Categories: Uncategorized

వాతావరణం మరియు గాలి

వాతావరణం అంటే ఏంటి?

మన చుట్టూ ఉండే గాలే వాతావరణం. ఈ గాలిలో అనేక వాయువులు, దుమ్ము, దూళి, నీటి ఆవిరి ఉంటాయి .

Environment

మేఘాలు, గాలి, పీడనం, తడి, పొడి, వాన కురిసే అవకాశం, చలి, యండ మొదలైన అంశాల ఆధారంగా వాతావరణం గురించి మనం చెప్పుకుంటాం.

మన భూమి చుట్టు గాలి ఒక దుప్పటి ఆవరించి ఉంది ఈ పొరనే వాతావరణం అంటాము. మేఘాలు వేడి మీ గాలిలో తేమ ఒత్తిడి మొదలగు విషయాల ద్వారా వాతావరణ స్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు.

వాతావరణం, ప్రతి రోజు ఒకేలా ఉండదు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఒక రోజు వేడిగా, ఒక రోజు చల్లగా ఉంటుంది.

వాతావరణం – పొరలు

వాతావరణాన్ని ఎత్తును బట్టి ఐదు ముఖ్య ఆవరనాలుగా విభజించారు. అవి. 

1. ట్రోపో ఆవరణం

భూమి ఉపరితలం నుంచి దాదాపు 18 కిలో మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్న ఈ ప్రథమ ఆవరణాన్ని “ట్రోపో ఆవరణం “అని అంటారు.

ఈ పొర ఎత్తు భూగోళం అంతట సమానంగా లేకుండా ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నచోట్ల అధికంగా, ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నచోట తక్కువగానూ ఉంటుంది.

అధిక ఉష్ణోగ్రత వద్ద గల భూమధ్యరేఖ వద్ద 18 కి. మి వరకు ఉంటుంది. అల్ప ఉష్ణోగ్రత గల ధ్రువాల వద్ద తక్కువ మందంతో ఉంటుంది.

త్రోపో అవరణంలో దట్టమైన మేఘాలతో కూడిన బలమైన పవనాలు, వర్షపాతం, చక్రవాటాలు, ఉరుములు, మెరుపులు, ఈ  పొర లోనే కనిపిస్తాయి.

వాతావరణంలో జరిగే మార్పులు అన్ని ఈ పొరలోనే జరుగుతాయి. ట్రోపో ఆవరణం పగలు సూర్య తాపము నుంచి రాత్రి భూ ఉపరి తలం పై వెచ్చదనాన్ని నిలిపి, జీవరాశులను కాపాడుతుంది.

2. స్ట్రాటొ ఆవరణం

స్ట్రాటో ఆవరణంలో ధూళి కణాలు, మేఘాలు, నీటి ఆవిరి మొదలగునవి చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. గాలి స్వేచ్చగా, పల్చాగా, నిర్మలంగా, శీతలంగా, పొడిగా ఉంటుంది.

కనుక దీనిని “సమోస మండలం” అంటారు. అక్కడక్కడ సిర్రస్ మేఘాలు వంటివి కనిపిస్తాయి. అధిక సంఖ్యలో వచ్చే సూర్యుని నుండి వచ్చే అతినీలలోహిత కిరణాలను భూ ఉపరితలానికి చేరకుండా ఓజోన్ పొర కాపాడుతుంది.

ఓజోన్ పొర జీవరాశికి చేసే సేవ కారణంగా గుర్తిపుగా ఓజోన్ ఆవరణం అని కూడా అంటారు.

3. ధర్మో ఆవరణం

ట్రోపో ఆవరణం లోని లక్షణాలు ఈ ఆవరణంలో కూడా కనిపిస్తాయి. ఇక్కడ కూడా ఉష్ణోగ్రత ఎత్తు, విలోమం లో ఉంటాయి. స్త్రాటో ఆవరణంలో అధికమొత్తంలో కనిపించే ఓజోన్ వాయువు ఇక్కడ అతి తక్కువ మొత్తంలో కనిపిస్తుంది. ఈ పొరను” భాహ్యా ట్రో పో ఆవరణం “అని అంటారు.

4. ఐనో ఆవరణం

ఐనా ఆవరణంలో ఎత్తుకు పోయే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. అందువల్ల దీనిని”థర్మల్ ఆవరణం” అని అంటారు. ఉష్ణోగ్రత లు అన్యుహ్యాంగా పెరుగుతాయి. ఈ పొరలో కమ్యూనికేట్ రేడియో తరంగాలు భూమి పైకి ఆవర్తనం చెందుతాయి.

5. ఎక్స్ ఆవరణం :

వాతావరణంలో అతి తేలికైన హైడ్రోజన్ ,హీలియం వాయువులు ఈ పొరలో అధికంగా ఉంటాయి.  ధర్మో ఆవరనానికి పైన  వ్యాపించి ఉన్న మొత్తం ఎక్స్ ఆవరణమే.

ఈ పొరలో ఉష్ణోగ్రత లు అధికంగా ఉన్నప్పటికీ వాటిని మానవ శరీరం గుర్తించ లేదు. అంతరిక్ష యాత్రికులు ఈ పొరలో స్పేస్ వాక్ చేస్తారు.

వాతావరణం వాటి అవరణాలు 

 భూమి చుట్టూ ఉండే గాలినే “వాతావరణం” అంటారు. భూమి చుట్టూ ఆవరించి ఉన్న గాలి పొరనే” వాతావరణం” అని కూడా అంటారు.

భూ వాతావరణాన్ని ఉష్ణోగ్రతలలో మార్పుల ఆధారంగా 5 పొరలుగా విభజించారు. వీటిలో ముఖ్యంగా మూడు రకాల భౌగోళిక ఆవి అరణములు కలవు. అవి.

  1. శిలావరణం
  2. జలావరణం
  3. వాతావరణం

శిలావరణం

భూమి యొక్క రాతి పొరను శిలావరణం లేదా ఆశ్మావరణం అంటారు. శిలావరణంలో పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, కొండలు కలవు.

జలావరణం

మంద గమనంతో నిర్మలమైన జల సముదాయవరణ మును  “జలా వరణం” అంటారు.       

ఉదాహరణ : మహా సముద్రాలు, సముద్రాలు.

వాతావరణం అధ్యనశాస్త్రం మరియు కొలిచే పరికరం

భూ ఉపరితలంపై ఆవరించి ఉన్న వివిధ వాయువులు, నీటి ఆవిరి, దుమ్ము ,ధూళి కణాల తో కూడిన సన్నని పొర నే వాతావరణం గా పిలుస్తాం.

భూమిని ఆవరించి ఉన్న దట్టమైన గాలి పొరను కూడా వాతావరణం అనవచ్చు. వాతావరణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని “మెటియోరాలజీ” అంటారు.

వాతావరణానికి గల బరువు ఒత్తిడిని కలుగజేస్తుంది దీనినే వాతావరణ పీడనం అంటారు. ఈ వాతావరణ పీడనం సముద్ర మట్టం దగ్గర 1013.25 మిల్లిబార్స్ లేదా 760 మి.మి లేదా 76 సేమ్.మి గానూ ఉంటుంది.

దీని పీడనాన్ని భారమితి అనే పరికరంతో కొలుస్తారు. వాతావరణ పీడనం ఎత్తుకు వెళ్లే కొద్ది తగ్గుతుంది. ఇది ప్రతి 10 మి.కు 1మి. బార్ చొప్పున తగ్గుతుంది. అందువల్ల వాతావరణ పీడనం కొండల పైన, పర్వతాల పైన తక్కువగా ఉంటుంది.

వాతావరణంలో మార్పులు

వాతావరణం రోజంతా ఒకేలా ఉండదు. మారుతూ ఉంటుంది. కొన్ని సార్లు ఆకాశం మబ్బులతో, గాలిలొ తేమతో ఉంటుంది.

చల్ల గాలి వీస్తుంది. మరి కొన్ని సార్లు వేడి గాలి వీస్తుంది, పొడిగా ఉంటుంది. వర్షం అక్కడక్కడా కురుస్తుంది.

వాతావరణం సౌర శక్తి ద్వారా నే వేడెక్కుతుంది. కానీ భూమి పైన అన్నీ భాగాలలో ఒకేలా ఉండవు. ఒకే సౌర శక్తి పరిమాణం ప్రదేశాన్ని బట్టి మారుతుంది.

ధ్రువాల దగ్గరా కన్న భూ మధ్యరేఖ వద్ద గల ప్రాంతాలకు సౌర శక్తి ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత లో మార్పులు, వాతావరణం ఏర్పడడానికి కారణమవుతాయి.

గాలి అంటే ఏంటి?

మన చుట్టూ గాలి ఉంది మన ఇళ్ళలో ఖాళీ స్థలాల్లో పంట పొలాల్లో అంతటా గాలి ఉంది. కానీ గాలి మనకు కనబడదు గాలి ఎన్నో అద్భుతాలు చేస్తుంది వర్షాన్ని ఇస్తుంది చలి నీ తెస్తుంది.

వేడి గాలి విస్తుంది భూమి ఆకర్షణ శక్తి భూభ్రమణం పరిభ్రమణ వలన గాలి నిరంతరం కదులుతూ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి విస్తూ ఉంటుంది.

భూమి పైన గాలి పరిమాణం ఒక ప్రదేశంలో కొన్ని చోట్ల ఎక్కువగానూ, మరి కొన్ని చోట్ల తక్కువగా ఉంటుంది. గాలికి ఒత్తిడి, బరువు, ఖాళీ స్థలాన్ని ఆక్రమించుకోవడం మొదలైన ధర్మాలు ఉంటాయి.

వాయు పీడనం

మన చుట్టూ ఉన్న గాలిలో వాయు పరమాణువులు ఒకదానిపై ఒకటి ఒత్తిడి కలుగచేస్తాయి. ఏ వస్తువు పైన చూపే ఒత్తిడి ప్రభావం నీ వాయు పీడనం అంటారు. గాలి పై నుండి మాత్రమే కాకుండా అన్ని వైపుల నుండి పీడనాన్ని కలుగ చేస్తుంది.

పరమాణువులు ఎక్కువగా ఉంటే వాయు పీడనం పెరుగుతుంది భూమ్యాకర్షణ శక్తి వల్ల భూ ఉపరితలం దగ్గర వాయుపీడనం ఎక్కువ ఉష్ణోగ్రత పెరిగితే పీడనం తగ్గుతుంది ఉష్ణోగ్రత తగ్గినప్పుడు పీడనం పెరుగుతుంది ఉష్ణోగ్రత వాతావరణం పీడనాల మధ్య విలోమ సంబంధం ఉంటుంది.

నీటి ఆవిరి గాలి కంటె తేలికా కావున నీటి అవిరి పెరిగే కొద్దీ పీడనం తగ్గును. ఎత్తు పీడనం ఒక దాని కొకటి విలోమానుపాతంలో  వుంటాయి. వేడెక్కి పైకి వెళ్ళిన గాలి చల్లబడి చిక్కనవుతుంది.

ఇలా చిక్కబదిన  గాలి భూమి ఆకర్షణ శక్తి వల్ల ఉపరితలం దగ్గరకు లాగబడుతుంది. చల్లటి గాలి కిందకి  దిగిన చోట  వాయు పీడనం పెరుగుతుంది.

గాలి అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతం వైపు వస్తుంది. భూమికి సమాంతరంగా కదిలే గాలినీ పవనం అని, నిటారుగా కదిలే గాలిని వాయు ప్రవాహం అని అంటారు.

పవన విద్యుత్తు

గాలికి, శక్తి ఉంది. గాలికి శక్తి ఉండటం వలన మన రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో గాలి మరాలను ఉపయోగించి విద్యుత్ ను తయారు చేస్తున్నారు.

ఈ రకమైన విద్యుత్ ను “పవన విద్యుత్ “అంటారు. కొండ ప్రాంతాలలోనూ, సముద్ర తీరాలలో ఎత్తైన స్థానాలను గాలికి ఎదురుగా ఏర్పాటు చేయటం వలన గాలి వేగానికి మర తిరిగి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.

Wind Energy

గాలి అనేది అన్నీ ప్రదేశాలలో అనగా ఖాళీ ప్రదేశాలలో, సముద్ర తీరాలలో, కొండ ప్రాంతాలలోనూ ఎక్కువగానూ, కొన్ని లోతట్టు ప్రాంతాలలో తక్కువగాను వేస్తుంది. గాలి ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది.

భూ ఆకర్షణ శక్తి ,భూ భ్రమణము, భూ పరిభ్రమణము వలన గాలి నిరంతరం కదులుతూ ఉంటుంది. ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వీస్తూనే ఉంటుంది.

భూమి పైన గాలి పరిమాణం కొన్ని చోట్ల ఎక్కువగా నూ, మరీ కొన్ని చోట్ల తకువగాను ఉంటుంది. గాలికి ఒత్తిడి బరువు ఖాళీ స్థలాలను ఆక్రమించు కోవటం మొదలగు ధర్మాలు ఉన్నాయి.

కాలాలు

 భూమి ,సూర్యుని చుట్టూ పరిభ్రమించేడం వల్ల, భూమి అక్షం ఒంగి ఉండటం వల్ల కాలాలు,  రుతువులు ఏర్పడుతాయ. వాతావరణాన్ని బట్టి సంవత్సరాన్ని మూడు రకాలుగా విభజించారు. అవి .           

  1. శీతాకాలం
  2. ఎండాకాలం
  3. వర్షాకాలం

శీతాకాలం

చలి కాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. కొబ్బరి నూనె గడ్డ కట్టడం, సూర్యోదయం ఆలస్యంగా, సూర్యాస్తమయం త్వరగా నూ జరుగుతుంది. శీతాకాలంలో అందరూ రంగురంగుల స్వెటర్లు, శాలువాలు, దుప్పట్లు కప్పుకుంటారు.

సూర్యాస్తమయం కాగానే అందరూ ఇళ్లకు చేరుకుంటారు. మొక్కల పై సీతాకోక చిలుకలు తిరుగుతూ ఉంటాయి. చలికాలం తర్వాత కోయిల కూయటం మొదలు పెడుతుంది.

Winter Season

మామిడి చెట్లు పూత పూస్తాయి. పూలు వికిచిస్తాయి. ప్రకృతి అందంగా ఉంటుంది. 

నవంబర్ మధ్య నుండి ఫిబ్రవరి మధ్య వరకు శీతాకాలం అనేది ఉంటుంది. సాధారణంగా అత్యంత చలిగా ఉండే మాసం జనవరి.

ఉత్తర భారత దేశంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉంటాయి, దక్షిణ భారతదేశంలో ప్రత్యేకించి కోస్తా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఆహ్లాదకరంగా ఉంటాయి.

ఈ కాలంలో ఆకాశం నిర్మలంగా ఉండి గాలిలో తేమ శాతం తక్కువ చల్లటి గాలులతో వాతావరణం ఉంటుంది ఈ వర్షం రబీ కాలంలో పండే గోధుమ కు అనుకూలం.

వర్షాకాలం

వర్షాకాలం అనగానే దట్టమైన మేఘాలు, వానలు, ఉరుములు, మెరుపులు, వరదలు, కాగితం పడవలు, గొడుగులు, వానపాములు ఇలా ఎన్నో గుర్తుకు వస్తాయి. వానాకాలంలో ఆకాశం మేఘావృతమై అవుతుంది.

మేఘాలు గర్జిస్తాయి, మెరుపులు మెరుస్తాయి, వర్షాలు కురుస్తాయి. చెరువులు ,బావులు, నదులు నీటితో నిండిపోతాయి .నెమలి నాట్యం చేస్తాయి.

కప్పలు బెకబెక  అని అరుస్తాయి. పచ్చగడ్డి పెరుగుతుంది  వర్షం లో ఆడడం, కాగితం పడవలు, నీటిలో వదలడం పిల్లలకు ఆనందాన్నిస్తుంది.

జూలై , ఆగస్టు మాసాలలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. సెప్టెంబర్ మాసానికి వర్షాలు తగ్గి క్రమంగా చలికాలం ప్రారంభమవుతుంది. వర్షం బాగా కురుస్తుంది పంటలు బాగా పండుతాయి. అందరూ ఆనందంగా ఉంటారు.

ఎండా కాలం

 ఎండా కాలం లేదా వేసవి కాలం లో వేడి గాలులు వీస్తాయి. క్రమక్రమంగా ఎండ తీవ్రం అవుతుంది. వేడి గాలులు వీస్తాయి. తీవ్రమైన ఎండ, వేడి గాలి ద్వారా పరిసరాలు వేడెక్కుతాయి.

ఏప్రిల్, మే, జూన్ మాసాలలో అధిక వేడి ఉంటుంది. మామిడి పండ్లు, ముంజులు ఎక్కువగా దొరుకుతాయి. బయటి వెళ్లాలంటే భయం వేస్తుంది.

వడదెబ్బ తగలకుండా ఉండాలంటే పాలు, గుడ్లు, వంటి పోషక ఆహారం తినాలి. ఎప్పుడు కూడా చల్లటి నీటిలో ఈత కొట్టలనిపిస్తూ ఉంటుంది. అయినా పిల్లలకి ఎండాకాలం అంటేనే చాలా ఇష్టం

సన్నాయి, పిల్లన గ్రోని వంటి వాటిలోకి నోటి ద్వారా గాలిని ఊడడం వలన శబ్దం వస్తుంది. నోటి ద్వారా గాలి నీ ఎక్కువగా తక్కువగా సంగీత పరికరాల లోకి ఊదడం తో శబ్దం లో మార్పులు వస్తాయి కొబ్బరి చిప్ప, గ్లాసులో గాలి ఉంది. అందుకే చెరువులో ఈత కొట్టినప్పుడు శబ్దం వస్తుంది. గాలి శబ్దం చేస్తుంది. స్థలాన్ని ఆక్రమిస్తాయి.

మొక్కలు, జంతవులు బతకడానికి గాలిలోని ఆక్సిజన్ అవసరం

అన్ని జంతువులు, మొక్కలు బ్రతకడానికి గాలి అవసరం. గాలి లేకపోతే మొక్కలు జంతువులు చనిపోతాయి. గాలిలో ఉన్న ఆక్సిజన్ జీవులు బ్రతకడానికి సహాయపడుతుంది.

అలాగే మొక్కలు ఆహారం తయారు చేసుకోవడానికి గాలిలోని కార్బన్ డయాక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ను వదులుతాయి.

జంతువులు శ్వాసక్రియలో గాలిలోని ఆక్సిజన్ ను తీసుకొని కార్బన్ డయాక్సైడ్ను వదులుతాయి,  కానీ చెట్లు ఎక్కువగా ఉన్న చోట గాలి  తాజాగా ఉంటుంది.

ఆక్సిజన్ నీటిలో కరుగుతుంది నీటిలో నివసించే జంతువులు నీటిలో కరిగిన ఆక్సిజన్ తీసుకుంటాయి. పక్షులు, జంతువులు మనుషులు జీవించడానికి గాలి  జీవనాధారం.

వాతావరణం కాలుష్యం లో గాలి కాలుష్యం ముఖ్యమైనది

 మనం ఇంట్లో ఊడ్చి నప్పుడు, రోడ్లు ఊడ్చి నప్పుడు, వాహనాలు వెళ్ళినప్పుడు వచ్చే దుమ్ము, ధూళి, పొగ వంటివి గాల్లోకి చేరుతాయి. కర్మాగారాలు, ఇంట్లో వంట చేయడం ద్వారా వచ్చే పొగ, చెత్తను కాల్చడం వల్ల విషపూరిత వాయువులు గాలిలోకి చేరతాయి. వీటి వల్ల గాలి కాలుష్యం అవుతుంది.

కలుషితమైన గాలి పీల్చడం వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది. కొంత మంది సిగరెట్, బీడీ పిలుస్తుంటారు వీళ్ళు వదిలే పొగ పీల్చడం వల్ల అనారోగ్యానికి, వ్యాధులకు గురవుతారు.

Air Pollution

పొగ తాగని వారితో పాటు గాలి పీల్చిన వారికి కూడాఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులకు గురవుతున్నారు.

అందువల్ల గాలి కాలుష్యం కాకుండా చూసుకునే బాధ్యత మనది. అందుకోసం చెట్లను పెంచాలి   కాలుష్య కారక కర్మాగారాలను అదుపులో పెట్టాలి.

aravellisharma32

Recent Posts

బాలల హక్కుల పరిరక్షణ మరియు అభివృద్ధి Protection, and development of children’s rights

బాలల హక్కులు Children's rights నేటి బాలలు, రేపటి భావి భారత పౌరులు. నేటి పిల్లలే రేపటి పెద్దలు. రేపటి…

2 months ago

ప్రపంచంలో అనేక ఖండాలు -భారతదేశం మరియు మహా సముద్రాలూ

ఖండాలు -మహా సముద్రాలూ మరియు భారతదేశం దేశాలు ఉన్న విశాల భూభాగాన్ని మనం మన సౌలభ్యం కోసం సాధ్యమైనంత వరకు…

4 months ago

అంతరిక్ష రంగం మరియు ప్రయోగాలు

అంతరిక్ష రంగం భూమి చుట్టూ ఉన్న ప్రదేశమును అంతరిక్షం లేదా ఖగోళం లేదా రోదశి అని అంటారు. దీని గురించి…

6 months ago

అనేక రకాల శక్తి రూపాలు మరియు వాటి ఉపయోగాలు (Many form of Energy and uses)

శక్తి (Energy)     పని చేయగల సామర్థ్యాన్ని శక్తీ అనీ పిలుస్తారు. పని, శక్తి రెండూ ఒకే ప్రమాణం కలిగి…

7 months ago

రక్త ప్రసరణ వ్యవస్థ మరియు రకాలు

రక్తం, గుండె మరియు ప్రసరణ వ్యవస్థ రక్తనాళాలను, హృదయాన్ని కలిపి రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. రక్త ప్రసరణను మొదటిసారిగా…

8 months ago

వర్షం లేదా వాన వల్ల లాభాలు మరియు రకాలు Benefits and types of rain or rain

వాన నీరు భూమిని చేరడం Rainwater accumulation on land వాన లేదా వర్షం ఆకాశంలో మేఘాలు నుండి భూతలం…

8 months ago