ఖండాలు -మహా సముద్రాలూ మరియు భారతదేశం
దేశాలు ఉన్న విశాల భూభాగాన్ని మనం మన సౌలభ్యం కోసం సాధ్యమైనంత వరకు ఖండాలు గా, మహా సముద్రాలు గా విబజించుకున్నం. విశాల భూభాగాన్ని 7 ఖండాలు గా విస్తరించారు.
1. ఆసియ, 2. ఐరోపా, 3. ఉత్తర అమెరికా, 4. దక్షిణ అమెరికా, 5. ఆఫ్రికా, 6. ఆస్ట్రేలియా, 7.అంటార్కిటికా
ఆసియా ఖండం వాటి విశేషాలు
ఖండాల అన్నింటిలోనూ అతి పెద్దది. ప్రపంచంలో అతి ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ ఆసియా ఖండంలో కలదు. మొత్తం ప్రపంచ వైశాల్యంలో 30 శాతం బాగాన్ని ఒక్క ఆసియా ఖండము విస్తరించి ఉంది.
అరేబియా ద్వీపకల్పం, ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ద్వీపకల్పం. ఈ ఖండంలోనే కలదు. ప్రపంచంలో అత్యధిక దీవుల సమూహం తో ఏర్పడిన దేశం ఇండోనేషియా, ఆసియా ఖండంలోనే ఉంది.
దక్షిణ చైనా సముద్రం, ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సముద్రం. ప్రపంచంలో కెల్లా ఎత్తయిన పీఠభూమి టిబెట్ పీఠభూమి. ప్రపంచంలో అతిపెద్ద దేవాలయం అంగ్ కర్ వాట్ ఖండంలోనే కలదు. ప్రపంచంలో కెల్లా ఎత్తైన పట్టణం వేన్చు వాన్.
ప్రపంచంలో ఎత్తైన రైల్వే లైన్ చైనా టిబెట్ ల మధ్య కలదు. పర్వతాలకు పుట్టినిల్లు అని ఆసియా ఖండం అని పిలుస్తారు ప్రపంచంలో నీటి రిజర్వాయర్ గానీ సహజ సరస్సు గానీ లేని ఏకైక దేశం కువైట్. ఈ దేశంలోనే కలదు.
అతి పెద్ద శీతల ఎడారి ఆసియాలో పెద్ద ఎడారి అయిన గోబీ ఎడారి ఆసియా ఖండంలోని కలదు. ఈ ఆసియా ఖండంలోనే మన భారత దేశం కలదు.
ఆసియా ఖండంలో భారత దేశం ఉనికి
దక్షిణ ఆసియాలో భాగమై, దక్షిణ మధ్య ఆసియా దేశమైన భారతదేశ భూభాగం ఒక ఖండానికి ఉండవలసిన లక్షణాలైన, అధిక విస్తీర్ణం మరియు భౌతిక, సాంఘిక, సంసృతి, వైవిధ్యత లను కలిగి ఉన్నందున ఒక “ఉపఖాండంగా” పిలువబడుతుంది.
అదే విధంగా భారతదేశానికి ఒక వైపు భూభాగం మూడువైపులా జల భాగం ఆవరించి ఉన్నందున దీనిని ద్వీపకల్పం గా పిలుస్తారు. భారతదేశం ఉత్తర అర్ధగోళంలోను, పూర్వార్థం గోళంలోనూ అంటే ఉత్తర అక్షాంశాల లోను తూర్పు రేఖాంశాల లో ఉంది.
ఉనికి – విస్తరణ
భారతదేశం 8 డిగ్రీ 4 సె నుండి 37 డిగ్రీ 6 సే. ఉత్తర అక్షాంశాల మధ్య ఉత్తర అర్ధ గోళంలో ను 68 డిగ్రీల 7 నుండి 97 డిగ్రీల 25 సెకండ్ల తూర్పు రేఖాంశాల మధ్య పూర్వార్ధ గోళంలో విస్తరించి ఉంది.
భారతదేశాన్ని దాదాపుగా రెండు సమాన భాగాలుగా చేస్తూ గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదే, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, త్రిపుర, మిజోరం 8 రాష్ట్రాల గుండా 23 1/2 డిగ్రీల ఉత్తర అక్షాంశం ప్రయాణిస్తుంది ఈ అక్షాంశం ను” కర్కట రేఖ” అంంటారు.
భారత దేశము ఉత్తర, దక్షిణ అగ్ర ల మధ్య దూరం 3214 కిలోమీటర్లు. తూర్పు, పడమర మధ్య దూరం 2933 కిలోమీటర్లు. తూర్పు, పడమరల విస్తరణ కూడా 30 డిగ్రీల రేఖాంశాలకు సమానంగా ఉంటుంది. భారతదేశంపై నుంచి సుమారుగా 30 అక్షాంశాలు, 30 రేఖంశాలు పోతున్నాయి.
భారతదేశ కాలమానం
మన దేశం లోని తూర్పు పడమర కొనల మధ్య రెండు గంటల కాల వ్యవధి వ్యత్యాసం ఉంటుంది. అంటే అరుణాచల్ ప్రదేశ్లో సూర్యుడు ఉదయించిన రెండు గంటల తర్వాత గుజరాత్లో సూర్యుడు ఉదయిస్తాడు . భారత ప్రామాణిక కాలాన్ని 821/2 డిగ్రీల తూర్పు రేఖాంశాల ఆధారంగా నిర్ణయిస్తారు.
ఇది గ్రీనిచ్ ప్రామాణిక కాలానికి 5.30 గంటల ముందు ఉంటుంది. 821/2 డిగ్రీల తూర్పు రేఖాంశం అలహాబాద్, కాకినాడ నగరాల గుండా ప్రయాణిస్తుంది. ఇది ఉత్తరప్రదేశ్ ,మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా ,ఆంధ్రప్రదేశ్ అనే 5 రాష్ట్రాల పై నుండి భారత దేశపు దక్షిణ అగ్రం అండమాన్ నికోబార్ దీవులలో నీ గ్రేట్ నికోబార్ దీవిలో ఉంది.
భారతదేశ సరిహద్దు లు
భారత దేశానికి ఉత్తర చివర జమ్మూకాశ్మీర్లోని “కిలిక్ దవన్ పాస్ ” . దక్షిణ చివర ప్రధాన దేశానికి “కన్యాకుమారి” . తూర్పు చివర అరుణాచల్ ప్రదేశ్ లోని పూర్వాంచల్ పర్వతాలులోని “కి బుతూ ప్రాంతం” . పశ్చిమ చివర గుజరాత్లోని రానా ఆఫ్ కచ్ లోని ద్వారకా ప్రాంతంలోని” గౌరు మూట ప్రాంతం.”
భారత దేశం విస్తీర్ణం
భారతదేశం 32,87,263 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఇది ప్రపంచ భూభాగంలో 2.42 శాతానికి సమానం. భారతదేశం 7వ అతిపెద్ద దేశం. రష్యా, కెనడా, అమెరికా, చైనా, బ్రెజిల్, ఆస్ట్రేలియా దేశాలు వైశాల్య పరంగా భారత్ కంటే పెద్దది. భారత్ తర్వాత స్థానంలో అర్జింటేనా ఉంది.
భారతదేశానికి దాదాపుగా 6100 కిలోమీటర్ల పొడవైన తీర రేఖ ఉంది. ఇది దేశం మొత్తం తీరరేఖ పొడవు7516 కి.మి. దేశానికి 15,106.7 కి.మి భూసరిహద్దు ఉంది. దేశానికి తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం ఉంది.
భారత దేశ రాష్ట్రాలు
భారతదేశంలో రాష్ట్రాలు, 7 సరిహద్దు దేశాలతో సరిహద్దులను కలిగి ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక,కేరళ ,తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా పశ్చిమబెంగాల్, 9 రాష్ట్రాలు సముద్రం సరిహద్దును కలిగి ఉన్నాయి. గుజరాత్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భూ సరిహద్దు మరియు సముద్రం సరిహద్దు కలిగి ఉన్నాయి. మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, జార్ఖండ్, హర్యానా, తెలంగాణ రాష్ట్రాలకు భూసరి హద్దు గానీ, సముద్ర సరి హద్దు గానీ లేని భూ పరివేస్తిత రాష్ట్రాలు. ఎక్కువగా 8 రాష్ట్రాలతో సరిహద్దులు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్.
భారత దేశానికి ఇండియా అను పేరు ఎలా వచ్చింది
భారతదేశానికి ఇండియా అనే పేరు సింధూ నది వలన వచ్చింది. గ్రీకులు సింధునది ఇండస్ గా పిలిచి దీని ప్రక్కన ఉన్న ప్రజలను ఇందోయులు అని పిలిచారు. తర్వాత కాలంలో ఆంగ్లేయులు దీన్ని ఇండియన్ / ఇండియా అని పిలిచారు. భారత దేశాన్ని విష్ణుపురాణంలో భారతీ అని ,బౌద్ధ సాహిత్యంలో జంబుద్వీపం అని పిలుస్తారు. పూర్వం భారత దేశాన్ని భరతుడు పాలించడం వల్ల భారతదేశం అని పేరు వచ్చింది.
భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు 562 సంస్థానాలుగా 9 బ్రిటిష్ ప్రావిన్సెస్ గా ఉండేవి. 1953 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము 14 రాష్ట్రాలుగా, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి, తర్వాత ఏర్పడిన రాష్ట్రాలతో కలిపి 25 రాష్ట్రాలు ఉండేవి. ప్రస్తుతం 7 కేంద్ర పాలిత ప్రాంతాలలో ఢిల్లీ క్వాజి స్టేట్ గా ఉంది.
దీవులు
భారతదేశంలో 247 ద్వీపాలు ఉన్నాయి. అందులో 204 బంగాళాఖాతంలోని మిగిలిన దీపాలు అరేబియా సముద్రంలో మరియు మన్నార్ సింధూ శాఖలో విస్తరించి ఉన్నాయి.
అండమాన్ దీవులు:
అండమాన్, నికోబార్ దీవులలో మధ్య అండమాన్ అతి పెద్దది. అతి చిన్నదీ రాష్ దీవి. నికోబార్ దీవులలో పెద్దదీ ది గ్రేట్ నికోబార్. చిన్నది పుల్లోమిల్లో. అండమాన్ నికోబార్ దీవులలో భారెన్ క్రియాశీల అగ్ని పర్వతం, నార్ఖండం విలుప్తా అగ్ని పర్వతం.
అండమాన్ నికోబార్ దీవుల్లో ఎత్తైన శిఖరం సెడ్లి శిఖరం. దీని ఎత్తు 737 మీటర్లు. ఇది ఉత్తర అండమాన్లో ఉంది. నికోబార్ దీవుల్లో ఎత్తైన శిఖరం తుల్లార్. దీని ఎత్తు 642 మీటర్లు . గ్రేట్ నికోబార్ దీవుల్లో ఉంది.
లక్ష దీవులు:
అరేబియా సముద్రం లోని దీవుల్లో లక్షదీవులు ముఖ్యమైనవి. ఈ దీవులు 19 కలవు. ఇవి ప్రవాహాల వలన ఏర్పడిన దీవులు. వీటిలో చాలా వరకు అతాల్ రకానికి చెందిన దివులున్నాయి. లక్ష దీవులలో చిట్టచివరి ఉన్న దీవి మినికాయ్. మొనికాయ్ దీవికి, సూహీలి దీవికి మద్యన ఉన్న ఛానెల్ 9 డిగ్రీ ఛానెల్ ఉంది. లక్ష దివులకి, మాల్దీవుల కి మధ్య 8 డిగ్రీ ఛానెల్ ఉంది. లక్ష దీవుల్లో అతి ముఖ్యమైన పెద్ద దీవి మీనికాయ్. చిన్నది బిట్రా దీవి. లక్ష దీవులు, మినికాయ దీవులు, అమీన్ దీవులు అన్నీ కలిపి 1973 లో లక్ష దివులుగ మార్చారు.
ఐరోపా ఖండం వాటి విశేషాలు
ఉష్ణ మండల ఎడారులు లేని ఖండం. ఇది రెండవ చిన్న ఖండం అత్యధిక జనసాంద్రత గల ఖండం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ద్వీపం కలాడిట్ నునెట్ ఇక్కడే ఉంది. ప్రపంచంలో పాదరసం ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో దేశం ఇటలీ.
ఆ ఐరోపా ఆసియా ఖండాల ను కలిపి యురేషియా అంటారు ఈ ప్రాంతంలో నివసించే ఆదిమజాతి వారిని లాప్ల్లు సమోయి డు లు అందురు .
అంటార్కిటికా ఖండం వాటి విశేషాలు
ఇది ఖండాల అన్నింటిలో ఎత్తయినది ప్రపంచంలో ఐదవ పెద్ద ఖండం. వృక్షాలు లేని ఏకైక ఉష్ణ మండల ఎడారులు లేని ఖండం అడవులు లేని ఏకైక ఖండం ప్రపంచంలో అతి శీతల ఖండం ప్రజలు స్థిరనివాసం ఏర్పరచుకోలేని ఏకైక ఖండం ఏమో బ్లాక్ మెయిల్ చేసారు కదా ప్రపంచంలో అతి పెద్ద వి ఐన బియర్డ్ మోర్ లు ఈ ఖండం లో కలవు ప్రపంచంలో అత్యంత శుష్క ప్రాంతాలు గల ఖండం 1820లో అంటార్కిటికా ను కనుకున్నారు.
ఆఫ్రికా ఖండం వాటి విశేషాలు
చీకటి ఖండం గా పిలవబడుతుంది. సముద్రపు జంతువుల అగుపించే ఖండం ఆఫ్రికా అంటే లాటిన్ భాషలో పూర్తి వెలుతురు అని అర్థం సంవత్సరం మొత్తం ఎక్కువ కిరణాలు ఆఫ్రికా ఖండం పై ప్రసరిస్తాయి ప్రస్తుతమున్న ఆఫ్రికాకు ఆ పేరుని సూచించినది రోమనులు.
ప్రపంచంలో వైశాల్యము లో రెండవ అతి పెద్ద ఖండం జనాభాలో రెండవ అతి పెద్ద ఖండం దేశాలు ఎక్కువగా గల ఖండం. ప్రపంచంలో అత్యంత పొడవైన నది నైలునద. ఆఫ్రికా ఖండంలో అతి చిన్న దేశం గాంబియా. ఈజిప్ట్ లో గల పిరమిడ్లు ప్రపంచం లో గల 7 వింతలలో ఒకటి
- ఆఫ్రికా ఖండములో సహారా ఎడారి కలహరి ఎడారి కలవు.
- మన ఆఫ్రికా ఖండంలో విక్టోరియా సరస్సు nyasa సరస్సు చాద్ సరస్సు కలవు
- ముఖ పర్వతాలు అట్లాస్ పర్వతాలు
ఆస్ట్రేలియా ఖండం వాటి విశేషాలు
దీనిని ద్వీప కాండం గా పేర్కొంటారు నిర్జన ఖండం అని పిలుస్తారు. సజీవ శిలాజాలు భూమి అని పిలుస్తారు వైశాల్యంలో ఖండాలను ఇంటిలోనికి అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా ఖండం ఆస్ట్రేలియా ఖండం 1788 వ సంవత్సరంలో కెప్టెన్ జేమ్స్ కుక్ కనుగొన్నాడు.
ఆస్ట్రేలియా లోని అతి ఎత్తయిన పర్వతశణి గ్రేట్ డివైడింగ్ రేంజ్. ఆస్ట్రేలియా ఖండంలో అతి ఎత్తైన శిఖరం కోషియస్కో. ఆస్ట్రేలియా లో అతిపెద్ద సరస్సు ఐరి. ఆస్ట్రేలియాలో ప్రధాన పంట గోధుమ.
దక్షిణ అమెరికా వాటి విశేషాలు
త్రిభుజాకారంలో ఆకారం లో గల ఖండం. పక్షి ఖండం గా పిలవబడుతుంది. కారణం ఈ ఖండం లో అనేక జాతుల రంగు రంగుల పక్షులు కలవు. భూమికి ఊపిరితిత్తులు గా పిలవబడుతున్న ఖండం. సూర్యుని అనుసరించి వర్షం అను లోకోక్తి గల ఖండం.
పేట గోనియ ఎడారి డిసెంబర్ ఇది సమ శీతోష్ణ మండల ఎడారి. Titicaca మార్ చిక్ విటా
ఆండీస్ పర్వతాలు బ్రెజీలియన్ హైలాండ్స్ మొదలైనవి పర్వతాలు కలవు ఖండం ల ఎత్తైన శిఖరం అకన్ గువా శిఖరం.
ఉత్తర అమెరికా ఖండం వాటి విశేషాలు
ఇది ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద ఖండం. ప్రపంచంలో ఎక్కువ అభివృద్ధి చెందిన ఖండం ప్రపంచంలో అతి పెద్ద మంచినీటి సరస్సు సుపీరియర్ సరస్సు ఖండంలోనే కలదు. ప్రపంచంలో ప్రసిద్ధి గాంచిన కొలరాడో అగాధ దరి కలదు. ప్రస్తుతం అమెరికా ఖండాన్ని కనుగొన్న వ్యక్తి ఇటలీకి చెందిన అమెరికా వేస్పూచి ప్రపంచంలో అతి పద్ద అల్యూమినియం కర్మాగారం అర్విడ వద్ద కలదు.
మీ ఖండంలో అతిపెద్ద నది మిసిసిపీ నది ప్రసిద్ధి సరస్సులు సుపీరియర్ మిచిగాన్ ఇరి మొదలైనవి మిసిసిపీ నది డెల్టా ను పక్షి పాద డెల్టా అందురు ఉత్తర అమెరికా ఖండం లో అతి శుష్క ప్రాంతం మృత లోయ.
ఖండాల అన్నింటిలో అతి పెద్దది ఆసియా ఖండం. అతి చిన్నది ఆస్ట్రేలియా ఖండం. అన్ని ఖండాల లోనూ అక్కడక్కడ అగ్నిపర్వతాలు, కొన్ని చోట్ల పీఠభూములు, మైదానాలు,కొన్ని పర్వతాలు చాలా ఏతైనవి గాను, మరి కొన్ని చాలా తక్కువ ఎత్తు లోనూ ఉంటాయి. సాధారణంగా పర్వత ప్రాంతాల చాలా చల్లగా, చదును గా ,వాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల జనాభా తక్కువగా ఉంటుంది.
పితభూములు, పర్వతల కన్నా ఎత్తు తక్కువగాను, పైన ఇంచు మించు చదునుగా, అంచులు ఎక్కువ ఏటవాలుగా ఉంటాయి. పర్వత ప్రాంతాల కన్నా పితభూమి ప్రాంతాలలో జనాభా ఎక్కువ. మైదనా ప్రాంతాలు కూడా చడునుగానే ఉంటాయి అందువలన అక్కడ కూడా జనాభా ఎక్కువ గా నివసిస్తారు.
భారతదేశానికి ఉత్తరాన ఉన్న హిమాలయాలు మంచుతో కప్పబడి ఉన్నాయి. ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్టు శిఖరం హిమాలయాల్లోనే ఉంది .
హిమాలయాలలో పుట్టిన గంగానది ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, దేశాలలో ప్రవహిస్తూ ఉంది. భారతదేశంలోని హిమాలయాలు, దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వతాలు, ఐరోపాలోని ఆల్ఫిన్స్ పర్వతాలు.
మహా సముద్రాలు
భూమి మీద ఉన్న విశాలమైన ఉప్పునీటి భాగములను”మహాసముద్రాలు” అని, చిన్న చిన్న వాటిని “సముద్రాలు” అని అంటారు. ఈ మహా సముద్రాలు వివిధ ఆకృతులలో, పరిమాణంలో ఉన్నాయి. అన్ని మహా సముద్రాలు 7 ఖండాల చుట్టూ విస్తరింప బడి ఉన్నాయి. అన్ని వైపులా నీరున్న చిన్న చిన్న భూభాగాలను” ద్వీపం” అని అంటారు. బ్రిటన్, గ్రీన్ లాండ్. మూడు వైపులా నీరు ఉండి ఒక వైపు భూభాగం గల ప్రాంతాలను “ద్వీపకల్పం “అని అంటారు.
మహా సముద్రాలు ఐదు అవి
1. పసిఫిక్ మహాసముద్రం
2.హిందూ మహా సముద్రం
3. అరేబియా మహా సముద్రం
4.అంటార్క్తిక్ మహా సముద్రం
5. ఆర్కిటిక్ మహాసముద్రం.
- మహా సముద్రాల అన్నింటిలో అతి పెద్దది పశిఫిక్ మహా సముద్రం. చిన్నది ఆర్కిటిక్ మహాసముద్రం.
- భూమి పై భూభాగం కన్నా జల భాగమే ఎక్కువ. సుమారు 75 శాతం భూ ఉపరితలం జలంతో కప్పబడి ఉంది.
సూర్యకిరణాల లోని వేడి వల్ల సముద్రపు నీరు ఆవిరతున్నది. ఈ ఆవిరైన నీరే ఉస్త్నోగ్రత తగ్గటం వల్ల చల్లబడి మేఘాలు గా మారుతాయి. మేఘాలు మరింత చల్లబడి వర్షం కురుస్తోంది. ఇలా నిరంతరంగా జరిగే ప్రక్రియను “నీటి చక్రం” అంటారు. ఈ ప్రక్రియలో నీరు నీటి ఆవిరిగా మరల నీరు గా మారూతు ఉంటుంది.
మహా సముద్రాల జలం అనేక లవణాల మిశ్రమం. సముద్ర జలాలలో అత్యధికం గా సోడియం క్లోరైడ్ (సాధారణ ఉప్పు) ఉంటుంది. సముద్రపు జలంలో సుమారు 96 శాతం నీరు ఉంటే మిగిలిన 4 శాతంలో లవణాలు,ఇతర కరగని ఘన పదార్థాలు ఉంటాయి. నదులలో నీ నీటి కన్నా సముద్రపు నీరు ఎక్కువ సాంద్రతను కల్గి ఉంటుంది.