Categories: Uncategorized

రక్త ప్రసరణ వ్యవస్థ మరియు రకాలు

రక్తం, గుండె మరియు ప్రసరణ వ్యవస్థ

రక్తనాళాలను, హృదయాన్ని కలిపి రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. రక్త ప్రసరణను మొదటిసారిగా ప్రయోగపూర్వకంగా తెలిపిన శాస్త్రవేత్త విలియం హార్వే. కావున ఇతనిని రక్తప్రసరణ పితామహుడు అంటారు. ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్కులేషన్. ఈ వ్యవస్థలో హృదయము, రక్తనాళాలు, రక్తము అనే నిర్మాణాలు కలవు.

ప్రసరణ

జీవులకు అవసరమైన పోషకాలు ఆక్సిజన్ ద్రవపదార్థాలు ఒక చోటి నుంచి మరొక చోటికి రవాణా అవ్వడాన్ని ప్రసరణ అంటారు. అమీబా హైడ్రో వంటి ఏకకణ జీవులలో  పదార్థాలు

రవాణా జరిగే విధానం -విస్తరణ లేదా వ్యాపనం, ద్రవాభిసరణం

హృదయం (గుండె)

రక్తనాళాల్లోకి రక్తాన్ని పంపు చేసే అవయవము. నిర్విరామంగా, విశ్రాంతి లేకుండా పని చేస్తుంది. మానవుని హృదయం బరువు సుమారు 300 గ్రాములు.

హృదయం యొక్క అధ్యయనాన్ని కార్డియాలజీ అంటారు. మానవుని హృదయం హృదయ కండరంతో నిర్మించబడి రెండు ఊపిరితిత్తులకు మధ్యగా శంకు ఆకారం లేదా త్రిభుజాకారంలో ఉంటుంది.

ఇది మన పిడికిలి పరిమాణంలో ఉంటుంది.  ఊరః కుహరంలో మధ్యలో ఉంటూ కొంచెం ఎడమ వైపు వాలి ఉంటుంది. మానవుని గుండెలో నాలుగు గదులు ఉంటాయి. పై రెండు గదులను కర్ణికలు అని, క్రింది రెండు గదులను జఠరికలు అని అంటారు. కర్ణికలు చిన్నవి, జఠరికలు పెద్దవి, కుడి కర్ణిక, ఎడమ జఠరికలు పెద్దవి.

హృదయ స్పందన

హృదయ కండరాల సంకోచ సడలికల వలన గుండె కదలికలు చెందడాన్ని హృదయ స్పందన అంటారు. దీనిని కొలిచేది స్టెతస్కోప్ (Stethoscope).

ఇది ఆరోగ్యవంతమైన మానవునిలో నిమిషానికి 72 సార్లు. చిన్నపిల్లలు నిమిషానికి 130 సార్లు వుంటుంది. ముసలి వారిలో నిమిషానికి 60 సార్లు గా ఉంటుంది చిన్న పిల్లల్లో, జ్వరం వచ్చిన వారిలో, వ్యాయామం చేసే వారిలో ఇది ఎక్కువ.

హృదయ స్పందన = ఒక సంకోచం +ఒక సడలిక =ఒక సిస్తోల్ + ఒక డయాస్తోల్

= ఒక లబ్+ ఒక డబ్

హృదయ స్పందన ప్రారంభం అయ్యే ప్రదేశం లయ రంభకం. ఒక హృదయ స్పందన పూర్తి కావడానికి పట్టే సమయం 0.8 సెకండ్స్. ఒక హృదయ స్పందనకు 70 మిల్లీలీటర్ల రక్తం పైకి వెళ్తుంది.

రక్త పీడనం

రక్తం రక్త నాళాలలో ప్రవహించేటప్పుడు వాటి గోడలపైన కలిగించే ఒత్తిడిని రక్త పీడనం అంటారు. ఆరోగ్యవంతమైన మానవునిలో సాధారణ రక్త పీడనం120/80mm of Hg. రక్త పీడనాన్ని కొలిచే పరికరం  స్ఫిగ్నోమానోమీటర్ (Sphygmomanometer). దీనిలో పాదరసాన్ని ఉపయోగిస్తారు.

రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేర్కొని పోతే వ్యాసము తగ్గి ఒత్తిడి ఎక్కువగా ఉండటాన్ని high bp అంటారు. రక్త పరిమాణం తక్కువగా ఉన్న వ్యక్తులలో ఒత్తిడి తక్కువగా ఉండడాన్ని low bp అంటారు. ఇది సాధారణంగా 100/60 గా ఉంటుంది.

హృదయ కండరాలకు రక్తాన్ని అనగా ఆహారం, ఆక్సిజన్ సరఫరా చేసే ధమని అయినా హృదయ ధమనికి అవాంతరాలు ఏర్పడినప్పుడు కండరాలకు ఆక్సిజన్, ఆహారం సరఫరా తాత్కాలికంగా గుండెకు ఆగిపోవడాన్ని “గుండెపోటు” అంటారు. దీన్ని” సైలెంట్ కిల్లర్” అని కూడా అంటారు.

ఆరోగ్యవంతుడైన మానవుని లో నిమిషానికి హృదయ స్పందనల సంఖ్య 72. నాడీ స్పందన ల సంఖ్యను హృదయ స్పందనల సంఖ్యను లక్షణాలను నిర్ణయిస్తారు. హృదయ స్పందనల సంఖ్య కోపము, భయం వలన పెరుగుతుంది.

హృదయ స్పందన ను మెదడులోనే మజ్జాముఖం  క్రమపరుస్తుంది. జ్వరం వచ్చినప్పుడు, వ్యాయామం చేసే వారిలో ప్రతిస్పందనలు సంఖ్య ఎక్కువగా ఉంటుంది. హృదయం యొక్క సంకోచాన్ని సిస్టిల్  అంటారు. హృదయం యొక్క సడలికను డయాస్టోలిక్ అంటారు.

రక్తనాళాలు

గుండె మొత్తం శరీరానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. రక్తం శరీరంలోని ప్రతి భాగానికి మనం తీసుకున్న ఆహారాన్ని, ఆక్సిజన్ తీసుకువెళుతుంది. మనం తిన్న ఆహారం రక్తంతో కలిసి రక్తనాళాల ద్వారా శరీరంలోని వివిధ భాగాలకు వెళ్లి మనం పనులు చేసుకోవడానికి అవసరమైన శక్తిని ఇవ్వడానికి ఉపకరిస్తుంది.

శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి రోగ కారకాలపై పోరాడటానికి ఉపయోగపడుతుంది. రక్తంలో ఎక్కువగా ద్రవరూపంలో ఉన్నా ప్లాస్మా ఉంటుంది.

మూడు రకాల రక్తకణాలు ఉంటాయి. అవి ఎర్రరక్త కణాలు, తెల్లరక్త కణాలు, రక్త ఫలికికలు. ఎర్ర రక్తణాలు శరీరంలో ఉన్న అన్ని కణాలకు ఆక్సీజన్ అందిస్తాయి. తెల్ల రక్తకణాలు రోగకారక క్రిములతో పోరాడతాయి. రక్త ఫలికికలు రక్తం గడ్డ కట్టడం లో సహాయపడతాయి. గుండె కు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే వైద్యుడు ను కార్డియాలజీస్ట్ అని అంటారు.

మన శరీరంలోని రక్తం సరిగా సరఫరా అయినప్పుడే మనం ఆరోగ్యముగా ఉంటాము. శరీరంలో రక్తం బాగా ఉండాలంటే బలమైన ఆహారం తీసుకోవాలి. పల్లి ఉండలు, నువ్వులు, గుడ్లు,పాలు, ఆకుకూరలు, మొదలగునవి తీసుకుంటే రక్తం వృద్ది చెందుతుంది.

రక్తం

ద్రవ రూపంలో ఉండి శరీరంలోని అన్ని భాగాలను  కలుపును. కావున “ద్రవరూప సంయోజక కణజాలం” అంటారు. ఇది ఒక కొల్లాయిడీ . కొల్లైడ్   అనగా సచ్చిద్ర పొర ద్వారా నెమ్మదిగా కదిలే పదార్థాలు.

ఉదాహరణ – గుడ్డు తెల్లసొన , రక్తం, జిగురు ,agar-agar,మొదలైనవి. ఆరోగ్యవంతమైన మానవుని సగటు రక్త పరిమాణం 5 లీటర్లు. ఎత్తయిన ప్రదేశంలో ఎక్కువ. దీని యొక్క పీ.హెచ్ విలువ  7.4   అనగా ఈ స్థితిలో ఉంటుంది.

రక్తం ఉత్పత్తి కావటాన్ని “ హిమూ పాయసిస్” అంటారు. రక్తం ఎర్రగా ఉండడానికి కారణం హిమోగ్లోబిన్ . ఇది ఏర్పడాలంటే 4  fe పరమాణువులతో ఏర్పడిన పార పైరిల్ వలయం అనగా హీం, గ్లోబిన్ అనే ప్రోటీన్  అవసరం.

తెలుపు, వర్ణరహిత రక్తం గల జీవి బొద్దింక. ఇందుకు కారణం హిమోగ్లోబిన్ లోపం.  నీలి వర్ణపు రక్తం గల జీవి నత్త బొద్దింక కారణం హిమో సయానిన్  అనే వర్ణకం ఉంటుంది. 

రక్తం గడ్డ కట్టిన తరువాత దీని పై ఏర్పడే లేత పసుపు రంగుపదార్ధాన్ని ” సీరం” అంటారు. దీనిలో రక్త కణాలు, ప్రోటీన్స్ వండవు. దీని యొక్క అధ్యయనాన్ని   “సీరాలజీ “అని అంటారు. మన దేశంలో శ్రీ రామ్ ఇన్స్టిట్యూట్ పూణే లో కలదు.

రక్తం మరియు గుండె

రక్తం ఒక ద్రవరూప సంధాయక కణజాల ఇది మన ఆరోగ్యాన్ని తెలుపుతుంది. మన శరీర భాగాలన్నింటికీ రక్తాన్ని పంపు చేసే మంత్రం గుండె. 

గుండె 24 గంటల్లో 30,000 మిల్లీలీటర్ల రక్తాన్ని 20వేల కిలోమీటర్ల దూరం వరకు పంపు చేయును 

  • రక్తనాళాల్లో ప్రవహించే ఎర్రటి   ద్రవపదార్థం రక్తం
  • బొద్దింక లో రక్తం తెలుపు వర్ణం లేదా వర్ణ  రహితంగా ఉంటుంది
  • నత్త లో రక్తం నీలం రంగులో ఉంటుంది
  • మొలస్కా వర్గపు జీవులలో హిమో సాయననిస్ అనే వెనక పదార్థం వుండడం వలన రక్తం నీలం రంగులో వుండును
  • హీమో శయననిస్ లో వుండే మూలకం కాపర్

రక్తంలో ప్రధానంగా ప్లాస్మా మరియు రక్తనాళాలు

ప్లాస్మా

రక్తంలో దీని శాతం 55%, దీనిలో నీటి శాతం 90% ఉండును. ద్రవరూపంలో ఉండును. దీనిలో   ఆల్బ్యుమిన్స్, అనే ప్రోటీన్ fibrinogen అనే రక్తాన్ని గడ్డకట్టించే కారకాలు ఉండును.

రక్త కణాలు మరియు రకాలు

రక్తం నుండి ప్లాస్మాను తొలగించి గా మిగిలిన పదార్థాలే రక్తకణాలు. వీటి సంఖ్య 25 కోట్లు. ఇవి మూడు రకాలు

  • ఎర్ర రక్త కణాలు
  • తెల్ల రక్త కణాలు
  • రక్త ఫలకికలు
ఎర్ర రక్త కణాలు

ఎర్ర రక్త కణాలను ఎరిత్రోసైట్ అంటారు. వీటిలో కేంద్రకం వుండదు. కానీ ఉంటే లామా వంటి జీవులలో కేంద్రకం ఉంటుంది. ఒక మిల్లీ లీటరు రక్తం లోని ఐదు మిలియన్ల ఎర్ర రక్త కణాలు ఉంటాయి.

ఇవి ఎముక మజ్జ లేదా అస్థి మజ్జ లో ఉత్పత్తి అవుతాయి. శిశువు తల్లి గర్భం లో ఉండేటప్పుడు ఎర్ర ఎర్రరక్తకణాలు కాలేయం ప్లీహం లో ఉత్పత్తి అవుతాయి. మన శరీరంలోని ఎర్రరక్తకణాలు అన్నింటినీ ఒక గొలుసులాగా అమర్చితే వాటి పొడవు  భూమధ్యరేఖకను ఏడు సార్లు చుట్టి రావచ్చు.

ఎర్ర రక్త కణాలు లోపించిన జీవి వానపాము. అయినా దీని రక్తం ఎర్రగా ఉండడానికి గల కారణం హిమోగ్లోబిన్ అనేది ప్లాస్మాలో కలిగి ఉంటుంది. ఎర్ర రక్త కణాల ఆకారం బల్లపరుపుగా, ద్విపుటాకారంగా ఉంటాయి.

ఇవి గుంపులు, గుంపులుగా ఉంటాయి. ఈ గుంపులను “roulexs” అంటారు. కేంద్రకం ఉండదు. కానీ ఒంటె భామనే క్షీరదాలలో కేంద్రకం ఉంటుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తి అయినా ప్రదేశాలు పెద్దవారిలో అయితే ఎముక మధ్య, చిన్న వారిని అయితే  కాలేయం.

ఈ ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 రోజులు. ఎర్ర రక్త కణాలు నాశనం అయిన ప్రదేశాలు కాలేయం, ప్లీహం కావున వీటిని స్మశానవాటికలు అంటారు. ఎర్ర రక్తకణాల్లో హీమోగ్లోబిన్ ఒక వర్ణక పదార్థం లేదా ప్రోటీన్ ఉంటుంద. హిమోగ్లోబిన్ O2 మరియు CO2 రవాణాలో తోడ్పడుతుంది.

తెల్ల రక్త కణాలు

వీటిని ల్యుకో   సైట్స్ అని భక్షక కణాలు సూక్ష్మ రక్షక భటులు అని కూడా అంటారు. కారణం ఇవి వ్యాధి కారక సూక్ష్మజీవులను నుంచి కాపాడే వీటిని చంపి ఆహారంగా స్వీకరిస్తూ ఉంటాయి. 

వీటిలో హిమోగ్లోబిన్ ఉండదు. తక్కువ సంఖ్యలో ఉంటాయి కేంద్రకం ఉంటుంది. మన శరీరంలోనికి ప్రవేశించిన సూక్ష్మజీవులను నాశనం చేస్తాయి. కొన్ని తెల్ల రక్త కణాలు సూక్ష్మజీవులను ఎదుర్కోవడంలో తన జీవితాన్ని త్యాగం చేస్తాయి. యుద్ధంలో చనిపోయిన తెల్ల రక్త కణాలు గాయాల వద్ద చీము రూపంలో బయటకు వస్తాయి.

తెల్ల రక్త కణాలు ఆకారం గుండ్రంగా ఉంటాయి. తెల్ల రక్తకణాలకు కేంద్రకం అనేది ఉంటుంది. వీటి యొక్క ఉత్పత్తి అయ్యే ప్రదేశం శోషరస గ్రంధులు. వీటి యొక్క ఉత్పత్తిని leeco pisces అని అంటారు. వీటి యొక్క జీవితకాలం 12 -13 రోజులు. 

తెల్ల రక్త కణాలు రెండు రకాలు అవి
  • కని కాభ కణాలు లేదా గ్రాన్యులో సైట్స్
  • కని కాభా రహిత కణాలు లేదా ఏ గ్రన్యులో సైట్స్

గ్రాన్యూలో సైట్స్ , ఎసిడో పైల్స్, ఇసినో ఫైల్స్ , న్యుట్రో ఫైల్స్ అని మూడు రకాలు 

ఏ గ్రాన్యులో సైట్స్ మోనో సైట్స్, లిం ఫో సైట్స్  అనే రెండు రకాలు 

న్యూట్రోఫిల్స్ శరీరంలోకి ప్రవేశించిన బాహ్య పదార్థాలను ఎదుర్కొనే ప్రతి దేహాలను ఉత్పత్తి చేస్తాయి కావున వీటిని సూక్ష్మ రక్షకభటులు అంటార

మోనో సైట్స్ కనికాభా కణాలు తో పాటుగా అమీబా వలే చెల్లిస్తూ శరీరంలోకి ప్రవేశించిన బాహ్య పదార్థాలను రక్షించి నాశనం చేస్తాయి. కావున వీటిని పారిశుద్ధ్య కార్మికులు లేదా ఫాగో సైట్స్ అంటారు.

రక్త ఫలకికలు

ఇవి బల్లపరుపుగా ఉంటాయి కేంద్రకం ఉండదు ఏదైనా గాయం అయినప్పుడు అక్కడికి చేరి రక్తస్రావాన్ని ఆపుతాయి.

డెంగ్యూ ను కలిగించే వైరస్ వీటి పై తీవ్ర ప్రభావం చూపడం వలన వీటి సంఖ్య తగ్గుతుంది. రక్తఫలకికలు రక్తాన్ని గడ్డకట్టించే వీటి యొక్క  ముఖ్య విధి. కావున వీటిని టామ్ బ్రో సైట్స్అని కూడా అంటారు.

రక్తాన్ని గడ్డకట్టించే కుండా   నిరోధించే శరీరంలోని సహజ కారకం హెపారిన్. బ్లడ్ బ్యాంకులో    ఈ డి టి ఏ  ని కూడా వారి రక్తంలో కాల్షియం తొలగించి నిల్వచేస్తారు. బ్లడ్ బ్యాంకులలో నిల్వచేసే కాలం మూడు నాలుగు నెలలు.

రక్త వర్గాలు

మొట్టమొదటిసారిగా ఏ, బి, ఓ అనే మూడు రక్త వర్గాలను గుర్తించిన శాస్త్రవేత్తలు లాండ్ స్టీనర్. మిగిలిన రక్త వర్గమైన ఏ బి ని గుర్తించిన డిస్టిలరీ హాస్టల్ లో కొత్తగా గుర్తించబడినది M,N,S,P. రక్త వర్గాల   పైన అధికంగా పరిశోధనలు చేశారు.

అతని ఫాదర్ ఆఫ్బ్లడ్ గ్రూప్స్ అని అంటారు. ఇతని జన్మదినమైన జూన్ 14న ప్రపంచ దినోత్సవం గా జరుపుకుంటారు. 

 ప్రపంచంలో అధికంగా ఉండే రక్తవర్గం B+. ప్రపంచంలో  తక్కువగా ఉండే రక్త వర్గం AB+  . ప్రపంచంలోని ఏ వర్గానికి అయినా ఇచ్చే రక్త వర్గం O.  కావున వీరిని  విశ్వదాత  అంటారు.

కారణం వీరి  రక్తంలో ప్రతి జనకాలు ఉత్పత్తి కాకపోవడం. ఏ రక్తం వర్గం నుండి అయినా  రక్తం స్వీకరించేవారు AB. కావున వీటిని విశ్వ గ్రహీత లు అని అంటారు.

కారణం వీటి రక్తంలో ప్రతిరక్షకాలు ఉత్పత్తి కావు. ఇండియాలో  B ఎక్కువ, O తక్కువ. రక్తాన్ని 16 నుండి 60 సంవత్సరాలు వారు ప్రతి మూడు నెలలకు ఒకసారి 200 ml రక్తాన్ని జీవితకాలంలో 168 సార్లు ఇవ్వ వొచ్చు.

హెచ్ఐవి, క్యాన్సర్ వ్యాధిగ్రస్థులు ఇవ్వకూడదు. ఒక వ్యక్తి నుండి రక్తాన్ని దాని నుండి తీసి మరొక వ్యక్తి  సిర ఎక్కించడానికి రక్త ప్రవేశం అంటారు.

ఒకవేళ ఇద్దరి బ్లడ్ గ్రూప్ సరిపోకపోతే రక్తనాళాల్లో రక్తం ఏర్పడి రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడితే దానిని” రక్త గుచ్చ కరణం ” అంటారు.

ఆర్హెచ్ కారకం

మానవునిలో, రేసెస్ కోతుల లో Rh కారకాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు లాండ్ స్టీనర్, అలెగ్జాండర్ విన్నర్ .Rheses   పేరులోని మొదటి రెండు అక్షరాలు మీదుగా  Rh పేర్కొనడం జరిగింది.

ఈ కారకం ఎర్రరక్తకణాల పై  ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నట్లయితే Rh+, లేనట్లయితే Rh-  అని అంటారు .కాబట్టి రక్తమార్పిడి జరిపేటప్పుడు ఏ, బి, ఓ  వర్గాలతో  పాటు సముదాయాన్ని Rh రక్త సముదాయాన్ని కూడా పరీక్షించడం మంచిది.

బ్లూ బేబీ

చిన్నపిల్లలు హృదయంలోని జఠరికల మధ్య రంధ్రం ఏర్పడడం ద్వారా చెడు రక్తం, మంచి రక్తం మిశ్రమం శరీరం లోకి మార్పు చెందుతుంది. ఈ విధంగా మార్పు చెందడం వలన శరీరం నీలం రంగులోకి మారుతుంది ఇటువంటి చిన్న పిల్లలను బ్లూ బేబీ గా పిలుస్తాము.

విశ్వ దాతలు

O రక్తవర్గం గల వ్యక్తుల్లో వారి రక్త కణాల మీద ప్రతి జనకాలు ఉండవు. అందుచేత గ్రహీతలలో రక్త కణాలు గుచ్చకరణం ఏర్పడదు. .అందుచేత O గ్రూపు రక్తం గల వ్యక్తి ఏ గ్రూపు గల వారికైనా రక్తాన్ని దానం చేయవచ్చు. అందువల్ల O గ్రూపు గల వారిని విశ్వదాత లు అని అంటారు.

విశ్వ గ్రహీతలు

 AB రక్తవర్గం గల వ్యక్తుల ప్లాస్మాలో ప్రతిరక్షకాలు ఉండవు. అందుచేత వారి రక్తం, ఇతర వర్గాల రక్తంతో చర్య జరపదు . కాబట్టి AB రక్త వర్గం గల ఇతర వర్గాల వ్యక్తులు రక్తాన్ని గ్రహించ వచ్చు అందువల్ల వీరిని విశ్వ గ్రహీత అని అంటారు.

సార్వత్రిక దాత లేదా విశ్వదాత  0 

సార్వత్రిక లేదా విశ్వ గ్రహీత  A B

aravellisharma32

Recent Posts

బాలల హక్కుల పరిరక్షణ మరియు అభివృద్ధి Protection, and development of children’s rights

బాలల హక్కులు Children's rights నేటి బాలలు, రేపటి భావి భారత పౌరులు. నేటి పిల్లలే రేపటి పెద్దలు. రేపటి…

2 months ago

ప్రపంచంలో అనేక ఖండాలు -భారతదేశం మరియు మహా సముద్రాలూ

ఖండాలు -మహా సముద్రాలూ మరియు భారతదేశం దేశాలు ఉన్న విశాల భూభాగాన్ని మనం మన సౌలభ్యం కోసం సాధ్యమైనంత వరకు…

4 months ago

అంతరిక్ష రంగం మరియు ప్రయోగాలు

అంతరిక్ష రంగం భూమి చుట్టూ ఉన్న ప్రదేశమును అంతరిక్షం లేదా ఖగోళం లేదా రోదశి అని అంటారు. దీని గురించి…

6 months ago

వాతావరణం మరియు గాలి

వాతావరణం అంటే ఏంటి? మన చుట్టూ ఉండే గాలే వాతావరణం. ఈ గాలిలో అనేక వాయువులు, దుమ్ము, దూళి, నీటి ఆవిరి…

7 months ago

అనేక రకాల శక్తి రూపాలు మరియు వాటి ఉపయోగాలు (Many form of Energy and uses)

శక్తి (Energy)     పని చేయగల సామర్థ్యాన్ని శక్తీ అనీ పిలుస్తారు. పని, శక్తి రెండూ ఒకే ప్రమాణం కలిగి…

7 months ago

వర్షం లేదా వాన వల్ల లాభాలు మరియు రకాలు Benefits and types of rain or rain

వాన నీరు భూమిని చేరడం Rainwater accumulation on land వాన లేదా వర్షం ఆకాశంలో మేఘాలు నుండి భూతలం…

8 months ago