Categories: Uncategorized

భారతదేశంలో వ్యవసాయ మరియు ఖనిజ పరిశ్రమలు

భారతదేశంలో పరిశ్రమలు

పరిశ్రమల స్థాపనకు మౌలిక అవసరాలు

దేశ అభివృద్ధిలో పరిశ్రమలది కీలకపాత్ర భారతదేశంలో చాలా కాలం పాటు చేతి వృత్తులు ప్రత్యేకించి బట్టల తయారీ ప్రధాన పరిశ్రమగా ఉండింది. వలస పాలనలో కొన్ని పరిశ్రమలు మినహాయించి దేశంలో బలమైన పారిశ్రామిక పునాది పడలేదు. అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేసే సామర్థ్యం భారత పారిశ్రామిక రంగానికి లేదు.

అనేక పారిశ్రామిక వస్తువులను భారతదేశం దిగుమతి చేసుకునేది. 1947 తర్వాత దేశంలో పారిశ్రామిక ప్రగతికి అనేక చర్యలు తీసుకున్నారు. దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న మన అవసరాల్లో స్వయంసమృద్ధి సాధించాలన్న ఆశయాలతో కృషిచేశారు.

కర్మాగారాలకు యంత్రాలు కావాలి. ఉదాహరణకు బట్టలు తయారు చేసే ఆధునిక పరిశ్రమ కు చేతి మగ్గం కాకుండా విద్యుత్ తో నడిచే మరమగ్గాలు కావాలి. ఈ మరమగ్గాల ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ బట్టను ఉత్పత్తి చేయవచ్చు.

అదే విధంగా సిమెంటు కార్లు వంట నూనె వంటి వాటి ఉత్పత్తికి సంక్లిష్ట యంత్రాలు కావాలి. ఈ యంత్రాలు నడపడానికి ఈ కర్మాగారాలు అన్నింటికి ఇంధన వనరు, సాధారణంగా విద్యుత్ కావాలి కాబట్టి కర్మాగారాలకు యంత్రాలు వాటి నడపడానికి విద్యుత్ కావాలి.

అంతేకాకుండా కర్మాగారాలకు వస్తువుల తయారీకి అవసరమయ్యే ముడు సరుకులు కావాలి. ఉదాహరణకు సైకిల్ తయారీ చేయటానికి ఉక్కు కావాలి ఇనుము బొగ్గుతో ఉక్కు సీట్లు తయారు చేసే కర్మాగారాలు కొన్ని ఉన్నాయి.

మరికొన్ని కర్మాగారాలు ఈ ఉక్కు సీట్ల ఉపయోగించి ఉక్కు పైపులను తయారు చేస్తాయి. చివరకు సైకిళ్ల కర్మాగారం ఈ పద్ధతులను ఉపయోగించి సైకిల్ ఫ్రేమ్ తయారు చేస్తుంది.

ఉక్కుకు ఇనుము బొగ్గు వంటి మూడు పదార్థాలు మౌలిక వనరులను విషయాన్ని గుర్తించండి. అంటే పరిశ్రమలకు అవసరమయ్యే వివిధ ముడుసరుకులు తయారీకి ఖనిజాలు మూడు లోహాలు మౌలిక వనరులు అవుతాయి.

కొన్ని కర్మాగారాలు తయారు చేసే అనేక రకాల వస్తువులను ఇతర కర్మాగారాలు ఉపయోగించుకుంటాయి. అంటే ప్రజలు ఉపయోగించే వినియోగ వస్తువుల తయారీ కావాలంటే ఉత్పత్తి ప్రక్రియలో వివిధ దశలలో అనేక కర్మాగారాలు పాత్ర ఉంటుంది

కర్మాగారాలకు ముడిసరుకు చేరవేయడానికి అక్కడినుంచి తయారైన సరుకులకు మార్కెట్ కు అందించడానికి రవాణా సౌకర్యాలు కావాలి. దీనికి కొన్ని మౌలిక సదుపాయాలు ఉండాలి.

పట్టణాలు పల్లెలు కలిపే చక్కటి రోడ్డు వ్యవస్థ రైలు ద్వారా సరుకులు రవాణా చేసే వ్యవస్థ పెద్దపెద్ద గోడలకు వీలుగా నుండి సరుకు నింపడానికి దింపటానికి దోహదం చేసే సదుపాయాలు కాబట్టి పారిశ్రామికీకరణ చెందాలంటే వివిధ కర్మ గారాల పెద్ద సంఖ్యలో అభివృద్ధి చెందాలంటే యంత్రాలు విద్యుత్ ఖనిజాలు లోహాలు రవాణా సౌకర్యాలు వంటి కొన్ని మౌలిక సౌకర్యాలు అవసరం.

ఈ అవసరమైన సరుకులను యంత్రాలు విద్యుత్ ఖనిజాలు లోహాలు రవాణా సౌకర్యాలను తయారుచేసే పరిశ్రమలు మౌలిక పరిశ్రమలు అంటారు. అనేక రకాల కర్మాగారాలకు అవసరమైన మౌలిక సరుకులను ఈ మౌలిక చూద్దాం.

పరిశ్రమలు నెలకొల్పే ప్రదేశం

పరిశ్రమలను ఎక్కడ నెలకొల్పాలని అనేక సంక్లిష్ట అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ముడిసరుకుల లభ్యత కూలీలు అందుబాటు పెట్టుబడి విద్యుత్తు మార్కెట్ వంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది.

అయితే ఇవన్నీ ఒకే చోట లభ్యం కావడం చాలా అరుదైన విషయం అందుకనే పరిశ్రమలు అన్ని అంశాలు అణువుగా అందుబాటులో ఉండే ప్రదేశాలలో అందుబాటులో ఉండే ప్రదేశాల్లో లేదా తక్కువ ఖర్చుతో సమకూర్చు గల ప్రదేశాలలో నెలకొల్పుతారు.

కాబట్టి పారిశ్రామికీకరణ పట్టణీకరణ జంటగా పురోగమిస్తూ సాయి పట్టణాలు మార్కెట్ గా ఉండటమే కాకుండా బ్యాంకింగ్ బీమా రవాణా కార్మికులు సలహాదారులు ఆర్థిక సలహాలు వంటి సేవలను కూడా అందిస్తాయి.

పట్టణ కేంద్రాల్లో కల్పించే అనేక సేవలను ఉపయోగించుకోవటానికి అనేక పరిశ్రమలు అక్కడ కేంద్రీకృతమై ధోరణి కనబడుతుంది. వీటిని బృహత్ పారిశ్రామిక వ్యవస్థ అంటారు. క్రమేపీ ఒక పెద్ద పారిశ్రామిక కేంద్రం ఏర్పడుతుంది.

స్వాతంత్రానికి ముందు అనేక పరిశ్రమలు విదేశీ వ్యాపార దృష్ట్యా ముంబై కోల్కతా చెన్నై వంటి పట్టణాల్లో ఏర్పడ్డాయి. ఫలితంగా చుట్టు విశాల వ్యవసాయ గ్రామీణ ప్రాంతాలతో కూడిన పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన పట్టణాలు ఏర్పడ్డాయి.

వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు

వ్యవసాయ ఉత్పత్తుల పై ఆధారపడిన పరిశ్రమలను వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అంటారు.

వస్త్ర పరిశ్రమ

భారత దేశ ఆర్థిక వ్యవస్థలో వస్త్ర పరిశ్రమ ది ప్రత్యేక స్థానం పారిశ్రామిక ఉత్పత్తిలో 14 శాతం వ్యవసాయం తర్వాత అత్యంత అధిక ఉపాధి కల్పించే పరిశ్రమ ఇదే. విదేశీ మారక ద్రవ్య ఆదాయంలో 24.6 శాతం ఈ రంగం నుంచే వస్తుంది.

స్థూల జాతీయోత్పత్తి లో నాలుగు శాతం ఈ పరిశ్రమ నుంచి వస్తుంది స్వయం సమృద్ధి గా ఉండి విలువ పెంపొందించే శృంఖలం మొత్తం ముడు సరుకు నుంచి అత్యంత విలువైన ఉత్పత్తుల వరకు ఉన్న ఏకైక పరిశ్రమ వస్త్ర పరిశ్రమ.

నూలు వస్త్రాలు; ప్రాచీన భారతదేశంలో చేతితో దారం వాడికి చేనేత ద్వారా బట్ట నేసేవారు 18వ శతాబ్దం తర్వాత మరమగ్గాలు వాడకంలోకి వచ్చాయి వలస పాలనలో ఇంగ్లాండ్లో మిల్లులు తయారైన బట్టతో పోటీపడ్డ లేని కారణంగా మన సాంప్రదాయ వృత్తులు దెబ్బతిన్నాయి.

ప్రస్తుతం దేశంలో పదహారు వందల నూనె మిల్లులు ఉన్నాయి వీటిలో 80 శాతం ప్రైవేటు రంగంలోనూ మిగిలినవి ప్రభుత్వ సహకారం రంగాలలోనూ ఉన్నాయి ఇవి కాక 4 నుంచి 10 వరకు ఉండే చిన్న కర్మాగారాలు వేల సంఖ్యలో ఉన్నాయి.

జనపనార పరిశ్రమ

జనపనార ,జనపనార వస్తువుల ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశాన్ని మొదటి స్థానం ఎగుమతులు విషయంలో బంగ్లాదేశ్ తర్వాత రెండో స్థానం భారత దేశంలో సుమారుగా 70 జనపనార మిల్లు ఉన్నాయి వీటిలో అనేకం పశ్చిమబెంగాల్లో హుగ్లీ నది తీరం వెంట 98 కిలోమీటర్ల పొడవు మూడు కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నాయి.

పంచదార పరిశ్రమ; ప్రపంచంలో పంచదార ఉత్పత్తిలో భారతదేశం ఇది రెండవ స్థానం బెల్లం ఖండసారి చక్కెర ఉత్పత్తిలో మనది మొదటిస్థానం ఈ పరిశ్రమకు అవసరమైన ముడిసరుకు చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది రవాణాలో చెరుకుగడ లోని సుక్రోజ్ శాతం తగ్గుతుంది.

దేశంలో ఉత్తరప్రదేశ్ బీహార్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ గుజరాత్ పంజాబ్ హర్యానా మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో 460 చక్కెర మిల్లులు ఉన్నాయి. 60 శాతం బిల్లులు ఉత్తరప్రదేశ్ బీహార్ లో ఉన్నాయి ఈ పరిశ్రమ సంవత్సరంలో కొన్ని నెలల పాటు మాత్రమే పని చేస్తుంది కాబట్టి ఇది సహకార రంగానికి అనువైనది.

ఇటీవలి కాలంలో పంచదార కర్మాగారాల దక్షిణ-పశ్చిమ రాష్ట్రాలకు ప్రత్యేకించి మహారాష్ట్రకు మరి అక్కడ కేంద్రీకృతం అవుతున్నాయి ఈ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే చెరకులో సుక్రోజ్ శాతం ఎక్కువగా ఉండటమే దీనికి కారణం వాతావరణం చల్లగా ఉండటం వల్ల కూడా నరికే కాలాన్ని పొడిగించుకోవచ్చు అంతేకాకుండా ఈ రాష్ట్రాల్లో సహకార కర్మాగారాలు బాగా పనిచేస్తున్నాయి .

సంవత్సరంలో కొన్ని నెలల పాటు మాత్రమే పని వండడం పాత అంతగా సమర్ధత లేని ఉత్పత్తి విధానాలు చెరుకు గడలను కర్మాగారాలకు చేయడంలో ఆలస్యం చెరకు ఉపయోగాలు పెంచటం వంటివి ఈ పరిశ్రమ ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాళ్ళు.

ఖనిజ ఆధారిత పరిశ్రమలు

ఖనిజాలు లోహాలు నువ్వు మూడు రకాలుగా ఉపయోగించే పరిశ్రమలను ఖనిజ ఆధారిత పరిశ్రమలు అంటారు ఈ కోవలోకి వచ్చే కొన్ని పరిశ్రమలు1) ఇనుము ఉక్కు కర్మాగారాలు 2) అల్యూమినియం శుద్ధి

ఇనుము ఉక్కు కర్మాగారాలు

ఇనుము ఉక్కు పరిశ్రమలు మౌలిక పరిశ్రమలు ఇతర భారీ మధ్య తరహా తేలికపాటి పరిశ్రమలన్నీ తమకు కావలసిన యంత్రాలకు వీటిపై ఆధారపడి ఉన్నాయి అనేక రకాల ఇంజనీరింగ్ వస్తువుల భవన నిర్మాణ సామాగ్రి రక్షణ వైద్య శాస్త్ర పరికరాలు అనేక వినియోగదారు వస్తువుల వంటి వాటికి అవసరం

Hari Shankar Sharma

View Comments

Recent Posts

బాలల హక్కుల పరిరక్షణ మరియు అభివృద్ధి Protection, and development of children’s rights

బాలల హక్కులు Children's rights నేటి బాలలు, రేపటి భావి భారత పౌరులు. నేటి పిల్లలే రేపటి పెద్దలు. రేపటి…

2 months ago

ప్రపంచంలో అనేక ఖండాలు -భారతదేశం మరియు మహా సముద్రాలూ

ఖండాలు -మహా సముద్రాలూ మరియు భారతదేశం దేశాలు ఉన్న విశాల భూభాగాన్ని మనం మన సౌలభ్యం కోసం సాధ్యమైనంత వరకు…

4 months ago

అంతరిక్ష రంగం మరియు ప్రయోగాలు

అంతరిక్ష రంగం భూమి చుట్టూ ఉన్న ప్రదేశమును అంతరిక్షం లేదా ఖగోళం లేదా రోదశి అని అంటారు. దీని గురించి…

6 months ago

వాతావరణం మరియు గాలి

వాతావరణం అంటే ఏంటి? మన చుట్టూ ఉండే గాలే వాతావరణం. ఈ గాలిలో అనేక వాయువులు, దుమ్ము, దూళి, నీటి ఆవిరి…

7 months ago

అనేక రకాల శక్తి రూపాలు మరియు వాటి ఉపయోగాలు (Many form of Energy and uses)

శక్తి (Energy)     పని చేయగల సామర్థ్యాన్ని శక్తీ అనీ పిలుస్తారు. పని, శక్తి రెండూ ఒకే ప్రమాణం కలిగి…

7 months ago

రక్త ప్రసరణ వ్యవస్థ మరియు రకాలు

రక్తం, గుండె మరియు ప్రసరణ వ్యవస్థ రక్తనాళాలను, హృదయాన్ని కలిపి రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. రక్త ప్రసరణను మొదటిసారిగా…

8 months ago