X

ఆటలు లేక క్రీడలు వలన పిల్లల ఆరోగ్యం పై ప్రభావం

Advertisements

ఆటలు లేక క్రీడలు వలన పిల్లల ఆరోగ్యం పై ప్రభావం

ప్రతి మనిషి బాల్యం అటల తోనే ప్రారంభం అవుతాయి. ఆటలు ఆడడం వలన మనిషి ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండగలదు. క్రీడల అవశ్యకతను అన్ని దేశాలు గుర్తించాయి. అందువలన అన్ని ప్రభుత్వ దేశాలు మంత్రి మండలిలో క్రీడలపై ఒక శాఖ నీ కేటాయిన్చరు  ప్రోత్సహించడం జరుగుతుంది. వాటి ద్వారా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఆటలు అడటం జరుగుతుంది. ఆటలు ఆడే ప్రదేశాన్ని బట్టి ఆటలను రెండు రకాలుగా విభజించారు.
ఫుట్ బాల్ ఆట

  • బయట అవరణంలో అడే ఆటలు

వీటినే అవుట్ డోర్ గేమ్స్ అని కూడా అంటారు. ఉదాహణకు ఫుట్ బాల్, హాకీ , సాప్ట్ బాల్, క్రికెట్, కబడ్డీ వంటివి

  • లోపల అవరణంలో ఆడే ఆటలు

వీటిని ఇండోర్ గేమ్స్ అని అంటారు. పై కప్పు కలిగిన స్టేడియంలో కలిగిన ఆటలను ఇండోర్ గేమ్స్ అంటారు. వీటిని కొన్ని బైట కూడా ఆడతారు. ఉదాహరణకు టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, వాలి బాల్

టేబుల్ టెన్నిస్

దీనిని పింగ్ పాంగ్ గానే అని కూడా అంటారు. క్రీస్తు శకం 1880 లో ఇంగ్లాండ్ లో. ఈ క్రీడ మొదలు అయింది. ఈ క్రీడను ఇద్దరు లేదా నలుగురు ఆడతారు. ఇద్దరు ఆడితే సింగిల్ నలుగురు ఆడితే డబుల్ గేమ్ అని.కూడా అంటారు.ఈ గేమ్ నీ మధ్యాహ్న భోజన విరామ ఆడడం వలన ఈ ఆటలకు ప్రాధాన్యత పెరిగింది . దీనిని 1988లో ఒలింపిక్స్ లో 2002లో కామన్వెల్త్ లో ప్రారంభించారు. దీని యొక్క బోర్డ్ 9 అడుగుల 5అంగుళాలు వుండి  దీని యొక్క బోర్డ్ 30 అంగుళాలు అట్టు లో వుండి దీని యొక్క బోర్డ్ కు అడ్డంగా అరు అంగుళాల ఎత్తు లో ఒక బోర్డ్ నెట్ వుంటుంది. ఆటగాళ్ళు అబోర్డ్ కి ఇరువైపులా నిలబడి ఆడతారు. బ్యాట్ రాకెట్ కొద్దిగా అండాకరం లో వుంటుంది. బ్యాట్ చెక్క తో చేయబడి రెండు పక్కల రబ్బరు షీల్డ్ కలిగి వుంటుంది. రాకెట్ బ్లేడ్ వెడల్పు 6.0 అంగుళాల పొడవు 6.5 అంగుళాలు ఉంటుంది. బంతి తేలికగా దొల్లగ వుంటుంది. ఈ బంతి 38నుండి 40 మిల్లీ మీటర్ల వ్యాసం తో వుంటుంది. దీన్ని ప్లాస్టిక్ తో తయారు చేస్తారు. ఈ ఆటను 11 పాయింట్స్ కోసం ఆడతారు, ముందుగా. 11 పాయింట్స్ ఎవరు సాధిస్తారు వారు గెలిచినట్లు.

బ్యాడ్మింటన

బ్యాడ్మింటన్ ముందుగా ఇంగ్లాండ్ లో చిన్న పిల్లలు ఆడే ఆటగా మొదలుయినది . ఆ తర్వాత భారత దేశంలో బ్రిటిష్ వారి కాలంలో బ్రిటిష్ వారు భారతదేశములో ఆడడం ప్రాంభించారు. మొదట్లో ఆటను పునా అని పిలిచేవారు. 1938లో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఏర్పడింది. ఈ ఫెడరేషన్ లో మొత్తం 130 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి.ఒలింపిక్స్ లో ఈ ఆటను 1992 లో స్థానం కల్పించారు. బ్యాడ్మింటన్ కాక్ ను బాతు ఈకలతో చెక్క కర్క్ తో చేస్తారు. కాక్ లో 16 ఈకలు వుంటాయి. బ్యాట్ లేదా రాకెట్ ను హికరి కర్బెన్ మిశ్రమంతో లేదా ఒక్కు తో తయారు చేస్తారు. సింగిల్ అట కోసం కోర్టు 17*14 సైజ్ లో వుంటుంది. డబుల్స్ అట కోసం 20*44సైజ్ లో వుంటుంది.కోర్టు చుట్టూ 5అడుగుల ఖాళీ స్థలం వుండాలి. కోర్టు ను కాంక్రీట్ లేదా బిర్క్మిమినుస్ తారుతో తయారు చేస్తారు. కోర్టు ను రెండు సమాన భాగాలుగా చేసి దాని మద్యలో ఒక నెట్ ను కడతారు. నెట్ ఎత్తు చివరల వద్ద 5 అడుగుల 1 అంగులం కోర్టు మద్యలో 5 అంగుళాలు వుంటుంది.

వాలీబాల్

వాలీబాల్ అట మొట్ట మొదటగా 1895లో అమెరికాలో మొదలుయినది . ఆటలో 2 టీమ్ లో వుంటాయి. ప్రతి టీమ్ లో 6 ఆటగాళ్ళు వుంటారు. 1964 నుండి ఒలింపిక్స్ ఆటల్లో ఆడడం మొదలుయినది. దీని కోర్టు పొడవు 18 మీటర్లు 9 మీటర్ల వెడల్పు వుంటుంది. కోర్టు ను రెండు సమభాగాలుగా విభజించారు మద్యలో ఒక నెట్ ను కడతారు.నెట్ యొక్క పై అంచు నుండి కింద వరుకు 243 మీటర్ల ఎత్తులో వుంటుంది. మహిళల క్రీడ ఐనచో 224 మీటర్ల ఎత్తు లో వుంటుంది. బంతి గోలాకారంలో వుంటుంది. దీనిని సింతటిక్ లేదా చర్మంతో తయారు చేస్తారు.

బాస్కెట్ బాల్

ఈ ఆటను మొట్ట మొదటగా అమెరికాలో 1891లో స్పెంపే ఫీల్డ్ లో అడారు. 1936 ఒలింపిక్స్ లో చేర్చారు. ఒక్క జట్టులో 13 నుండి 15 ఆటగాళ్ళు వుండాలి . కానీ కోర్టులో అట అదేటపుడు 5 గురు మాత్రమే ఆడతారు. మిగిలిన వాళ్ళు అదనపు ఆటగాళ్ళుగా వుంటారు. కోర్టు 28 మీటర్ల పొడవు 15 మీటర్ల పొడవు వుంటుంది.

క్యారమ్ బోర్డ్

క్యారమ్ బోర్డ్ లో పరికరాలు క్యారమ్ బోర్డ్ , క్యారమ్ మెన్ స్ట్రైకర్ , ఇది నలుచదరం గా వుండి ప్లే వుడ్ బోర్డుతో తయారు చేస్తారు. ఇది చెక్క ఫ్రేమ్ తో చేయబడి వుంటుంది. బోర్డ్ సైజ్ 74*74 వుంటాయి. చెక్క ఫ్రేమ్ 1.25 అంగుళాల మందం వుంటుంది. దీనిలో గల కోయిన్స్ గుండ్రంగా ఉంటాయి. చెక్క చివర్లో గల నాలుగు గుంతల్లో వుంటాయి.

కొన్ని ఔట్ డోర్ ఆటలు

హాకీ

ఇది మన జాతీయ క్రీడ. హాకీ ప్రపంచ కప్ ను ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. పోటీ నిర్వహణ 1991 నుండి విడుదల అయ్యాయి. ఈ ప్రపంచ కప్ ను భారత 1 సారి పాకిస్తాన్ 4 సార్లు నెదర్లాండ్ 3 సార్లు గెలిచింది. 2010 లో జరిగిన ప్రపంచ కప్ లో భారత్ ప్రపంచ వేదికగా నిలిచింది.

కబడ్డీ

ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడ. ఈ క్రీడను జట్టుకు ఆడేవారు. 7 గురు సభ్యులు. బుట వుండేవారు 5 గురు సభ్యులు భారత దేశం ఇప్పటి వరకు 7 సార్లు ప్రపంచ కప్ గెలిచింది. ఇరాన్ ఒకసారి గెలిచింది. ఈ ఆటలో ప్రత్యర్థి జట్టు నుండి కుతకి వచ్చిన ఆటగాడి నీ పట్టుకోవడం వలన ఒక పాయింట్ వస్తుంది. ఆ ఆటగాడికి ఆ జట్టులో ఎవరినైనా ఔట్ చేసిన వారికి పాయింట్ వస్తుంది. దీనిలో గల చివర నుండి రెండవ లైన్ ముట్టుకుంటే బోనస్ పాయింట్ లభిస్తుంది .

క్రికెట్

ఈ అట బంతి బ్యాట్ తో అదే అట. దీనిని పిల్లల నుండి పెద్దల వరుకు అందరూ ఈ ఆటను ఆడతారు. ఇది ప్రపంచ దేశాలు అదే అట క్రికెట్. ప్రపంచ దేశాల సైతం ఈ ఆటను ఆడుతున్నారు. ఈ క్రికెట్ జట్టు లో 11 మంది ఆటగాళ్లు వుంటారు. అతగాడు యొక్క నైపుణ్యం బట్టి ఆటగాడు బ్యాట్స్మెన్ లేదా బౌలర్ అని వర్గీకరిస్తారు. ఈ జట్టును కెప్టెన్ నడిపిస్తాడు. మైదానం లో ఈ అట ఆడే క్రికెట్ ఆట అంపైర్ చేత నియంత్రించ బడుతుంది. మైదానం వెలుపల పరుగు లెక్క పెట్టడానికు ఇద్దరు స్కోర్లు వుంటారు.
పిల్లలకి ఆటలు చాలా లాభాలున్నాయి. ఈ ప్రశ్నకి సమాధానం అవును అనే వస్తుంది. క్రీడలో పిల్లలు కి ప్రధాన పాత్ర పోషస్తాయి. క్రీడల వల్ల ఎన్నో లాభాలున్నాయి. నిజానికి పిల్లాలకి ప్లే గ్రౌండ్ అలవాటు చేయడం చాలా మంచిది. ఆరోగ్యకరంగా పిల్లలు ఎదగాలని అనుకుంటే మీరు కచ్చితంగా పిల్లకి ఆటలను అలవాటు చేయండి. పిల్లలు మానసికంగా, ఆరోగ్యంగా వుండాలి అంటే ఆటలను అలవాటు చేసుకోవాలి.

పిల్లలకి మానసిక ఎదుగదల

తాజా సర్వే లో తేలింది ఎంటి అంటే పిల్లలో ఆటలను అదే వారిలో చాలా చురుగ్గా వుంటున్నారు. చాలా చురుగ్గా మెదడు పని చేస్తుంది. వివిధ అంశాలపై పిల్లలు అన్ని విషయాలపై ఫోకస్ చేయగలుగుతున్నారు. ఆటల్లో పాల్గొనడం వీరికి లాభాన్ని తెచ్చి పెడుతుంది. పిల్లలు చురుగ్గా వుండడం వల్ల ఇవన్నీ సాధ్యం అవుతుంది.కాబట్టి పిల్లల కి ఆటలను అలవాటు చేయండి.

జట్టు బృందం

ఆటల్లో పాల్గొనే పిల్లలకి జట్టు లో వర్క్ నీ చేసే సామర్థ్యాలు ఎక్కువ అయినట్టు కనిపిస్తుంది. అంత విజయం సాధించడానికి కావలసిన అన్ని రకాల మెళుకువలు ఈ ఆటల వలన పిల్లలో కనిపిస్తున్నాయి. ఇది చాలా ముఖ్యమైన నైపణ్యాభివృద్ధి నీ సాధిస్తుంది.

మెదడు చురుగ్గా పని చేస్తుంది

తలలో వుండే మెదడు ఫిజికల్ యాక్టివిటీ వల్ల చురుగ్గా వుంటుంది. చురుగ్గా వుండే ఆరోగ్యవంతంగా వుండే మెదడువల్ల పిల్లలు చక్కగా నేర్చుకుని త్వరగా ఎదుగుతారు. ఆలోచనలు వుంచుకేనే శక్తిని కలిగి వుంటుంది.

గుడ్ పోస్టర్

క్రీడల్లో చురుగ్గా పాల్గొనడం వల్ల శరీర భాష కూడా మెరుగు పడుతుంది. పిల్లల శరీరంలో కండరాల సరైన దిశలో ఎదుగుతాయి. తద్వారా శరీర భంగిమలో పిల్లలు ఎదుగుతాయి.
ఆరోగ్యకరమైన గుండెకు ఆరోగ్యకర మైన శ్వాస. కార్డియో వర్క్ ఔట్ గా స్పోర్ట్స్ ను పేర్కొనవచ్చు. మి పిల్లల లంగ్స్ పటిష్టంగా పని చేస్తాయి. రక్త ప్రసరణ ఇంప్రూవ్ మెంట్ జరుగుతుంది.పిల్లలకు ఆటల యొక్క ప్రాధాన్యత వివరించండి. ఆరోగ్య కరమైన జీవనం గురించి వివరించండి. అప్పుడే ఆసక్తి కలుగుతుంది.

రోగ నిరోధక శక్తి

మి పిల్లల ఆటలు ఆడడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రకృతి లో సహజ సిద్ధమైన గాలిని పీల్చడం వలన కూడా పిల్లలు ఆరోగ్యకరం గా వుంటారు. నిజానికు మి పిల్లల ఆరోగ్యకరమైన గాలికి , వాతావరణానికి అలవాటు పడడం ద్వారా మంచి ఆరగ్యకరమైన జీవనం ఏర్పడుతుంది. అందు వల్ల శరీరం నుండి బ్యాక్టీరియా తో పోరాడే శక్తి పెరుగుతుంది.

కాంపిటీటివ్ స్పిరిట్ తెలుగులో పోటీతత్త్వం

దీని గురించి తెలుసుకునే ముందు పిల్లలకి ఆటల గురించి తెలియాలి. పోటీతత్వం గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. ఈ విషయము ఆటలు ద్వారా వారికి అర్థం అవుతుంది.

స్పోర్ట్స్ వైకరీ

గెలుపు ఓటములు జీవితం లో భాగం అన్న మాట పిల్లలు ఈ ఆటల ద్వారా అర్ధం చేసుకుంటారు. ఒకవేళ ఓడిన నష్టం ఏది కాదని పిల్లలు ఆటల ద్వారా తెలుసుకుంటారు. గెలుపు కోసం పడే శ్రమని గుర్తిస్తారు. పిల్లలు ఆటలో గెలుపు ఓటమిని సమానంగా తీసుకుంటారు.

ఓర్పు

పిల్లలు ఆటల్లో భౌతిక ఓర్పును కలిగి వుంటుంది. ప్రతి అతను చివరి వరుకు ఆడడం వలన పిల్లలో ఓర్పు పెరుగుతుంది. మి పిల్లల్ని ఆటలు ఆడే గ్రౌండ్ కి తీసుకుని వెళ్ళండి వారు ఆటలను నేర్చుకుని సంతోషంగా నేర్చుకుంటారు. అందులో వుండే ఆనందాన్ని వెతుకునతరు.

స్టామినా పవర్

అట అనేది ప్రతి ఆటగాడి సామర్థనికి సవాల్ విసురుతోంది. పిల్లలో ఆటలను ఆడడం వలన పాల్గొనడం ప్రోత్సహించడం ద్వారా వారి స్టామినా నీ ప్రోత్సహించడం ద్వారా పెరుగుతుంది. ఫిజికల్ యాక్టివిటీకి ఆటలు చాలా అవసరం.

గెలుపు విలువ తెలుస్తుంది

మి పిల్లలు ఆటలను గెలిచినప్పుడు గెలుపు విలువ తెలుస్తుంది .గెలుపొందడం అంత సులువు కాదని తెలుస్తుంది. ఆటల ద్వారా పిల్లలు ఎంతో విలువైన అంశాలు గ్రహిస్తారు. జీవితం లో గెలుపొందారు అని పిల్లకి ఆటలు అంతగానే ఉపయోగపడతాయి. కాబట్టి పిల్లలు ఆటలు ఆడడం శారీరికంగా ఆరోగ్యం మెరుగు పరచడానికి చాలా ఉపయోగ పడుతుంది.
Categories: Uncategorized
Hari Shankar Sharma:
X

Headline

Privacy Settings