తెచ్చుకోవాలంటే సుమారు 5 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. మన రాష్ట్రంలో వీటి సంఖ్య తగ్గిపోతూ ఉండడం ఆందోళన కలిగించే విషయం.

రకరకాల జంతువులు

మన చుట్టూ అనేక రకాల జంతువులు ఉన్నాయి. కొన్ని జంతువులు అడవిలో ఉంటే కొన్ని జంతువులు ఇళ్ళల్లో మనతో పాటు జీవిస్తున్నాయి.

జంతువులు మన కంటే పెద్దవిగా మరికొన్ని చిన్నగా ఉంటాయి. కళ్ళు చెవులు ముక్కు తోక కాళ్లు వంటి అవయవాల నిర్మాణం లో అనేక తేడాలు కనిపిస్తాయి. కొన్ని జంతువులలో వాటి శరీర అవయవాలు నిర్మాణాన్ని బట్టి చెప్పగలుగుతాం.

Deers in forest

శరీర అవయవాల నిర్మాణం బట్టి జంతువులను మనం గుర్తించగలం. వాటి చెవులు, ముక్కు, తోక, తొండం, దంతాలు, పొడవు, పొట్టి, కాళ్ళు, కొమ్ములు ఇలా చాల రకలుగా మనం జంతువులను గుర్తిస్తాం.

కొన్ని జంతువులు చెవులు బయటకు కనిపిస్తాయి. మరి కొన్ని జంతువులు చెవులు బయటకు కనిపించవు.  మనకు చెవులు ఉన్నట్లే అని జంతువులకు కూడా చెవులు ఉంటాయి. కానీ కొన్ని జంతువులకు చెవులున్నా బయటకు కనిపించవు.

చెవులు వినడానికి సహాయపడతాయి అని మీకు తెలుసు కదా. పక్షులు కు చెవులు బయటకు కనిపించవు. పక్షి తలకు ఇరువైపులా రెండు రంధ్రాలు ఉంటాయి. సాధారణంగా ఈ రంధ్రాలు వెంట్రుకలు కప్పబడి ఉంటాయి ఇది వినడానికి సహాయపడతాయి.

మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే బల్లి తలపై రెండు చిన్న రంధ్రాలు కనిపిస్తాయి బల్లికి ఉన్నట్లుగానే ముసలి కూడా తలపై పని చేసే చిన్న రంధ్రాలు ఉంటాయి. కాని వాటిని మనం సులభంగా గుర్తించలేం ముక్కు చెవులు ఉండవు. చెవులు చేసే పనిని చర్మం చేస్తుంది. పాము చర్మం ద్వారానే దేగ్గలో జరిగిన కదలికలను ధ్వనులు గా  గుర్తిస్తుంది.

చర్మం, శరీరంలోని అవయవాలకు నీటి నుండి రక్షణ కల్పిస్తుంది. శరీరం పైన ఉండే రంగు వాటి అమరికను బట్టి జంతువులను సులభంగా గుర్తించగలుగుతారు.

జంతువులు చెవులు చర్మం ఆధారంగా వర్గీకరించడం

అన్ని జంతువుల చెవిలో చర్మం ఒకేలా ఉండవు కొన్ని జంతువుల చెవి పై వెంట్రుకలు ఉంటాయి

ఏ జంతువులకు చెవులు బయటకు కనిపిస్తాయి .వాటి చర్మం పై వెంట్రుకలు ఉంటాయో అలాంటి జంతువులు పిల్లలు కంటాయి.

ఏ జంతువులకు చెవులు బయటకు కనిపించకుండా వాటి చర్మం పై వెంట్రుకలు అలాంటి జంతువులు గుడ్లు పెడతాయి ఎలా జంతువుల చర్మం పై నిర్మాణం ఆధారంగా అవి పిల్లల్ని కంటాయి లేదా గుడ్లు పెడతాయి చెప్పగలం గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని కనే జంతువులను అని అంటారు.

జంతువు జీవన విధానంతో ఉపయోగాలు

జంతువుల యొక్క చర్మం పై వెంట్రుకలు జంతువులు చలి నుండి కాపాడతాయి. జంతువుల చర్మం పై వెంట్రుకలు మనం కూడా ఉపయోగించుకుంటాం. జంతువుల చర్మం కూడా మనకు ఉపయోగపడుతుంది.

జంతువుల చర్మంతో వాయిద్యాలు తయారీకి ఉపయోగిస్తారు. జంతువుల మనకు ఆహార పదార్థాలను కూడా ఇస్తాయి. జంతువులు వ్యవసాయ పనులకు సరుకులు రవాణా చేయడానికి కూడా ఉపయోగపడతాయి.

ఒక చీమ తన బరువు కంటే సుమారు 50 రెట్లు బరువు అయిన పదార్థాన్ని మోయ గలుగుతుంది చీమ తోపాటు కీటకాలు అన్నింటికీ ఆరు కాళ్ళు ఉంటాయి వాటి తల ముందు భాగంలో 2 వీలర్స్ ఉంటాయి ఇవి ఆహారం ఎక్కడ ఉందో కనుక్కోవడానికి ఇతర సమాచారం అందించడానికి ఉపయోగపడతాయి.

రాక్షసబల్లి చాలా సంవత్సరాల క్రితం భూమిపై నివసించేవి  ఇప్పుడు లేవు కేవలం దీన్ని సినిమాల్లో ఫోటోలు మరియు పుస్తకాలలో నమోనా మాత్రమే చూస్తున్నాం.

పక్షులు అంతరించిపోవడానికి కారణాలు

డాక్టర్ సలీం అలీ మన దేశానికి చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త పక్షుల పై అనేక పరిశోధనలు చేసి అనేక రచనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా పక్షుల గురించి. ఈయన చేసిన పరిశోధనలకు గానూ అనేక అంతర్జాతీయ పురస్కారాలు వచ్చాయి.

పక్షులను కాపాడుకోవటం మనందరి బాధ్యత చెట్లు ను నరకడం, పంట పొలాలపై పురుగు మందులు చల్లడం వల్ల చాలా రకాల పక్షులు అంతరించి పోతున్నాయి. ఇటీవల కాలంలో చేసిన పరిశోధనల వలన సెల్ ఫోన్ టవర్ నుండి వచ్చే రేడియేషన్ వల్ల అంతరించిపోయే దశకు చేరుకున్నాయని తెలిసింది పక్షులు అంతరించి పోతే కలిగే నష్టాలు చాలా తీవ్ర పరిణామాలను కలిగిస్తాయి

పక్షుల గూడును నిర్మించడం

చిన్న చిన్నరెమ్మలు  దారాలు గడ్డిపోచలు కొబ్బరి పీచు వంటి వాటిని సేకరించండి వాటి సహాయంతో పక్షులు తన గూడును నిర్మించుకుంటాయి. ఈ గూడు నిర్మించడం పక్షులకు చాల కష్టమయిన పని.ఎంతో నైపుణ్యంతో చాలా సమయం తీసుకొని గూడును నిర్మిస్తారు.

రకరకాల పక్షులు రకరకాల గూళ్లు కట్టుకుంటాయి. పక్షులు మాత్రమే గూళ్ళు కడతాయి అలా కట్టిన వాటిలో తనకు ఇష్టమైన గూటిలో గుడ్లు పెట్టి పొదుగుతుంది. పక్షులు గుడ్లు పెట్టే సమయంలో ఏర్పాటు చేసుకుంటే పిల్లలకు ఆ పక్షులు వదిలేస్తాయి.

వన్యప్రాణి రక్షణ చట్టం 1971 లోని షెడ్యూల్ ఒకటి ప్రకారం పులి ఏనుగు నెమలి మొదలైన అడవి జంతువులను వేటాడటం విక్రయించటం నేరం. ఈ నేరానికి పాల్పడిన వారికి 3 నుండి 7 సంవత్సరాలు జైలు శిక్ష లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు.

Hari Shankar Sharma

View Comments

Recent Posts

బాలల హక్కుల పరిరక్షణ మరియు అభివృద్ధి Protection, and development of children’s rights

బాలల హక్కులు Children's rights నేటి బాలలు, రేపటి భావి భారత పౌరులు. నేటి పిల్లలే రేపటి పెద్దలు. రేపటి…

2 months ago

ప్రపంచంలో అనేక ఖండాలు -భారతదేశం మరియు మహా సముద్రాలూ

ఖండాలు -మహా సముద్రాలూ మరియు భారతదేశం దేశాలు ఉన్న విశాల భూభాగాన్ని మనం మన సౌలభ్యం కోసం సాధ్యమైనంత వరకు…

4 months ago

అంతరిక్ష రంగం మరియు ప్రయోగాలు

అంతరిక్ష రంగం భూమి చుట్టూ ఉన్న ప్రదేశమును అంతరిక్షం లేదా ఖగోళం లేదా రోదశి అని అంటారు. దీని గురించి…

6 months ago

వాతావరణం మరియు గాలి

వాతావరణం అంటే ఏంటి? మన చుట్టూ ఉండే గాలే వాతావరణం. ఈ గాలిలో అనేక వాయువులు, దుమ్ము, దూళి, నీటి ఆవిరి…

7 months ago

అనేక రకాల శక్తి రూపాలు మరియు వాటి ఉపయోగాలు (Many form of Energy and uses)

శక్తి (Energy)     పని చేయగల సామర్థ్యాన్ని శక్తీ అనీ పిలుస్తారు. పని, శక్తి రెండూ ఒకే ప్రమాణం కలిగి…

7 months ago

రక్త ప్రసరణ వ్యవస్థ మరియు రకాలు

రక్తం, గుండె మరియు ప్రసరణ వ్యవస్థ రక్తనాళాలను, హృదయాన్ని కలిపి రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. రక్త ప్రసరణను మొదటిసారిగా…

8 months ago